Realme phones under 20000 : రూ.20వేల బడ్జెట్​లో రియల్​మీ టాప్​ స్మార్ట్​ఫోన్స్​ ఇవే!-realme phones under 20000 check out these 5 handsets ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Realme Phones Under 20000 : రూ.20వేల బడ్జెట్​లో రియల్​మీ టాప్​ స్మార్ట్​ఫోన్స్​ ఇవే!

Realme phones under 20000 : రూ.20వేల బడ్జెట్​లో రియల్​మీ టాప్​ స్మార్ట్​ఫోన్స్​ ఇవే!

Sharath Chitturi HT Telugu
Nov 13, 2023 03:40 PM IST

Realme phones under 20000 : రూ. 20వేల బడ్జెట్​లో రియల్​మీలోని ది బెస్ట్​ స్మార్ట్​ఫోన్స్​ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము. వివరాల్లోకి వెళితే..

రూ.20వేల బడ్జెట్​లో రియల్​మీ టాప్​ స్మార్ట్​ఫోన్స్​ ఇవే!
రూ.20వేల బడ్జెట్​లో రియల్​మీ టాప్​ స్మార్ట్​ఫోన్స్​ ఇవే! ( HT Tech)

Realme smartphones under 20000 : కొత్త స్మార్ట్​ఫోన్​ కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? అయితే.. రూ. 20వేల బడ్జెట్​లో.. రియల్​మీకి చెందిన ది బెస్ట్​ గ్యాడ్జెట్స్​ లిస్ట్​ని ఇక్కడ చూడండి.

yearly horoscope entry point

ఈ రియల్​మీ స్మార్ట్​ఫోన్స్​ బెస్ట్​..!

రియల్​మీ నార్జో ఎన్​53:- ఈ రియల్​మీ స్మార్ట్​ఫోన్​లో 8జీబీ ర్యామ్​- 128జీబీ స్టోరేజ్​ ఉంటుంది. 33వాట్​ సూపర్​వీఓఓసీ టెక్నాలజీ దీని సొంతం. ఫలితంగా.. శరవేగంగా ఛార్జింగ్​ పూర్తవుతుంది. 50ఎంపీ ఏఐతో కూడిన కెమెరా సెటప్​ రేర్​లో వస్తుంది. 5000ఎంఏహెచ్​ బ్యాటరీ దీని సొంతం. ఈ మోడల్​ ధర రూ. 13,999.

రియల్​మీ నార్జో 60 5జీ:- ఈ గ్యాడ్జెట్​లో 90 హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​తో కూడిన అమోలెడ్​ డిస్​ప్లే ఉంటుంది. విజువల్​ ఎక్స్​పీరియన్స్​ చాలా బాగుంటుంది. 64ఎంపీతో కూడిన రేర్​ కెమెరా సెటప్​ దీని సొంతం. ప్రీమియం ఫీల్​తో వచ్చే ఈ స్మార్ట్​ఫోన్​ ధర రూ. 19,999.

రియల్​మ నార్జో 60ఎక్స్​ 5జీ:- ఇందులో 33 వాట్​ సూపర్​వీఓఓసీ ఛార్జింగ్​ టెక్నాలజీ ఉంటుంది. 50శాతం ఛార్జింగ్​.. కేవలం 30 నిమిషాల్లో అయిపోతుంది. 5000ఎంఏహెచ్​ బ్యాటరీ దీని సొంతం. 50ఎంపీ ఏఐ ప్రైమరీ కెమెరాతో కూడిన సెటప్​ రేర్​లో ఉంటుంది. 2టీబీ ఎక్స్​టర్నల్​ స్టోరేజ్​ దీని సొంతం. ఈ మోడల్​ ధర రూ. 15,999గా ఉంది.

Best Realme phones under 20000 : రియల్​మీ నార్జో ఎన్​55:- ఈ రియల్​మీ గ్యాడ్జెట్​ ధర రూ. 14,999. ఇందులో కూడా 33 వాట్​ సూపర్​వీఓఓసీ ఛార్జింగ్​ ఉంటుంది. 0-50శాతం ఛార్జింగ్​, కేవలం 29 నిమిషాల్లో అయిపోతుంది. 64ఎంపీ ప్రైమరీ ఏఐ రేర్​ కెమెరాతో అద్భుతంగా ఫొటోలు తీసుకోవచ్చు. 12జీబీ ర్యామ్​ దీని సొంతం.

రియల్​మీ 11ఎక్స్​ 5జీ:- ఈ మోడల్​లో డైమెన్సిటీ 6100+ చిప్​సెట్​ ఉంటుంది. 8జీబీ ర్యామ్​- 128జీబీ స్టోరేజ్​ దీని సొంతం. 2టీబీ ఎక్స్​ప్యాండెబుల్​ స్టోరేజ్​ ఆప్షన్​ కూడా ఉంది. 6.72 ఇంచ్​ ఫుల్​ హెచ్​డీ+ డిస్​ప్లే వస్తుంది. 64ఎంపీ+2ఎంపీ కెమెరా సెటప్​ రేర్​లో ఉంటుంది. ఫ్రెంట్​లో 8ఎంపీ కెమెరా లభిస్తుంది. 5000ఎంఏహెచ్​ బ్యాటరీ దీని సొంతం. ఈ గ్యాడ్జెట్​ ధర రూ. 18,999.

రూ. 25వేల బడ్జెట్​లో బెస్ట్​ ఫోన్స్​..

Best smartphones under 25000 : పోకో ఎక్స్​5 ప్రో:- ఇందులో 6.67 ఇంచ్​ ఫుల్​ హెచ్​డీ+ అమోలెడ్​ డిస్​ప్లే ఉంటుంది. 108ఎంపీ తో కూడిన రేర్​ కెమెరా సెటప్​ దీని సొంతం. ఫ్రెంట్​లో 16ఎంపీ కెమెరా వస్తోంది. అమెజాన్​లో దీని వాస్తవ ధర రూ. 28,999. కానీ డిస్కౌంట్​లో ఈ మోడల్​ రూ. 20,999కే లభిస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Whats_app_banner

సంబంధిత కథనం