తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Iqoo 12 Vs Oneplus 12 : వన్​ప్లస్​ 12 వర్సెస్​ ఐకూ 12- ఏది బెస్ట్​?

iQOO 12 vs OnePlus 12 : వన్​ప్లస్​ 12 వర్సెస్​ ఐకూ 12- ఏది బెస్ట్​?

Sharath Chitturi HT Telugu

11 December 2023, 14:35 IST

    • iQOO 12 vs OnePlus 12 : వన్​ప్లస్​ 12 వర్సెస్​ ఐకూ 12.. ఈ రెండు స్మార్ట్​ఫోన్స్​లో ఏది బెస్ట్​? ఇక్కడ తెలుసుకుందాము..
వన్​ప్లస్​ 12 వర్సెస్​ ఐకూ 12- ఏది బెస్ట్​?
వన్​ప్లస్​ 12 వర్సెస్​ ఐకూ 12- ఏది బెస్ట్​?

వన్​ప్లస్​ 12 వర్సెస్​ ఐకూ 12- ఏది బెస్ట్​?

iQOO 12 vs OnePlus 12 : వన్​ప్లస్​ 12, ఐకూ 12 స్మార్ట్​ఫోన్స్​పై మంచి బజ్​ నెలకొంది. ఈ రెండు గ్యాడ్జెట్స్​పై అటు స్మార్ట్​ఫోన్​ మార్కెట్​లో, ఇటు ప్రజల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. ఈ మోడల్స్​కి చెందిన ఫీచర్స్​, ధరలను పోల్చి, ఏది బెటర్​? అన్నది ఇక్కడ తెలుసుకుందాము..

ట్రెండింగ్ వార్తలు

Skoda new SUV : మారుతీ సుజుకీ బ్రెజాకు పోటీగా స్కోడా కొత్త ఎస్​యూవీ..!

Infinix GT 20 Pro : ఇండియాలో ఇన్ఫీనిక్స్​ జీటీ 20 ప్రో లాంచ్​ డేట్​ ఫిక్స్​.. ఫీచర్స్​ ఇవే!

Honda Civic into Lamborghini : హోండా సివిక్​ని లంబోర్ఘినిగా మార్చిన యూట్యూబర్​- నెటిజన్లు ఫిదా!

Motorola X50 Ultra : మోటోరోలా ఎక్స్​50 అల్ట్రా లాంచ్​.. సూపర్​ కూల్​ ఫీచర్స్​తో!

వన్​ప్లస్​ 12 వర్సెస్​ ఐకూ 12- ఫీచర్స్​..

వన్​ప్లస్​ 12 డిజైన్​.. వన్​ప్లస్​ 11ని పోలి ఉంటుంది. కొన్ని మార్పులు మాత్రం కనిపిస్తున్నాయి. కాగా.. ఈ స్మార్ట్​ఫోన్​లో క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్​ 8 జెన్​ 3 చిప్​సెట్​ ఉంది. 120 హెజ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​తో కూడిన 6.82 ఇంచ్​ కర్వ్​డ్​ ఓఎల్​ఈడీ డిస్​ప్లే దీని సొంతం. 4500 నిట్స్​ పీక్​ బ్రైట్​నెస్​ లెవల్​ ఇందులో కనిపిస్తుంది.

iQOO 12 launch in India : ఐకూ 12 స్మార్ట్​ఫోన్​లో 144 హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​తో కూడిన 6.78 ఇంచ్​ 1.5కే ఎల్​టీపీఓ అమోలెడ్​ డిస్​ప్లే ఉండనుంది. 3000 నిట్స్​ పీక్​ బ్రైట్​నెస్​ ఉంటుంది. ఈ గ్యాడ్జెట్​లో స్నాప్​డ్రాగన్​ 8 జెన్​ 3 ఎస్​ఓసీ ప్రాసెసర్​ ఉండనుంది. ఆండ్రాయిడ్​ 14 ఆధారిత ఫన్​టచ్​ఓస్​ సాఫ్ట్​వేర్​పై ఈ మొబైల్​ పనిచేస్తుంది.

ఇక వన్​ప్లస్​ కొత్త గ్యాడ్జెట్​లో 50ఎంపీ ప్రైమరీ, 64ఎంపీ సెకెండరీ, 48ఎంపీ అల్ట్రావైడ్​ సెన్సార్​తో కూడిన ట్రిపుల్​ రేర్​ కెమెరా సెటప్​ ఉంటుంది. ఇక సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం ఇందులో 32ఎంపీ ఫ్రెంట్​ కెమెరా లభిస్తోంది. 5,400ఎంఏహెచ్​ బ్యాటరీతో పాటు 100 వాట్​ వయర్డ్​- 50వాట్​ వయర్​లెస్ ఛార్జింగ సపోర్ట్​ దీనికి లభిస్తుండటం విశేషం. ఆండ్రాయిడ్​ 14 ఆధారిత కలర్​ఓఎస్​ 14 సాఫ్ట్​వేర్​పై ఈ మోడల్​ పనిచేస్తుంది.

OnePlus 12 launch date in India : మరోవైపు ఐకూ 12లో 50ఎంపీ ప్రైమరీతో కూడిన ట్రిపుల్​ రేర్​ కెమెరా ఉండనుంది. సెల్ఫీ వీడియో కాల్స్​ కోసం 16ఎంపీ ఫ్రెంట్​ కెమెరా వస్తోంది. 5,000ఎంఏహెచ్​ బ్యాటరీ, 120వాట్​ ఫాస్ట్​ ఛార్జర్​, 50వాట్​ వయర్​లెస్​ ఛార్జింగ్​, 100వాట్​ రివర్స్​ వయర్​లెస్​ ఛార్జింగ్​ సపోర్ట్​ ఈ మొబైల్​కి లభిస్తుంది.

వన్​ప్లస్​ 12 వర్సెస్​ ఐకూ 12- ధరలు..

వన్​ప్లస్​ 12లో నాలుగు వేరియంట్లు ఉన్నాయి. చైనాలో వీటి ధరలు ఇలా ఉన్నాయి..

వన్​ప్లస్​ 12- 12జీబీ ర్యామ్​- 256 జీబీ స్టోరేజ్​- సుమారు రూ. 50,500. 16జీబీ ర్యామ్​- 512జీబీ స్టోరేజ్​- సుమారు రూ. 56,350. 16జీబీ ర్యామ్​- 1టీబీ స్టోరేజ్​- సుమారు రూ. 62,200. 24జీబీ ర్యామ్​- 1టీబీ స్టోరేజ్​- సుమారు రూ. 68,100.

iQOO 12 price in India : ఈ ఐకూ 12 స్మార్ట్​ఫోన్​ ఇప్పటికే లిస్ట్​ అయ్యింది. 12జీబీ ర్యామ్​- 256జీబీ స్టోరేజ్​ వేరియంట్​ ధర రూ. 52,999గా ఉంది. ఇక 16జీబీ ర్యామ్​- 512జీబీ స్టోరేజ్​ ధర రూ. 57,999గా ఉంది.

రెండు గ్యాడ్జెట్స్​ ధరలపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

OnePlus 12 price in India : ఇటీవలే చైనాలో లాంచ్​ అయిన వన్​ప్లస్​ 12.. 2024 తొలినాళ్లల్లో ఇండియాలోకి అడుగుపెట్టనుంది. ఇక ఐకూ 12.. డిసెంబర్​ 12న ఇండియాలో లాంచ్​ అవుతుంది.

తదుపరి వ్యాసం