Poco C51 First Sale: పోకో సీ51 ఫస్ట్ సేల్ మొదలు: ఇంట్రడక్టరీ ఆఫర్ ధరతో అందుబాటులోకి..
10 April 2023, 14:04 IST
- Poco C51 First Sale: పోకో సీ51 ఫోన్ సేల్‍కు వచ్చేసింది. ప్రత్యేక ఇంట్రడక్టరీ ధరతో ఫస్ట్ సేల్‍లో అందుబాటులో ఉంది. వివరాలపై ఓ లుక్కేయండి.
Poco C51 First Sale: పోకో సీ51 ఫస్ట్ సేల్ మొదలు: ఇంట్రడక్టరీ ఆఫర్ ధరతో.. (Photo: Poco)
Poco C51 First Sale: పోకో (Poco) ఇటీవల సీ సిరీస్‍లో లాంచ్ చేసిన నయా బడ్జెట్ ఫోన్ తొలి సేల్‍కు వచ్చింది. పోకో సీ51 (Poco C51 ) మొబైల్ ఫస్ట్ సేల్ నేడు (ఏప్రిల్ 10) మొదలైంది. ప్రత్యేక ఇంట్రడక్టరీ ధరతో అందుబాటులోకి వచ్చింది. మీడియాటెక్ హీలియో జీ36 ప్రాసెసర్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఈ ఫోన్‍లో ఉంటుంది. రెండు కలర్ ఆప్షన్‍లలో పోకో సీ51 లభిస్తోంది.
పోకో సీ51 ధర, సేల్
Poco C51 Price, Sale: 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ ఉన్న పోకో సీ51 మొబైల్ రూ.7,799 ధరకు సేల్‍కు వచ్చింది. ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‍కార్ట్ (Flipkart)లో సేల్ మొదలైంది. ఇది ఇంట్రడక్టరీ ఆఫర్ ధరగా ఉంది. ఈ ఫోన్ సాధారణ ధర రూ.8,499గా ఉంది. రూ.7,799 ఇంట్రడక్టరీ ధర పరిమిత కాలం ఉండే అవకాశం ఉంది. రాయల్ బ్లూ, పవర్ బ్లాక్ కలర్ ఆప్షన్‍లలో పోకో సీ51 లభ్యమవుతోంది.
పోకో సీ51 స్పెసిఫికేషన్లు
Poco C51 Specifications: 6.52 ఇంచుల హెచ్‍డీ+ ఎల్‍సీడీ డిస్‍ప్లేతో పోకో సీ51 స్మార్ట్ ఫోన్ వచ్చింది. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ36 ప్రాసెసర్‌పై ఈ మొబైల్ రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 13 గో ఎడిషన్ (Android 13 Go Edition) ఆపరేటింగ్ సిస్టమ్‍తో ఈ ఫోన్ వస్తోంది. ఈ మొబైల్‍కు రెండేళ్ల పాటు సెక్యూరిటీ అప్‍డేట్లను ఇవ్వనున్నట్టు పోకో ప్రకటించింది.
Poco C51 Details: 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజీతో పోకో సీ51 మొబైల్ వచ్చింది. అయితే ఇంటర్నల్ స్టోరేజీని ఉపయోగించుకొని 3జీబీ వరకు అదనంగా వర్చువల్ టర్బో ర్యామ్‍ను పొడిగించుకునే ఫీచర్‌ను ఈ ఫోన్‍కు పోకో ఇచ్చింది. ఎస్‍డీ కార్డు స్లాట్ కూడా ఉంటుంది. పోకో సీ51 ఫోన్ వెనుక 8 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, మరో డెప్త్ కెమెరా ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో ఈ ఫోన్ వచ్చింది.
Poco C51 Details: పోకో సీ51 మొబైల్‍లో 5,000mAh బ్యాటరీ ఉంటుంది. 10 వాట్ల చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తుంది. 4జీ ఎల్‍టీఈ, వైఫై, బ్లూటూత్, జీపీఎస్, మైక్రో యూఎస్‍బీ పోర్టు, 3.5 mm హెడ్‍ఫోన్ జాక్ కనెక్టివిటీ ఫీచర్లతో ఈ ఫోన్ వచ్చింది. ఈ మొబైల్ బ్యాక్ ప్యానెల్‍కు ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. మొత్తంగా పోకో సీ51 మొబైల్ బరువు 192 గ్రాములుగా ఉంది.