Honor Play 30M । మిడ్-రేంజ్ ఫీచర్లతో హానర్ నుంచి సరికొత్త 5G స్మార్ట్‌ఫోన్!
06 November 2022, 11:46 IST
- హానర్ నుంచి Honor Play 30M అనే 5G స్మార్ట్‌ఫోన్ విడుదలైంది. దీని ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి.
Honor Play 30
చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ హానర్ ఈ ఏడాదిలో Honor Play 30 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇప్పుడు దీనికి మరొక కొత్త వేరియంట్ Honor Play 30M స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ Honor Play 30M స్మార్ట్‌ఫోన్ మిడ్-రేంజ్ ఫీచర్లతో విడుదలైన 5G స్మార్ట్‌ఫోన్. 20:9 యాస్పెక్ట్ రేషియోతో కలిగిన TFT LCD నాచ్డ్ HD+ డిస్‌ప్లే, పెద్ద బ్యాటరీ, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మొదలైన స్పెసిఫికేషన్లను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ దాదాపు దాని పాత వేరియంట్‌ను పోలి ఉంటుంది. అయితే మరింత మెరుగైన ఫీచర్లతో అప్‌డేట్ అయి వచ్చింది.
Honor Play 30M స్మార్ట్‌ఫోన్ సిల్వర్, బ్లాక్, బ్లూ అనే మూడు కలర్ ఆప్షన్‌లలో లభ్యమవుతుంది. అయితే ర్యామ్, స్టోరేజ్ ప్రకారంగా 6GB+128GB ఏకైక కాన్ఫిగరేషన్‌లో లభిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ మందం 8.69mm కాగా, బరువు 194g గ్రాములను కలిగి ఉంది. ఇంకా ఫీచర్ల జాబితాలో ఏం ఉన్నాయి, ధర ఈ స్మార్ట్‌ఫోన్ ధర ఎంత. లభ్యత ఎప్పట్నించి మొదలైన అన్ని వివరాలను ఈ కింద పరిశీలించండి.
Honor Play 30M 5G స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
- 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.5 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే
- 6GB RAM, 128 GB స్టోరేజ్ సామర్థ్యం
- Qualcomm స్నాప్‌డ్రాగన్ 480G ప్లస్ ప్రాసెసర్
- వెనకవైపు 13MP+2MP డ్యూయల్ కెమెరా, ముందు వైపు 5MP సెల్ఫీ స్నాపర్
- ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
- 5000 mAh బ్యాటరీ సామర్థ్యం, 10W ఫాస్ట్ ఛార్జర్
Honor Play 30M స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం చైనాలో విడుదలయింది. అక్కడ దీని ధర 1299 యువాన్లు (భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 15 వేలు). ఇప్పటికే విక్రయాలు కూడా ప్రారంభమైనాయి. మిగతా మార్కెట్లలోకి ఎప్పుడు వస్తుందనేది తెలియాల్సి ఉంది. దాదాపు ఇవే ఫీచర్లతో Honor Play 6Cను కూడా కంపెనీ విడుదల చేసింది. దీని ధర ఇంకా తక్కువగా ఉంటుంది.