Lava Agni 2 5G : లావా అగ్ని 2 5జీ ఫోన్ వచ్చేసింది: హైలైట్స్ ఇవే-lava agni 2 5g launched in india check price specifications features sale details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Lava Agni 2 5g : లావా అగ్ని 2 5జీ ఫోన్ వచ్చేసింది: హైలైట్స్ ఇవే

Lava Agni 2 5G : లావా అగ్ని 2 5జీ ఫోన్ వచ్చేసింది: హైలైట్స్ ఇవే

Chatakonda Krishna Prakash HT Telugu
May 17, 2023 06:21 AM IST

Lava Agni 2 5G: లావా అగ్ని 2 5జీ ఫోన్ లాంచ్ అయింది. డిస్‍ప్లే ఈ మొబైల్‍కు ప్రధాన ఆకర్షణగా ఉంది. పూర్తి వివరాలు ఇవే.

Lava Agni 2 5G : లావా అగ్ని 2 5జీ ఫోన్ వచ్చేసింది: హైలైట్స్ ఇవే (Photo: Lava)
Lava Agni 2 5G : లావా అగ్ని 2 5జీ ఫోన్ వచ్చేసింది: హైలైట్స్ ఇవే (Photo: Lava)

Lava Agni 2 5G: అగ్ని లైనప్‍లో రెండో మోడల్‍ను దేశీయ బ్రాండ్ లావా తీసుకొచ్చింది. భారత మార్కెట్‍లో లావా అగ్ని 2 5జీ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. అగ్ని 5జీకి ఇది సక్సెసర్‌గా అడుగుపెట్టింది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న కర్వ్డ్ అమోడెల్ డిస్‍ప్లే ఈ లావా అగ్ని 2 5జీ మొబైల్‍కు ప్రధాన ఆకర్షణగా, ముఖ్యమైన అప్‍గ్రేడ్‍గా ఉంది. వెనుక నాలుగు కెమెరాల సెటప్‍తో ఈ మొబైల్ వచ్చింది. లావా అగ్ని 2 5జీ మొబైల్ గురించిన పూర్తి వివరాలు ఇవే.

కర్వ్డ్ అమోలెడ్ డిస్‍ప్లేతో..

Lava Agni 2 5G : 6.78 ఇంచుల ఫుల్ హెచ్‍డీ+అమోలెడ్ డిస్‍ప్లేను లావా అగ్ని 2 5జీ ఫోన్ కలిగి ఉంది. ఈ డిస్‍ప్లే అంచులు కర్వ్ అయి ఉంటాయి. 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 3-డీ డ్యుయల్ కర్వ్డ్ డిజైన్‍తో ఈ ఉన్న ఈ డిస్‍ప్లే హెచ్‍డీఆర్, హెచ్‍డీఆర్10+కు సపోర్ట్ చేస్తుంది. మ్యాట్ ఫినిష్ ఉండే గ్లాస్ బ్యాక్ డిజైన్‍తో ఈ మొబైల్ వచ్చింది.

ప్రాసెసర్, ఓఎస్

Lava Agni 2 5G : లావా అగ్ని 2 5జీ ఫోన్ మీడియాటెక్ డైమన్సిటీ 7050 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. ఈ ప్రాసెసర్‌తో ఇండియాలో లాంచ్ అయిన ఫస్ట్ మొబైల్ ఇదే. స్టాక్ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‍తో ఈ ఫోన్ వచ్చింది.

వెనుక నాలుగు కెమెరాలు

Lava Agni 2 5G : లావా అగ్ని 2 5జీ ఫోన్ వెనుక నాలుగు కెమెరాల సెటప్ ఉంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 2 మెగాపిక్సెల్ డెప్త్, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఈ మొబైల్‍కు లావా ఇచ్చింది.

66W ఫాస్ట్ చార్జింగ్‍తో..

Lava Agni 2 5G : 4,700mAh బ్యాటరీని లావా అగ్ని 2 5జీ కలిగి ఉంది. 66 వాట్ల (W) ఫాస్ట్ చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తుంది. 16 నిమిషాల్లోనే ఈ మొబైల్ 50 శాతం చార్జ్ అవుతుందని లావా పేర్కొంది. 13 5జీ బ్యాండ్‍లకు ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది. ఇన్‍డిస్‍ప్లే ఫింగర్ ప్రింటన్ స్కానర్‌ను ఈ అగ్ని 2 5జీ స్మార్ట్ ఫోన్ కలిగి ఉంది.

లావా అగ్ని 2 5జీ ధర, సేల్, ఆఫర్లు

Lava Agni 2 5G Price: 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ఉన్న లావా అగ్ని 2 5జీ మొబైల్ ధర రూ.21,999గా ఉంది. ఈ-కామర్స్ సైట్ అమెజాన్ (Amazon)లో ఈనెల 24వ తేదీ ఉదయం 10 గంటలకు ఈ మొబైల్ సేల్ ప్రారంభం అవుతుంది. విరిడియన్ కలర్ ఆప్షన్‍లో ఈ ఫోన్ లభిస్తుంది.

Lava Agni 2 5G Offers: ఫస్ట్ సేల్‍లో ఏదైనా బ్యాంకుకు చెందిన డెబిట్/క్రెడిట్ కార్డును ఉపయోగించి లావా అగ్ని 2 5జీ మొబైల్‍ను కొనుగోలు చేస్తే రూ.2,000 డిస్కౌంట్ పొందవచ్చు. అంటే రూ.19,999 ధరకే ఈ ఫోన్‍ను సొంతం చేసుకోవచ్చు.

WhatsApp channel