దీపావళి ఆఫర్, ధర 35 వేలు ఉన్న iQOO Neo 6 5G స్మార్ట్‌ఫోన్‌ ఇప్పుడు రూ. 9 వేలకే!-now get iqoo neo 6 5g smartphone at just rs 9000 hurry its a limited time deal ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Now Get Iqoo Neo 6 5g Smartphone At Just Rs 9000, Hurry Its A Limited Time Deal

దీపావళి ఆఫర్, ధర 35 వేలు ఉన్న iQOO Neo 6 5G స్మార్ట్‌ఫోన్‌ ఇప్పుడు రూ. 9 వేలకే!

HT Telugu Desk HT Telugu
Oct 18, 2022 10:00 PM IST

ఉన్నతమైన ఫీచర్లతో iQOO Neo 6 5G స్మార్ట్‌ఫోన్‌ ఇటీవల విడుదల అయింది. లాంచ్ సమయంలో దీని ధర రూ. 35 వేలు కాగా, దీపావళి ఆఫర్లో ఇప్పుడు ఫోన్‌‌ను కేవలం రూ. 9 వేలకే సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఆ వివరాలు చూడండి.

iQOO Neo 6 5G
iQOO Neo 6 5G

ఈ దీపావళికి మీ పాత ఫోన్‌ను పేల్చేయండి, అతి తక్కువ ధరకే అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ సొంతం చేసుకోండి. మీరు ఈ పండగకి స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేయాలని చూస్తుంటే అమెజాన్ ఇండియా దీపావళి సందర్భంగా ధమాకా డీల్‌ని అందిస్తోంది. ఈ ప్రత్యేక ఆఫర్ కింద మీరు కేవలం రూ. 9 వేలకే 5G స్మార్ట్‌ఫోన్‌ను దక్కించుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

ఇటీవలే భారత మార్కెట్లో విడుదలైన iQOO Neo 6 5G స్మార్ట్‌ఫోన్‌ అసలు ధర, రూ. 34,999/- అయితే దీపావళి ఆఫర్ సేల్‌లో భాగంగా ఈ ధరపై రూ. 7 వేలు తక్షణ డిస్కౌంట్ అందిస్తున్నారు. దీంతో ఈ ఫోన్ ధర రూ. 27,999/- తగ్గింది. మీరు ఈ ఫోన్‌ను సిఐటిఐ, ఐసిఐసిఐ, కోటక్ బ్యాంక్ లేదా రూపే కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే మీకు అదనంగా మరో రూ. 2,000/- ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుంది. అపుడు దీని ధర, రూ. 25,999/- కి చేరుకుంటుంది. ఇది కాకుండా మీరు మీ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా 12,200 వరకు అదనపు ప్రయోజనాన్ని పొందవచ్చు. అదనంగా బ్యాంక్ క్యాష్ బ్యాక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ కలిపితే iQOO Neo 6 5G ధర రూ. 9 వేలు మాత్రమే. కాకపోతే పై షరతులు వర్తిస్తాయి. త్వరపడండి, ఈ ఆఫర్ కేవలం 5 రోజులు మాత్రమే.

మరి, ఈ iQOO Neo 6 5G స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు, స్పెసిఫికేషన్ల జాబితాను మరొక సారి ఇక్కడ పరిశీలించండి.

iQOO Neo 6 5G స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

  • 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.62-అంగుళాల ఫుల్ HD+ E4 AMOLED స్క్రీన్
  • క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 870 చిప్‌సెట్‌
  • 8GB/12GB RAM, 128/256 GB ఇంటర్నల్ స్టోరేజ్
  • Funtouch OS 12 ఆధారిత ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్
  • వెనకవైపు 64 మెగాపిక్సెల్ కెమెరా, 8 MP అల్ట్రా-వైడ్ లెన్స్‌, 2MP సెన్సార్, ముందువైపు 16 MP సెల్ఫీ షూటర్
  • 4700mAh బ్యాటరీ, 80W ఛార్జర్‌

కనెక్టివిటీ పరంగా iQOO Neo6లో 5G, 4G LTE, Wi-Fi, బ్లూటూత్ 5.2, GPS , USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. సెన్సార్‌లను పరిశీలిస్తే బయోమెట్రిక్ ప్రమాణీకరణ కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో పాటు యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, మాగ్నెటోమీటర్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్ ఉన్నాయి.

WhatsApp channel

సంబంధిత కథనం