OnePlus Nord N300 । వన్‌ప్లస్ నుంచి బడ్జెట్ ధరలో 5G స్మార్ట్‌ఫోన్‌ ఇదిగో!-oneplus nord n300 5g smartphone with mediatek chipset launched at this price ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Oneplus Nord N300 । వన్‌ప్లస్ నుంచి బడ్జెట్ ధరలో 5g స్మార్ట్‌ఫోన్‌ ఇదిగో!

OnePlus Nord N300 । వన్‌ప్లస్ నుంచి బడ్జెట్ ధరలో 5G స్మార్ట్‌ఫోన్‌ ఇదిగో!

HT Telugu Desk HT Telugu
Oct 25, 2022 02:00 PM IST

వన్‌ప్లస్ నుంచి OnePlus Nord N300 అనే బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ విడుదలయింది. దీని ధర, ఫీచర్లను ఇక్కడ తెలుసుకోండి.

 OnePlus Nord N300
OnePlus Nord N300

చైనీస్ మొబైల్ తయారీదారు వన్‌ప్లస్, తమ నార్డ్ సిరీస్‌ను విస్తరిస్తూ తాజాగా 'వన్‌ప్లస్ నార్డ్ ఎన్300' అనే స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇది మిడ్-రేంజ్ ఫీచర్లను కలిగి ఉంది. ఇందులో భాగంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్ డైమెన్సిటీ 810 5G చిప్‌సెట్‌తో వచ్చింది. ప్రస్తుతం యూఎస్ మార్కెట్లో ఈ ఫోన్ విడుదలైంది. అయితే యూఎస్‌లో మీడియాటెక్ చిప్‌సెట్‌తో వచ్చిన మొదటి ఫోన్ ఇదే కావడం గమనార్హం. సాధారణంగా ఈ మీడియాటెక్ ప్రాసెసర్లు బడ్జెట్ ధరలో లభించే హ్యాండ్‌సెట్లలో అందిస్తారు. అయినప్పటికీ ఇవి మెరుగైన పనితీరునే కనబరుస్తాయి.

ఇక, OnePlus Nord N300 స్మార్ట్‌ఫోన్‌ విషయానికి వస్తే, ఇది 5Gకి సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ మిడ్‌నైట్ జేడ్ అనే ఏకైక కలర్ వేరియంట్‌లో లభిస్తుంది, అలాగే 4GB ర్యామ్, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లో అందుబాటులో ఉంటుంది. స్టోరేజ్ సామర్థ్యాన్ని మైక్రో SD ద్వారా 1TB వరకు పెంచుకోవచ్చు. వాటర్ డ్రాప్ నాచ్ కలిగిన ఫ్రంట్ కెమెరా, OnePlus పవర్ బటన్‌పై మౌంట్ చేసిన ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇతర ప్రధానాంశాలుగా చెప్పుకోవచ్చు.

OnePlus Nord N300లో ఫీచర్ల జాబితాలో మరిన్ని అంశాలు ఎలా ఉన్నాయి, ధర ఎంత మొదలైన వివరాలు ఇక్కడ చూడండి.

OnePlus Nord N300 5G స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

  • 90Hz రిఫ్రెష్ రేట్‌ కలిగిన 6.56 అంగుళాల IPS LCD డిస్‌ప్లే
  • 4GB RAM, 64GB స్టోరేజ్ సామర్థ్యం
  • ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్
  • వెనకవైపు 48MP+2MP డ్యూయల్ కెమెరా సెటప్‌, ముందు భాగంలో 8MP సెల్ఫీ షూటర్‌
  • ఆండ్రాయిడ్ ఆక్సిజన్‌ 13 ఆపరేటింగ్ సిస్టమ్
  • 5000mAh డ్యూయల్-సెల్ బ్యాటరీ, 33W ఛార్జింగ్

ప్రస్తుతానికి ఈ ఫోన్ యునైటెడ్ స్టేట్స్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. నవంబర్ 3 నుండి దీని విక్రయాలు ప్రారంభమవుతాయి.

యునైటెడ్ స్టేట్స్‌లో ఈ ఫోన్ ధర $228 (సుమారు రూ.19,000). T-Mobile అలాగే Metro ద్వారా కొనుగోలు చేయవచ్చు. మిగతా మార్కెట్లలో లాంచ్ ఎప్పుడనేది తెలియాల్సి ఉంది.

WhatsApp channel

సంబంధిత కథనం