iOS 17.6 update: ముఖ్యమైన సెక్యూరిటీ ఫిక్స్ తో ఐఓఎస్ 17.6 అప్ డేట్ వచ్చేసింది; మీ ఐఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకున్నారా?-iphone users get ios 17 6 update with important security fixes you should install it right now ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Ios 17.6 Update: ముఖ్యమైన సెక్యూరిటీ ఫిక్స్ తో ఐఓఎస్ 17.6 అప్ డేట్ వచ్చేసింది; మీ ఐఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకున్నారా?

iOS 17.6 update: ముఖ్యమైన సెక్యూరిటీ ఫిక్స్ తో ఐఓఎస్ 17.6 అప్ డేట్ వచ్చేసింది; మీ ఐఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకున్నారా?

HT Telugu Desk HT Telugu
Jul 30, 2024 06:07 PM IST

iOS 17.6 update: ఆపిల్ ఇప్పుడు పలు ఐఫోన్ మోడళ్ల కోసం ఐఓఎస్ 17.6 ను విడుదల చేస్తోంది. ఇది అనేక ముఖ్యమైన సెక్యూరిటీ, బగ్ ఫిక్స్ లను తీసుకువస్తుంది. ఈ 17.6 అప్ డేట్ ఎంపిక చేసిన ఐ ఫోన్ మోడల్స్ కు మాత్రమే అందుబాటులో ఉంది. మీ ఫోన్ ఆ లిస్ట్ లో ఉందో, లేదో ఇక్కడ చూడండి.

ఐఓఎస్ 17.6 అప్ డేట్
ఐఓఎస్ 17.6 అప్ డేట్ (Unsplash)

iOS 17.6 update: ముఖ్యమైన సెక్యూరిటీ ఫిక్స్ లతో ఐఓఎస్ 17.6 ను ఆపిల్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇటీవలనే పలు ఇంటెలిజెన్స్ ఫీచర్లతో ఐఓఎస్ 18.1 ను ఆపిల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. లేటెస్ట్ గా కంపేటబిలటీ కలిగిన ఐఫోన్స్ కోసం ఆపిల్ ఐఓఎస్ 17.6 అప్ డేట్ ను రిలీజ్ చేసింది. ఈ ఐఓఎస్ అప్ డేట్ లో ఇతర అప్ డేట్స్ తో పాటు పలు ముఖ్యమైన సెక్యూరిటీ ఫిక్స్, బగ్ ఫిక్స్ ఫీచర్స్ ఉన్నాయి.

ఇన్ స్టాల్ చేసుకుంటే ఈ బెనిఫిట్స్

ఈ ఫోన్స్ కు అందుబాటులో ఐఓఎస్ 17.6 అప్ డేట్ ప్రస్తుతం ఐఓఎస్ 17.6 ఇప్పుడు అన్ని ఐఫోన్ లకు అందుబాటులో ఉంది. ఈ అప్ డేట్ ను ఐఫోన్ లను ఉపయోగిస్తున్న అందరూ వెంటనే డౌన్ లోడ్ చేసుకుని ఇన్ స్టాల్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఇందులో ఐఓఎస్ లో ఉన్న వివిధ లోపాలకు పరిష్కారాలు ఉన్నాయి. ఇందులో ఫ్యామిలీ షేరింగ్ కు సంబంధించిన బగ్ కు ఫిక్స్ ఉంది. ఈ బగ్ వివిధ యాప్స్ కు లొకేషన్ ను లీక్ చేస్తుంది. అలాగే, ఈ అప్ డేట్ లో కెర్నల్ బగ్ ఉంది. అందువల్ల వెంటనే ఐఓఎస్ 17.6 అప్ డేట్ ను డౌన్లోడ్ చేయడం మంచిది.

ఐఓఎస్ 17.6 అప్ డేట్ ను ఇలా ఇన్ స్టాల్ చేసుకోండి..

ఐఓఎస్ 17.6 ను డౌన్ లోడ్ చేసుకుని, ఇన్ స్టాల్ చేయడానికి ఈ కింది స్టెప్స్ ఫాలో కావాలి.

స్టెప్ 1: మీ ఐఫోన్ (iphone) లో సెట్టింగ్స్ > జనరల్ కు వెళ్లండి.

స్టెప్ 2: సాఫ్ట్వేర్ అప్ డేట్ పై ట్యాప్ చేయండి.

స్టెప్ 3: మీరు ఐఓఎస్ 17.6 కోసం అప్డేట్ కనిపిస్తుంది. ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉంటాయి. వెంటనే అప్ డేట్ పొందడానికి ‘అప్ డేట్ నౌ’ ఆప్షన్ పై ట్యాప్ చేయాలి. రాత్రి సమయంలో అప్ డేట్ పొందడానికి అప్ డేట్ టు నైట్ ఆప్షన్ ను ఎంచుకోవచ్చు.

దశ 4: అప్ డేట్ ను ఆమోదించడానికి మీ ఐఫోన్ పాస్ కోడ్ ను నమోదు చేయండి.

స్టెప్ 5: అంతే! అప్డేట్ ఇప్పుడు డౌన్లోడ్ కావడం ప్రారంభం అవుతుంది.

ఐఓఎస్ 17.6 కంపేటబిలిటీ ఉన్న ఐఫోన్ మోడల్స్

  • ఐఫోన్ 15
  • ఐఫోన్ 15 ప్లస్
  • ఐఫోన్ 15 ప్రో
  • 15 ప్రో మ్యాక్స్
  • ఐఫోన్ 14
  • ఐఫోన్ 14 ప్రో
  • ఐఫోన్ 14 ప్రో మాక్స్
  • ఐఫోన్ 13
  • ఐఫోన్ 13 మినీ
  • ఐఫోన్ 13 ప్రో
  • ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్
  • ఐఫోన్ 12
  • ఐఫోన్ 12 మినీ
  • ఐఫోన్ 12 ప్రొ
  • ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్
  • ఐఫోన్ 11
  • ఐఫోన్ 11 ప్రో
  • ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్
  • ఐఫోన్ XS
  • ఐఫోన్ ఎక్స్ఎస్ మ్యాక్స్
  • ఐఫోన్ XR
  • ఐఫోన్ SE
    (2 వ తరం లేదా తరువాత)

Whats_app_banner