OnePlus 12 vs Realme GT 5 pro : ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్‌లో ఏది బెస్ట్?
09 December 2023, 13:36 IST
- OnePlus 12 vs Realme GT 5 pro : వన్‌ప్లస్ 12 వర్సెస్ రియల్మీ జీటీ 5 ప్రో.. ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్‌లో ఏది బెస్ట్?

ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్‌లో ఏది బెస్ట్?
OnePlus 12 vs Realme GT 5 pro : వన్‌ప్లస్ 12- రియల్మీ జీటీ 5ప్రో గ్యాడ్జెట్స్.. స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో హాట్‌టాపిక్‌గా మారాయి. ఈ నేపథ్యంలో.. ఈ రెండింటినీ పోల్చి, ఏది బెస్ట్? అన్నది ఇక్కడ తెలుసుకుందాము..
వన్‌ప్లస్ 12 వర్సెస్ రియల్మీ జీటీ 5 ప్రో- ఫీచర్స్..
వన్‌ప్లస్ 12 డిజైన్.. వన్‌ప్లస్ 11ని పోలి ఉంటుంది. కొన్ని మార్పులు మాత్రం కనిపిస్తున్నాయి. కాగా.. ఈ స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ఉంది. 120 హెజ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.82 ఇంచ్ కర్వ్డ్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే దీని సొంతం. 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ లెవల్ ఇందులో కనిపిస్తుంది.
రియల్మీ జీటీ 5 ప్రోలో స్పాప్‌డ్రాగన్ 8 జెన్ 3ఎస్ఓసీ ప్రాసెసర్ ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ లో 6.78-అంగుళాల 1.5కే క్వర్డ్స్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉంటుంది. ఇది 144హెచ్‌జెడ్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 2160హెచ్‌జెడ్ టచ్ శాంప్లింగ్ రేట్, 4,500 నిట్‌ల గరిష్ట ప్రకాశంతో వస్తోంది.
OnePlus 12 launch date in India : వన్‌ప్లస్ 12 గ్యాడ్జెట్లో 50ఎంపీ ప్రైమరీ, 64ఎంపీ సెకెండరీ, 48ఎంపీ అల్ట్రావైడ్ సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇక సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఇందులో 32ఎంపీ ఫ్రెంట్ కెమెరా లభిస్తోంది.
ఇక రియల్ మీ కొత్త గ్యాడ్జెట్లో 50ఎంపీ ప్రైమరీ, 50ఎంపీ సెకెండరీ కెమెరాలు రేర్‌లో ఉంటాయి. ఫ్రెంట్లో 32ఎంపీ కెమెరా లభిస్తోంది.
5,400ఎంఏహెచ్ బ్యాటరీతో పాటు 100 వాట్ వయర్డ్- 50వాట్ వయర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్.. వన్‌ప్లస్ 12కి లభిస్తోంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత కలర్ఓఎస్ 14 సాఫ్ట్‌వేర్‌పై ఈ మోడల్ పనిచేస్తుంది.
Realme GT 5 pro launch in India : రియల్ మీ జీటీ 5ప్రొ స్మార్ట్‌ఫోన్ లో 5,400ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. దీనిని 100 వాట్ వైర్డ్ ఛార్జర్ లేదా, 50 వాట్ వైర్‌లెస్ ఛార్జర్ ద్వారా త్వరగా రీఛార్జ్ చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా రియల్మీ యూఐ 5.0పై వర్క్ చేస్తుంది.
ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్ ధరల వివరాలు..
ఇండియలో వన్‌ప్లస్ 12 ధరకు సంబంధించిన వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవు. కాగా చైనాలో.. ఈ ధరలు ఇలా ఉన్నాయి..
- OnePlus 12 price : వన్‌ప్లస్ 12- 12జీబీ ర్యామ్- 256 జీబీ స్టోరేజ్- సుమారు రూ. 50,500.
- 16జీబీ ర్యామ్- 512జీబీ స్టోరేజ్- సుమారు రూ. 56,350.
- 16జీబీ ర్యామ్- 1టీబీ స్టోరేజ్- సుమారు రూ. 62,200.
- 24జీబీ ర్యామ్- 1టీబీ స్టోరేజ్- సుమారు రూ. 68,100.
ఈ మొబైల్.. జనవరి 23న ఇండియాతో పాటు అంతర్జాతీయ మార్కెట్లోకి అడుగుపెడుతుందని తెలుస్తోంది.
Realme GT 5 pro price in India : మరోవైపు రియల్మీ జీడీ 5ప్రో- 12 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ. 39,900 వరకు ఉంటుంది. అలాగే, 16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ. 46,900 వరకు ఉంటుంది. 16 జీబీ ర్యామ్, 1 టీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ. 50,400 వరకు ఉంటుంది.