మ్యూజిక్ మానసిక స్థితిని మెరుగుపరుస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. నిద్రను ప్రేరేపిస్తుంది, గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. సంగీతం వినడం వల్ల కలిగి 9 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.   

pexels

By Bandaru Satyaprasad
Jul 23, 2024

Hindustan Times
Telugu

ఒత్తిడిని తగ్గిస్తుంది - మ్యూజిక్ స్ట్రెస్ బస్టర్. మధురమైన మెలోడీలను వినడం వల్ల ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ తగ్గుతుంది. టెన్షన్ నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది.  

pexels

ఆందోళన, డిప్రెషన్ నుంచి ఉపశమనం - సంగీతం ఆందోళన, నిరాశ లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది. మ్యూజిక్ మెడిటేషన్ మాదిరిగా మానసిక ప్రశాంతతను అందిస్తుంది.  

pexels

మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది - సంగీతం హ్యాపీ హార్మోన్ డోపమైన్ ను ఉత్పత్తిని పెంచుతుంది. ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.  

pexels

 ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది - సంగీతం మీ ఏకాగ్రతను పెంచుతుంది. లోతైన అధ్యయనం, పనిపై నిమగ్నం అయ్యేందుకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. 

pexels

మంచి నిద్ర - మ్యూజిక్ థెరపీ మీ నిద్ర స్థాయిలను మెరుగుపరుస్తుంది. మనసుకు ప్రశాంతత కలిగించి బాగా నిద్ర పట్టేందుకు అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది.  

pexels

గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది - మ్యూజిక్ ను వినడం వల్ల మనసుకు ప్రశాంతత భావం కలిగి ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ స్థాయిలను తగ్గడం, రక్తపోటు తగ్గే అవకాశం ఉంది. రక్తంలోని సెరోటోనిని, ఎండార్పిన్ స్థాయిలను పెంచి హార్ట్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది.  

pexels

జ్ఞాపకశక్తిని ప్రేరేపిస్తుంది - మ్యూజిక్ కు భావోద్వేగాల మెరుగుపరిచే లక్షణం ఉంది. అలాగే జ్ఞాపకశక్తిని మెరుగుపరిచి, అల్జీమర్స్ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.  

pexels

నొప్పిని తగ్గిస్తుంది - మానసిక, భావోద్వేగ ప్రయోజనాలకు మించి, సంగీతం శారీర అసౌకర్యాలను తగ్గిస్తుంది. మ్యూజిక్ నొప్పి తీవ్రతను తగ్గించడంలో సహాయపడుతుంది.  

pexels

వ్యాయామ సమయంలో - వ్యాయామం చేసే సమయంలో ఎనర్జిటిక్ సాంగ్స్ వినడం వల్ల ఓర్పును పెంచి, వ్యాయామం మరింత ప్రభావవంతంగా ఉంటుంది.  

బెల్లం  తింటే ఏమవుతుంది..! వీటిని తెలుసుకోండి

image credit to unsplash