Optical Illusion: ఇచ్చిన ఆప్టికల్ ఇల్యూషన్లో ఎన్నో ముద్దుల మధ్య ఒక చిన్న లవ్ సింబల్ దాగి ఉంది, దాన్ని 10 సెకన్లలో కనిపెట
Optical Illusion: వాలెంటైన్స్ డే సందర్భంగా ఇక్కడ ఒక ముద్దుల ఆప్టికల్ ఇల్యూషన్ ఇచ్చాము. అందులో ఎన్నో ముద్దులు ఉన్నాయి. మధ్యలో ఒక లవ్ సింబల్ కూడా ఉంది. దాన్ని కనిపెట్టండి.
Optical Illusion: వాలెంటైన్స్ డే వచ్చిందంటే ప్రేమ పక్షులందరికీ పండగే. వాలెంటైన్స్ డే రిలేటెడ్ ఉత్పత్తులను కొనేందుకు వారు ఆసక్తి చూపిస్తారు. అలాగే ప్రేమ సంబంధిత కథనాలు చదివేందుకు వెతుకుతూ ఉంటారు. అందుకే ఇక్కడ మేము వాలెంటైన్స్ డే ఆప్టికల్ ఇల్యూషన్ ఇచ్చాము. ఈ ఆప్టికల్ ఇల్యూషన్లో ఎన్నో ముద్దులు ఉన్నాయి. రంగురంగుల పెదవులు ఇక్కడ కనిపిస్తున్నాయి. వాటి మధ్యలో ఒక చిన్న లవ్ సింబల్ కూడా ఉంది. అది ఎక్కడుందో కనిపెట్టడమే మీ పని.
ఎక్కువ సమయం ఇస్తే ఆ చిన్న హృదయాన్ని ఎవరైనా ఇట్టే కనిపిస్తారు. కేవలం 10 సెకన్లలో మాత్రమే ఆ లవ్ సింబల్ ని మీరు కనిపెట్టాలి. ఆ చిన్న హృదయం ఎక్కడ దాక్కుందో మీ మెదడు, కంటి సమన్వయంతో కనిపెట్టండి. ఆ చిన్న హృదయాన్ని గుర్తించాలంటే మీ చూపు చురుగ్గా ఉండాలి. మెదడు, కళ్ళు కలిసి పని చేయాలి.
ఆప్టికల్ ఇల్యూషన్ జవాబు
లవ్ సింబల్ గుర్తును చిత్రంలో 10 సెకన్లలో కనిపెట్టిన వారికి కంగ్రాట్స్. ఆ సమయంలోనే మీరు కనిపెట్టారంటే మీ మెదడు, కళ్ళు చక్కగా పనిచేస్తున్నాయని అర్థం. మీరు తెలివైన వారని కూడా అర్థం చేసుకోవాలి. ఎవరైతే కనిపెట్టలేదో వారికోసం మేము ఇక్కడ జవాబు చెబుతున్నాం. చిత్రంలో కింద నుంచి చూడండి. ఒక పెద్ద ఎర్ర పెదవి మీద చిన్న లవ్ సింబల్ ఉంది. అదే మీరు వెతికే హృదయం.
ఆప్టికల్ ఇల్యూషన్ చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి. మీ మెదడుకు, కళ్ళకు, మనసుకు కూడా సవాలు విసురుతాయి. ఇలాంటి పజిల్స్ ను పరిష్కరించడం వల్ల మీ మెదడు పనితీరు చురుగ్గా మారుతుంది. అలాగే కంటి చూపు కూడా మెరుగవుతుంది. అందులోనూ ఇవి ఎంతో టైం పాస్ గా అనిపిస్తాయి. ఇలాంటి ఆర్టికల్ ఇల్యూషన్లను గ్రీకు దేశంలో కనిపెట్టారని చెబుతారు. అక్కడి పురాతన కట్టడాలపై కొన్ని రకాల ఆర్టికల్ ఇల్యూషన్లను చరిత్రకారులు గుర్తించారు. అందుకే వీటి పుట్టుక జరిగింది గ్రీసు దేశంలో అని ప్రచారంలో ఉంది. ఇప్పుడు ఎంతోమంది ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రకారులు ఉన్నారు. వారు సోషల్ మీడియా ద్వారా తమ టాలెంటును ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. విదేశాల్లో ఎంతో మంది చిత్రకారులు ఆప్టికల్ ఇల్యూషన్లనే తమ సంపాదనగా మార్చుకున్నారు. ఇన్ స్టాగ్రామ్ లో ఆప్టికల్ ఇల్యూషన్ల కోసం ఎన్నో పేజీలు ఉన్నాయి.
సోషల్ మీడియాలో పేజీలు కొన్ని ఆప్టికల్ ఇల్యూషన్ కోసమే కేటాయించారు. మీకు ఆసక్తి ఉంటే తరచూ వాటిని సాల్వ్ చేస్తూ ఉంటే మీరు తెలివిగా మారుతారు. పిల్లలకు తరచూ ఇలాంటివి సాల్వ్ చేయిస్తూ ఉంటే వారు తెలివిగా మారుతారు. వారి తెలివితేటలను ఇవి పెంచుతాయి. ఆప్టికల్ ఇల్యూషన్లు భౌతిక భ్రమల వల్ల కలుగుతాయి.
టాపిక్