OnePlus Watch 2 : వన్​ప్లస్​ వాచ్​ 2 స్పెసిఫికేషన్స్​​ లీక్​.. లాంచ్​ ఎప్పుడు?-oneplus watch 2 specifications leaked see details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Oneplus Watch 2 : వన్​ప్లస్​ వాచ్​ 2 స్పెసిఫికేషన్స్​​ లీక్​.. లాంచ్​ ఎప్పుడు?

OnePlus Watch 2 : వన్​ప్లస్​ వాచ్​ 2 స్పెసిఫికేషన్స్​​ లీక్​.. లాంచ్​ ఎప్పుడు?

Sharath Chitturi HT Telugu
Nov 12, 2023 12:45 PM IST

OnePlus Watch 2 : వన్​ప్లస్​ వాచ్​ 2 లాంచ్​కు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ మోడల్​కు చెందిన కొన్ని స్పెసిఫికేషన్స్​​ లీక్​ అయ్యాయి. ఆ వివరాలు..

వన్​ప్లస్​ వాచ్​ 2 స్పెసిఫికేషన్స్​​ లీక్​.. లాంచ్​ ఎప్పుడు?
వన్​ప్లస్​ వాచ్​ 2 స్పెసిఫికేషన్స్​​ లీక్​.. లాంచ్​ ఎప్పుడు?

OnePlus Watch 2 : వన్​ప్లస్​ సంస్థ.. రెండేళ్ల క్రితం ఓ స్మార్ట్​వాచ్​ని లాంచ్​ చేసింది. దాని పేరు వన్​ప్లస్​ వాచ్​. ఆ తర్వాత.. ఈ సెగ్మెంట్​పై సంస్థ పెద్దగా ఫోకస్​ చేయలేదు. కానీ ఇప్పుడు.. వన్​ప్లస్​ నుంచి వాచ్​ 2 వస్తోందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన స్పెసిఫికేషన్స్​​, డిజైన్​ కూడా లీక్​ అయ్యాయి. ఆ వివరాలు..

వన్​ప్లస్​ వాచ్​ 2 ఎలా ఉంటుంది..?

ఆన్​లైన్​లో లీక్​ అయిన డేటా ప్రకారం.. వన్​ప్లస్​ వాచ్​ 2లో సర్క్యులర్​ ఫేస్​ ఉంటుంది. డిజైన్​ పరంగా ఒక సైడ్​లో కాస్త బల్జ్​ అవుతుంది. యాపిల్​ వాచ్​ అల్ట్రాలో ఇదే తరహా డిజైన్​ ఉంటుంది. ఒకవైపు స్పీకర్​ గ్రిల్​, మరోవైపు బటన్స్​ ఉంటాయి.

OnePlus Watch 2 price : ఇక ఈ గ్యాడ్జెట్​ స్పెసిఫికేషన్స్​ విషయానికొస్తే.. ఇందులో 1.43 ఇంచ్​ అమోలెడ్​ స్క్రీన్​, క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్​ డబ్ల్యూ5 జెన్​ 1 ప్రాసెసర్​ ఉంటాయని టాక్​ నడుస్తోంది. ఈ మోడల్​.. గూగుల్​ వేర్​ ఓస్​4 సాఫ్ట్​వేర్​పై పనిచేస్తుందట.

కొత్త స్మార్ట్​వాచ్​ లాంచ్​ ఎప్పుడు?

వన్​ప్లస్​ 12 సిరీస్​ని లాంచ్​ చేసేందుకు సంస్థ సిద్ధమవుతోంది. 2024 తొలినాళ్లల్లో ఈ ఈవెంట్​ ఉండొచ్చు! ఇదే ఈవెంట్​లో.. వన్​ప్లస్​ వాచ్​ 2ని కూడా సంస్థ రివీల్​ చేస్తుందని సమాచారం.

OnePlus Watch 2 release date : కాగా.. కరెక్ట్​ లాంచ్​ డేట్​పై ఇంకా క్లారిటీ లేదు. ఇండియాలో లాంచ్​పైనా సంస్థ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ, అన్ని అనుకున్నట్టు జరిగితే.. 2024 తొలి నెలలోనే ఈ మోడల్​.. ఇండియా మార్కెట్​లోకి వస్తుదని టెక్​ వర్గాలు భావిస్తున్నాయి.

వన్​ప్లస్​ వాచ్​ 2 ఫీచర్స్​, ధరతో పాటు మరిన్ని వివరాలు త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ఈ వన్​ప్లస్​ స్మార్ట్​ఫోన్స్​పై క్రేజీ ఆఫర్స్​..!

దీపావళి నేపథ్యంలో అమెజాన్​లో వన్​ప్లస్​ స్మార్ట్​ఫోన్స్​పై అదిరిపోయే ఆఫర్స్​, డిస్కౌంట్స్​ లభిస్తున్నాయి.

Diwali offers on OnePlus smartphones : వన్​ప్లస్​ 11ఆర్​ 5జీ:- ఈ 5జీ స్మార్ట్​ఫోన్​లో 6.7 ఇంచ్​ 120 హెచ్​జెడ్​ సూపర్​ ఫ్లూయిడ్​ అమోలెడ్​ డిస్​ప్లే ఉంటుంది. రేర్​లో 50ఎంపీ ప్రైమరీ, 8ఎంపీ అల్ట్రా-వైడ్​, ఫ్రెంట్​లో 16ఎంపీ కెమెరా సెటప్​ ఉంటాయి. స్నాప్​డ్రాగన్​ 8+ జెన్​ 1 చిప్​సెట్​, 5000ఎంఏహెచ్​ బ్యాటరీ, 16జీబీ ర్యామ్​- 256జీబీ స్టోరేజ్​ వేరియంట్​ వంటివి ఇతర ఫీచర్స్​గా ఉన్నాయి. ఈ మోడల్​ ధర రూ. 44,999గా ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

సంబంధిత కథనం