తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Flipkart Hello Summer Days: ఫ్లిప్‍కార్ట్‌లో సమ్మర్ డేస్ సేల్: ఏసీలు, రిఫ్రిజిరేటర్లపై 60 శాతం వరకు డిస్కౌంట్లు!

Flipkart Hello Summer Days: ఫ్లిప్‍కార్ట్‌లో సమ్మర్ డేస్ సేల్: ఏసీలు, రిఫ్రిజిరేటర్లపై 60 శాతం వరకు డిస్కౌంట్లు!

22 March 2023, 11:25 IST

  • Flipkart Hello Summer Days Sale: ఫ్లిప్‍కార్ట్‌లో హలో సమ్మర్ డేస్ సేల్ నేడు (మార్చి 22) మొదలైంది. ఈ సేల్‍లో ఎయిర్ కండీషనర్లు, రిఫ్రిజిరేటర్లపై డిస్కౌంట్లు ఉన్నాయి.

Flipkart Hello Summer Days: ఫ్లిప్‍కార్ట్ లో సమ్మర్ డేస్ సేల్
Flipkart Hello Summer Days: ఫ్లిప్‍కార్ట్ లో సమ్మర్ డేస్ సేల్ (Reuters)

Flipkart Hello Summer Days: ఫ్లిప్‍కార్ట్ లో సమ్మర్ డేస్ సేల్

Flipkart Hello Summer Days Sale: వేసవి సందర్భంగా ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‍ఫామ్ ఫ్లిప్‍కార్ట్ (Flipkart) సేల్‍ను అందుబాటులోకి తెచ్చింది. హలో సమ్మర్ డేస్ (Hello Summer Days) పేరుతో సేల్‍ను మొదలుపెట్టింది. నేడు (మార్చి 22) మొదలైన ఈ స్పెషల్ సేల్ 26వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ సేల్‍లో ఎయిర్ కండీషనర్లు (Air Conditioners - ACs)పై 55 శాతం వరకు, రిఫ్రిజిరేటర్ల (Refrigerators)పై 60 శాతం వరకు డిస్కౌంట్లు ఉంటాయని Flipkart పేర్కొంది. వివరాలివే..

ట్రెండింగ్ వార్తలు

First Bajaj CNG motorcycle: బజాజ్ నుంచి తొలి సీఎన్జీ మోటార్ సైకిల్; జూన్ 18 న లాంచ్

Bajaj Pulsar NS400Z: 2024 పల్సర్ ఎన్ఎస్400జెడ్ ను లాంచ్ చేసిన బజాజ్; ధర కూడా తక్కువే..

‘‘ఆపిల్ వాచ్ 7 నా ప్రాణాలను కాపాడింది’’: ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ కు థాంక్స్ చెప్పిన ఢిల్లీ యువతి

Stock market: ర్యాలీకి బ్రేక్; స్టాక్ మార్కెట్ క్రాష్; రూ. 2.3 లక్షల కోట్లు నష్టపోయిన ఇన్వెస్టర్లు

బ్యాంక్ కార్డ్ ఆఫర్

Flipkart Hello Summer Days Sale: ఫ్లిప్‍కార్ట్ హలో సమ్మర్ డేస్ సేల్‍ సందర్భంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) క్రెడిట్, డెబిట్ కార్డుతో కొనుగోళ్లు చేస్తే 10 శాతం అదనపు డిస్కౌంట్ వర్తిస్తుందని ఫ్లిప్‍కార్ట్ పేర్కొంది. దాదాపు ఈ సేల్‍లో చాలా ఏసీలు, రిఫ్రిజిరేటర్లపై ఈ ఎస్‍బీఐ కార్డ్ ఆఫర్ వర్తిస్తోంది. వివిధ బ్యాంకు కార్డులతో నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం ఉంది. ఎక్స్చేంజ్ సదుపాయం కూడా వినియోగించుకోవచ్చు.

డిస్కౌంట్లు

Flipkart Hello Summer Days Sale: హలో సమ్మర్ డేస్ సేల్‍లో సామ్‍సంగ్ 1.5 టన్ కన్వర్టబుల్ 5-ఇన్-1 3 స్టార్ ఏసీ రూ.37,999కే లభిస్తోంది. కార్డు ఆఫర్ వాడుకోవచ్చు. ప్యానసోనిక్ 1.5 టన్ ఇన్వర్టర్ వైఫై కనెక్ట్ ఏసీ రూ.36,999కే అందుబాటులో ఉంది. ఎల్‍జీ కన్వర్టబుల్ 6-ఇన్-1 3 స్టార్ ఏసీ రూ.38,990కు ఈ సేల్‍లో ఉంది. లాయిడ్ 1.5 టన్ 3 స్టార్ ఏసీ రూ.32,999కే ఈ సేల్ లో లభిస్తోంది. ఇలా సామ్‍సంగ్, ఎల్‍జీ, ప్యానసోనిక్, వాల్‍పూల్, లాయిడ్, డైకిన్ సహా దాదాపు అన్ని బ్రాండ్ల ఏసీలపై ప్రస్తుత సేల్‍లో డిస్కౌంట్లు ఉన్నాయి. బ్యాంక్ కార్డు ఆఫర్ వినియోగించుకుంటే మరింత తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు.

Flipkart Hello Summer Days Sale: ఫ్లిప్‍కార్ట్ హలో సమ్మర్ డేస్ సేల్‍లో సామ్‍సంగ్, వోల్టాస్, ఎల్‍జీ, వాల్‍పూల్, హయెర్, గోద్రెజ్ సహా మిగిలిన కంపెనీల రిఫ్రిజిరేటర్లు సాధారణం కంటే తగ్గింపు ధరకు లభిస్తున్నాయి. వోల్టాస్ బెకో 183 లీటర్ 4 స్టార్ రిఫ్రిజిరేటర్ 15,690కే లభిస్తోంది. సామ్‍సంగ్ ఫ్రోస్ట్ డబుల్ డోర్ ఫ్రిడ్జ్ రూ.23వేలలోపు ధరకే అందుబాటులో ఉంది. వాల్‍పూల్ 207 లీటర్ 5 స్టార్ రిఫ్రిజిరేటర్ రూ.18వేలలోపు ధరతో లభిస్తోంది. ఇలా చాలా మోడళ్లపై ఆఫర్ ధర ఉంది. ఈ సేల్ మార్చి 26 వరకు ఉంటుందని ఫ్లిప్‍కార్ట్ వెల్లడించింది.