తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Instagram: ఇన్ స్టాగ్రామ్ లో మీ ప్రొఫైల్ కు ఇక మ్యూజిక్ లేదా సాంగ్ ను యాడ్ చేయొచ్చు; ఎలా అంటే?

Instagram: ఇన్ స్టాగ్రామ్ లో మీ ప్రొఫైల్ కు ఇక మ్యూజిక్ లేదా సాంగ్ ను యాడ్ చేయొచ్చు; ఎలా అంటే?

HT Telugu Desk HT Telugu

23 August 2024, 18:57 IST

google News
  • Instagram: ఇన్స్టాగ్రామ్ వినియోగదారుల కోసం మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఇన్ స్టా యూజర్లు ఇకపై తమ ప్రొఫైల్ బయోస్ కు మ్యూజిక్ ను లేదా సాంగ్ ను యాడ్ చేయొచ్చు. అది మీ ప్రొఫైల్ తో 30 సెకన్ల పాటు ప్లే అవుతుంది. ఈ ఫీచర్ ఇన్స్టాగ్రామ్ నోట్స్ కోసం కొత్త కలర్ ఆప్షన్లను కూడా అందిస్తుంది.

ఇన్ స్టా లో మీ ప్రొఫైల్ కు ఇక మ్యూజిక్ ను యాడ్ చేయొచ్చు; ఎలా అంటే?
ఇన్ స్టా లో మీ ప్రొఫైల్ కు ఇక మ్యూజిక్ ను యాడ్ చేయొచ్చు; ఎలా అంటే? (Unsplash)

ఇన్ స్టా లో మీ ప్రొఫైల్ కు ఇక మ్యూజిక్ ను యాడ్ చేయొచ్చు; ఎలా అంటే?

Instagram: ఇన్స్టాగ్రామ్ వినియోగదారులు తమ ప్రొఫైల్ బయోస్ కు ఇకపై మ్యూజిక్ ను లేదా సాంగ్ ను యాడ్ చేయడానికి అనుమతించే కొత్త ఫీచర్ ను ఇన్స్టాగ్రామ్ ప్రవేశపెట్టింది. ఇంతకుముందు యూజర్లు పోస్ట్ లలో మాత్రమే మ్యూజిక్ ను చేర్చేవారు. ఇన్స్టాగ్రామ్ మ్యూజిక్ లైబ్రరీ నుంచి 30 సెకన్ల నిడివి ఉన్న పాటను యూజర్లు తమ ప్రొఫైల్ లో పొందుపర్చవచ్చు. అయితే, పాట ఆటోమేటిక్ గా ప్లే కాదు. ఆ పాట వినడానికి వినియోగదారులు దానిపై క్లిక్ చేయాల్సి ఉంటుంది.

మీ ప్రొఫైల్ కు సంగీతాన్ని జోడించడం ఎలా?

ఇన్ స్టాలో మీ ప్రొఫైల్ కు మ్యూజిక్ ను యాడ్ చేయడానికి ఈ కింది స్టెప్స్ ఫాలో కావాలి.

  1. ముందుగా ఇన్ స్టా గ్రామ్ యాప్ ను ఓపెన్ చేయాలి.
  2. అందులో ‘‘Edit Profile’’ పేజీకి వెళ్లండి.

3. ఇన్స్టాగ్రామ్ లోని లైసెన్స్ పొందిన మ్యూజిక్ (music) లైబ్రరీ నుండి ఒక పాటను ఎంచుకోండి.

4. ఆ సాంగ్ లో నుంచి మీ ప్రొఫైల్ లో ప్రదర్శించడానికి 30 సెకన్ల పార్ట్ ను ఎంచుకోండి.

5. ఎంచుకున్న ట్రాక్ దానిని తీసివేసేవరకు లేదా రీప్లేస్ చేసేవరకు ప్రొఫైల్ లో ఉంటుంది.

‘‘టేస్ట్’’ కేటగిరీ..

ఇన్ స్టాగ్రామ్ లో పాట కనిపించే బయోస్ కు "టేస్ట్" అనే కొత్త కేటగిరీని కూడా పొందుపర్చనున్నారు. "ఎస్ప్రెస్సో" పాటతో ప్రసిద్ధి చెందిన సబ్రినా కార్పెంటర్ సహాయంతో ఇన్స్టాగ్రామ్ ఈ కొత్త ఫీచర్ ను ప్రమోట్ చేస్తోంది. తన రాబోయే ఆల్బమ్ కు ప్రచారం కల్పించడానికి సబ్రీనా కార్పెంటర్ ప్రొఫైల్ లో కొత్త అల్బమ్ లోని పాట ట్రాక్ వినిపిస్తుంది. దీని ద్వారా అఫీషియల్ రిలీజ్ కు ముందే విడుదల కాని మ్యూజిక్ ను వినడానికి అభిమానులకు అవకాశం ఉంటుంది.

ఇన్ స్టాగ్రామ్ నోట్స్ అప్ డేట్

మ్యూజిక్ ఫీచర్ తో పాటు, ఇన్ స్టాగ్రామ్ తన నోట్స్ ఫీచర్ ను కొత్త కలర్ ఆప్షన్లతో అప్ డేట్ చేసింది. ఇందులో "డెమురే", "క్యూట్సీ", "కన్సిడరేట్", "మైండ్ ఫుల్" ఆప్షన్స్ ఉన్నాయి. గతంలో ఇన్స్టాగ్రామ్ లో గోల్డ్ నోట్ ఫీచర్ ను తొలగించారు. బంగారం రంగు నోట్లను సృష్టించడానికి వినియోగదారులు ఇకపై కొన్ని కీలక పదాలను ఉపయోగించలేరు. నిలిపివేసిన బంగారు నోట్ల స్థానంలో కొత్త పింక్ కలర్ ఆప్షన్, నోట్స్ ఫీచర్ కు తాజా విజువల్ అప్ డేట్ ను అందిస్తుంది.

ఒకే రీల్ కు 20 ఆడియో ట్రాక్స్ యాడ్ చేయడం ఎలా?

ఈ నెల ప్రారంభంలో ఇన్స్టాగ్రామ్ ఒకే రీల్ కు 20 వేర్వేరు ఆడియో ట్రాక్స్ ను జోడించే అవకాశాన్ని కల్పించింది. తమ షార్ట్ ఫామ్ వీడియోలకు మరింత నైపుణ్యం, వినోదం, సృజనాత్మకతను జోడించాలని చూస్తున్న ఎవరికైనా ఇది ఒక భారీ అప్ గ్రేడ్. సింగిల్ రీల్స్ కు 20 సాంగ్ ట్రాక్ లను యాడ్ చేయడానికిి కింద తెలిపిన స్టెప్స్ ను ఫాలో కావాలి.

  1. మీ యాప్ ను అప్ డేట్ చేయండి: ఇన్ స్టాగ్రామ్ (instagram) యొక్క తాజా వెర్షన్ మీ వద్ద ఉండేలా చూసుకోండి.
  2. రీల్ సృష్టించండి: "+" చిహ్నాన్ని ట్యాప్ చేసి, "రీల్" ఎంచుకోండి.
  3. రికార్డ్ చేయండి లేదా అప్ లోడ్ చేయండి: కొత్త వీడియోను రికార్డ్ చేయండి లేదా మీ గ్యాలరీ నుండి ఒకదాన్ని ఉపయోగించండి.
  4. ఆడియో ట్రాక్ లను జోడించండి: బహుళ ఆడియో ట్రాక్ లను చేర్చడానికి "యాడ్ టు మిక్స్" ఆప్షన్ ఉపయోగించండి. అవసరాన్ని బట్టి ఎడిట్ చేసి ట్రిమ్ చేయండి.
  5. సేవ్ చేసి పోస్ట్ చేయండి: మీ రీల్ ను ఫైనలైజ్ చేయండి. వెంటనే పోస్ట్ చేయండి లేదా తరువాత పోస్ట్ చేయడం కోసం సేవ్ చేయండి.

తదుపరి వ్యాసం