WhatsApp: వాట్సాప్ ‘స్టేటస్’ లకు కొత్త అప్ డేట్.. ‘ఇన్ స్టా’ తరహాలో..-whatsapp to get status update likes similar to instagram stories report ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Whatsapp: వాట్సాప్ ‘స్టేటస్’ లకు కొత్త అప్ డేట్.. ‘ఇన్ స్టా’ తరహాలో..

WhatsApp: వాట్సాప్ ‘స్టేటస్’ లకు కొత్త అప్ డేట్.. ‘ఇన్ స్టా’ తరహాలో..

HT Telugu Desk HT Telugu
Aug 17, 2024 04:13 PM IST

WhatsApp new update: వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్, కొత్త అప్ డేట్స్ ను వాట్సాప్ తీసుకువస్తోంది. అందులో భాగంగానే తాజాగా, వాట్సాప్ స్టేటస్ లను ‘లైక్’ చేసే విషయంలో ఇన్ స్టా గ్రామ్ రీల్స్ తరహాలో కొత్త అప్ డేట్ ను ప్రకటించింది.

వాట్సాప్ ‘స్టేటస్’ లకు కొత్త అప్ డేట్.. ‘ఇన్ స్టా’ తరహాలో..
వాట్సాప్ ‘స్టేటస్’ లకు కొత్త అప్ డేట్.. ‘ఇన్ స్టా’ తరహాలో..

WhatsApp new update: ఇన్స్టాగ్రామ్ స్టోరీలకు యూజర్లు ఎలా లైక్ చేయవచ్చో అదే విధంగా వాట్సాప్ స్టేటస్ లను 'లైక్' చేయడానికి వీలు కల్పించే కొత్త ఫీచర్ ను వాట్సాప్ ప్రవేశపెట్టనుంది. వినియోగదారులు అప్ డేట్ చూస్తున్నప్పుడు స్క్రీన్ దిగువ ఎడమ వైపున ఉన్న హార్ట్ ఎమోజీని నొక్కడం ద్వారా స్టేటస్ అప్డేట్ ను లైక్ చేయవచ్చు. వ్యూస్ జాబితాను ఉపయోగించి స్టేటస్ ను ఎవరెవరు లైక్ చేశారో చూడటం కూడా ఇక సాధ్యమవుతుంది. చాటింగ్ ను స్టార్ట్ చేయకుండానే కాంటాక్ట్స్ తో కనెక్ట్ కావడానికి వీలు కల్పించే ఈజీ మార్గం ఇది.

వేరేగా స్టేటస్ లైక్ లు

స్టేటస్ లైక్ లు వేరేగా కనిపిస్తాయి కాబట్టి చాట్ సంభాషణలకు అంతరాయం కలగదు. స్టేటస్ కు రిప్లై ఇవ్వడం, స్టేటస్ కు లైక్ లేదా లవ్ సింబల్ ద్వారా స్పందించడం మామూలు చాటింగ్ కన్నా భిన్నంగా ఉంటుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న విధానం ద్వారా కూడా స్టేటస్ లపై స్పందించవచ్చు. ఈ కొత్త ఫీచర్ ను ప్రస్తుతం పబ్లిక్ బీటా యూజర్లు పరీక్షిస్తున్నారని, దీనిపై కొంతకాలంగా రీసెర్చ్ జరుగుతోందని ‘వాబీటాఇన్ఫో’ వెల్లడించింది.

ఈ ఫీచర్ ను ఎవరు యాక్సెస్ చేయగలరు?

ప్రస్తుతం ఈ ఫీచర్ అందరికీ అందుబాటులో లేదు. గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉన్న వాట్సాప్ తాజా వెర్షన్ 2.24.17.21 ను ఇన్ స్టాల్ చేసుకున్న వాట్సాప్ బీటా యూజర్లకు ఇది లభిస్తుంది.ఈ అప్ డేట్ రాబోయే వారాల్లో రెగ్యులర్ యూజర్లకు అందుబాటులోకి రానుంది. వాట్సాప్ చాట్ బాట్ తో రియల్ టైమ్ వాయిస్ సంభాషణల్లో పాల్గొనడానికి వినియోగదారులను అనుమతించే కొత్త ఫీచర్ ను అభివృద్ధి చేసే పనిలో ఉందని, వాట్సాప్ (whatsapp) యాజమాన్యంలోని మెటా కూడా మెటా ఏఐ వాయిస్ ఫంక్షనాలిటీకి మరిన్ని మెరుగుదలలను ప్లాన్ చేస్తోందని సమాచారం.