తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Lava Blaze 2: 128జీబీ స్టోరేజ్, 5000mah బ్యాటరీతో లావా బ్లేజ్ 2 బడ్జెట్ మొబైల్ లాంచ్

Lava Blaze 2: 128జీబీ స్టోరేజ్, 5000mAh బ్యాటరీతో లావా బ్లేజ్ 2 బడ్జెట్ మొబైల్ లాంచ్

10 April 2023, 19:54 IST

google News
    • Lava Blaze 2 launched: లావా బ్లేజ్ 2 ఫోన్ లాంచ్ అయింది. రూ.9వేలలోపు ధరలో ఫాస్ట్ చార్జింగ్, 128జీబీ స్టోరేజ్‍తో వచ్చింది.
Lava Blaze 2: 128జీబీ స్టోరేజ్, 5000mAh బ్యాటరీతో లావా బ్లేజ్ 2 బడ్జెట్ మొబైల్ (Photo: Lava)
Lava Blaze 2: 128జీబీ స్టోరేజ్, 5000mAh బ్యాటరీతో లావా బ్లేజ్ 2 బడ్జెట్ మొబైల్ (Photo: Lava)

Lava Blaze 2: 128జీబీ స్టోరేజ్, 5000mAh బ్యాటరీతో లావా బ్లేజ్ 2 బడ్జెట్ మొబైల్ (Photo: Lava)

Lava Blaze 2 launched: బ్లేజ్ సిరీస్‍లో మరో బడ్జెట్ 4జీ ఫోన్‍ను లావా లాంచ్ చేసింది. ఆకర్షణీయమైన డిజైన్, గ్లాస్ ఫినిష్ బ్యాక్ ప్యానెల్‍తో లావా బ్లేజ్ 2 మొబైల్ ఇండియాలో విడుదలైంది. 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఎల్‍సీడీ డిస్‍ప్లేను ఈ ఫోన్ కలిగి ఉంది. వెనుక 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఫాస్ట్ చార్జింగ్ సపోర్టుతో ఈ ఫోన్ వస్తోంది. లావా బ్లేజ్ 2 స్మార్ట్ ఫోన్ వివరాలపై ఓ లుక్కేయండి.

లావా బ్లేజ్ 2 ధర, సేల్

Lava Blaze 2 Price: 6జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ఉన్న లావా బ్లేజ్ 2 ధర రూ.8,999గా ఉంది. ఈనెల 18వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్‍లో ఈ మొబైల్ సేల్‍కు వస్తుంది. గ్లాస్ ఆరెంజ్, గ్లాస్ బ్లూ కలర్లలో లభిస్తుంది.

లావా బ్లేజ్ 2 స్పెసిఫికేషన్లు

Lava Blaze 2 Specifications : 6.5 ఇంచుల హెచ్‍డీ+ IPS LCD 2.5డీ కర్వ్డ్ డిస్‍ప్లేను లావా బ్లేజ్ 2 కలిగి ఉంది. 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా కోసం డిస్‍ప్లే టాప్ సెంటర్‌లో పంచ్ హోల్ ఉంది. యునిఎస్‍ఓసీ టీ616 (Unisoc T616) ప్రాసెసర్‌తో ఈ మొబైల్ వస్తోంది. 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ఉంటుంది. ఇంటర్నల్ స్టోరేజీని ఉపయోగించుకొని 5జీబీ వరకు వర్చువల్ ర్యామ్‍ను పొడిగించుకోవచ్చు.

లావా బ్లేజ్ 2 ఫోన్ వెనుక 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, మరో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఈ ఫోన్‍కు లావా ఇచ్చింది. హెచ్‍డీఆర్, నైట్ మోడ్, పనోరమ, టైమ్ ల్యాప్స్ లాంటి కెమెరా మోడ్‍లు ఉంటాయి.

Lava Blaze 2 Specifications : లావా బ్లేజ్ 2 మొబైల్‍లో 5000mAh బ్యాటరీ ఉంటుంది. 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‍తో ఈ ఫోన్ వస్తోంది. అయితే ఆండ్రాయిడ్ 13 అప్‍డేట్ ఈ ఫోన్‍కు వస్తుందని లావా వెల్లడించింది. 4జీ ఎల్‍టీఈ, బ్లూటూత్, వైఫై, జీపీఎస్, యూఎస్‍బీ టైప్-సీ కనెక్టివిటీ ఫీచర్లతో ఈ ఫోన్ వస్తోంది. పవర్ బటన్‍కే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది.

ఎంట్రీ లెవెల్‍ సెగ్మెంట్‍లో పోకో సీ51, రెడ్‍మీ ఏ1+ మోటో ఈ13తో పాటు మరికొన్ని మొబైళ్లతో ఈ లావా బ్లేజ్ 2 పోటీ పడనుంది.

తదుపరి వ్యాసం