Optical Illusion: ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌లో తోక తెగిన గుర్రం ఎక్కడుందో పావు నిమిషంలో కనిపెట్టండి-find out where the tailed horse is in this optical illusion in a quarter of a minute ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Optical Illusion: ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌లో తోక తెగిన గుర్రం ఎక్కడుందో పావు నిమిషంలో కనిపెట్టండి

Optical Illusion: ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌లో తోక తెగిన గుర్రం ఎక్కడుందో పావు నిమిషంలో కనిపెట్టండి

Haritha Chappa HT Telugu
Dec 27, 2023 09:37 AM IST

Optical Illusion: ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌లో తోక తెగిన గుర్రం ఒకటుంది. అది ఎక్కడుందో 15 సెకండ్లలో కనిపెడితే మీరు తోపే.

ఆప్టికల్ ఇల్యూషన్
ఆప్టికల్ ఇల్యూషన్ (Instagram)

Optical Illusion: ఆప్టికల్ ఇల్యూషన్ అనేది ఒక దృశ్య భ్రమ. కళ్ళముందే నిజం కనిపిస్తున్న దాన్ని కనిపెట్టేందుకు కాస్త సమయం పడుతుంది... ఇదే ఆప్టికల్ ఇల్యూషన్ల ప్రత్యేకత. ఈ ఆప్టికల్ ఇల్యూషన్ల మూలాలు పురాతన గ్రీకు దేశంలో ఉన్నట్టు చెబుతారు. అక్కడి పురాతన కళల్లో ఇదీ ఒకటి అని అంటారు. పురాతన గ్రీకు వాస్తు శిల్పంలో ఈ ఆప్టికల్ ఇల్యూషన్లు ఉన్నట్టు చరిత్రకారులు వివరిస్తున్నారు. ఆప్టికల్ ఇల్యూషన్లలో తొలితరం చిత్రాలను గ్రీకు ఆలయ పైకప్పులపై కనుగొన్నారు. అప్పటినుంచి ఇవి గ్రీకు దేశానికి చెందినవనే అభిప్రాయం ఎక్కువ మందిలో ఉంది. ఆప్టికల్ ఇల్యూషన్లు కాంతి వక్రీభవనం చెందడం వల్ల ఏర్పడతాయని అంటారు. వీటి చరిత్ర ఎలా ఉన్నా... ఇప్పుడు ఇవి మాత్రం మంచి టైమ్ పాస్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మీకు అలాంటి ఒక ఆసక్తికరమైన ఆప్టికల్ ఇల్యూషన్ అందించాము.

ఆప్టికల్ ఇల్యూషన్

పైన కనిపిస్తున్న చిత్రంలో అనేక గుర్రాలు దౌడు తీస్తూ కనిపిస్తున్నాయి. వాటిల్లో అన్నింటికీ తోకలు, కాళ్లు ఉన్నాయి. కానీ ఒక గుర్రానికి మాత్రం తోక తెగిపోయింది. ఆ తోక తెగిపోయిన గుర్రం ఈ గుర్రాల్లో కలిసి పోయి పరుగులు తీస్తోంది. అది ఎక్కడుందో మీరు కనిపెట్టాలి. ఎక్కువ సమయం తీసుకుంటే ప్రతి ఒక్కరూ కనిపెట్టేస్తారు. కేవలం 15 సెకండ్లలోనే కనిపెడితే మీరే తోపే. మీ కంటి చూపు, మెదడు సమన్వయం ఎలా ఉందో దీని ద్వారా తెలిసిపోతుంది. పదిహేను సెకండ్లలోనే మీరు ఆ గుర్రాన్ని కనిపెడితే మీ కంటి చూపు, మెదడు మంచి సమన్వయంతో పని చేస్తున్నాయని అర్థం. ఒకసారి ప్రయత్నించండి.

జవాబు ఇదిగో

పదిహేను సెకండ్లలోనే తోక తెగిన గుర్రాన్ని కనిపెట్టిన వారికి శుభాకాంక్షలు. ఆ సమయంలోపు కనిపెట్టలేని వారు మరిన్ని ఆప్టికల్ ఇల్యూషన్లను ప్రాక్టీస్ చేస్తూ కంటి, మెదడు మధ్య సమన్వయాన్ని పెంచుకోవచ్చు. ఇక జవాబు విషయానికి వస్తే కింద నుంచి రెండో లైన్ లో ఉన్న గుర్రాలను చూడండి. అందులో మూడో గుర్రానికి తోకలేదు. అదే తోక తెగిన గుర్.రం అన్ని గుర్రాల్లోనూ కలిసిపోయి పరుగులు తీస్తోంది. ప్రాచీన కాలంలో ఆప్టికల్ ఇల్యూషన్లు ఎంతో వినోదాన్ని పంచేవి. ఇప్పుడు ఎంతో మంది ఆప్టికల్ ఇల్యూషన్ల చిత్రకారులు ఉపాధి పొందుతున్నారు. ఇవి ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ వైరల్ అవుతున్నాయి. వీటికి అభిమానులు ఎక్కువ.

టాపిక్