Redmi phones under 10000 : ది బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ రెడ్మీ స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!
Redmi phones under 10000 : రూ. 10వేల బడ్జెట్లో మంచి స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నారా? అయితే.. ఇది మీకోసమే! రెడ్మీలో లభిస్తుంది ది బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ గ్యాడ్జెట్స్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
Redmi phones under 10000 : ఇండియా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోని బడ్జెట్ ఫ్రెండ్లీ సెగ్మెంట్లో తీవ్ర పోటీ నెలకొంది. దాదాపు అన్ని స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు.. సూపర్ ఫీచర్స్‌తో కొత్త కొత్త డివైజ్‌లను లాంచ్ చేస్తున్నాయి. మరి మీరు కూడా రూ. 10వేల బడ్జెట్లో ఓ స్మార్ట్‌ఫోన్ తీసుకోవాలని చూస్తున్నారా? అయితే.. రెడ్మీలో ఉన్న ది బెస్ట్ ఆప్షన్స్‌ని మీకోసం మేము తీసుకొచ్చాము. ఆ వివరాలు..
బడ్జెట్ ఫ్రెండ్లీ రెడ్మీ స్మార్ట్‌ఫోన్స్..
Redmi 12C price in India : రెడ్మీ 12సీ:- ఈ గ్యాడ్జెట్లో 6.71 ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే ఉంటుంది. ఆక్టా-కోర్ మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్ దీని సొంతం. 3జీబీ, 4జీబీ, 6జీబీ ర్యామ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇవి.. 64జీబీ, 128జీబీ స్టోరేజ్‌తో లింక్ అయ్యి ఉంటాయి. 1టీబీ ఎక్స్ప్యాండెబుల్ మైక్రోఎస్డీ కార్డ్ ఆప్షన్ కూడా లభిస్తోంది. 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 10వాట్ ఛార్జర్ సపోర్ట్ ఉంటుంది. ఈ మొబైల్ ప్రారంభ ధర సుమారు రూ. 8000
Redmi 12 price : రెడ్మీ 12:- ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.79 ఇంచ్ ఫుల్హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఎంఐయూఐ 14 సాఫ్ట్‌వేర్‌పై ఇది పనిచేస్తుంది. స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్ దీని సొంతం. 4జీబీ ర్యామ్- 256జీబీ స్టోరేజ్ ఆప్షన్ లభిస్తోంది. ఇదొక 5జీ ఫోన్. 50ఎంపీ ప్రైమరీ, 8ఎంపీ అల్ట్రా వైడ్, 2ఎంపీ మాక్రో లెన్స్‌తో కూడిన ట్రిపుల్ రేర్ కెమెరా ఇందులో ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 16ఎంపీ ఫ్రెంట్ కెమెరా లభిస్తోంది. 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఇందులో ఉంది. ఈ మొబైల్ ధర సుమారు రూ. 9,500.
రెడ్మీ ఏ2:- ఈ రెడ్మీ ఏ2లో 6.52 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది. మీడియాటెక్ హీలియో జీ36 ప్రాసెసర్‌పై ఇది పనిచేస్తుంది. 4జీబీ ర్యామ్- 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్ ఉంటుంది. 8ఎంపీ డ్యూయెల్ కెమెరాతో పాటు 5ఎంపీ ఫ్రెంట్ కెమెరా ఇందులో ఉంది. 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 10వాట్ ఛార్జర్ సపోర్ట్ లభిస్తోంది. ఆండ్రాయిడ్ 13 సాఫ్ట్‌వేర్‌పై ఇది పనిచేస్తుంది. ఈ మొబైల్ ధర సుమారు రూ. 6వేలు.
Redmi 9A price in India : రెడ్మీ 9ఏ:- ఇందులో 6.53 ఇంచ్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే ఉంటుంది. ఆక్టా-కోర్ మీడియాటెక్ హీలియో జీ25 చిప్సెట్ దీని సొంతం. 2జీబీ ర్యామ్- 32జీబీ స్టోరేజ్, 3జీబీ ర్యామ్- 32జీబీ స్టోరేజ్ వేరియంట్లు ఇందులో ఉన్నాయి. మైక్రోఎస్డీ స్లాట్ కూడా ఉంది. దీనితో.. 512జీబీ ఎక్స్ప్యాడెంబుల్ స్టోరేజ్ లభించనుంది. ఇందులో 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 13ఎంపీ ఏఐ రేర్ కెమెరాతో పాటు 5ఎంపీ ఏఐ సెల్ఫీ కెమెరా లభిస్తోంది. ఈ మొబైల్ ధర సుమారు రూ. 7,500.
సంబంధిత కథనం