HTC Wildfire E Plus । హెచ్‌టిసి నుంచి బడ్జెట్ ధరకే స్టైలిష్ స్మార్ట్‌ఫోన్‌!-htc wildfire e plus smartphone launched a reborn of umidigi g1 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Htc Wildfire E Plus । హెచ్‌టిసి నుంచి బడ్జెట్ ధరకే స్టైలిష్ స్మార్ట్‌ఫోన్‌!

HTC Wildfire E Plus । హెచ్‌టిసి నుంచి బడ్జెట్ ధరకే స్టైలిష్ స్మార్ట్‌ఫోన్‌!

HT Telugu Desk HT Telugu
Oct 27, 2022 05:16 PM IST

హెచ్‌టిసి నుంచి HTC Wildfire E Plus అనే బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ విడుదలైంది. దీని ధర, ఫీచర్లు, లభ్యత గురించి ఇక్కడ తెలుసుకోండి.

HTC Wildfire E Plus
HTC Wildfire E Plus

తైవాన్ టెక్ దిగ్గజం HTC, ప్రస్తుతం గట్టి పోటీ ఉన్న స్మార్ట్‌ఫోన్ మార్కెట్ నుండి దాదాపు కనుమరుగైంది. అయినప్పటికీ ఈ బ్రాండ్ తమ 'వైల్డ్‌ఫైర్' సిరీస్ నుంచి తక్కువ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ మోడల్‌లను కొన్ని మార్కెట్లలో విడుదల చేస్తోంది. తాజాగా కంపెనీ ఇప్పుడు HTC Wildfire E Plus పేరుతో ఒక సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది.

ఇది ఎంట్రీ-లెవెల్ మొబైల్ కాబట్టి ఈ హ్యాండ్‌సెట్‌లో ఫీచర్లు తక్కువగానే ఉంటాయి. అందుకు తగినట్లుగా ధర ఉంటుంది. అయితే తాజాగా లాంచ్ చేసిన HTC Wildfire E Plus స్మార్ట్‌ఫోన్, ఈ ఏడాది జూన్‌లో గ్లోబల్ మార్కెట్లో విడుదల అయిన UMIDIGI G1 మోడల్‌కు రీబ్రాండెడ్ వెర్షన్ అని చెబుతున్నారు.

'హెచ్‌టిసి వైల్డ్‌ఫైర్ ఇ ప్లస్' బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ అయినప్పటికీ, ఇందులో USB-C పోర్ట్ సపోర్ట్ చేసే పెద్ద బ్యాటరీ, డ్యూయల్ కెమెరా సెటప్, మీడియాటెక్ ప్రాసెసర్, HD+ రిజల్యూషన్‌ కలిగిన డిస్‌ప్లే ఉన్నాయి. ఇది 32GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఏకైక కాన్ఫిగరేషన్‌లో అందుబాటులో ఉంటుంది. అయితే మైక్రో SD కార్డ్ స్లాట్‌ను కలిగి ఉండటంతో మెమరీని మరింత పెంచుకోవచ్చు. ఈ పరికరం ఆండ్రాయిడ్ 12 (గో ఎడిషన్)లో నడుస్తుంది. గో ఎడిషన్ అంటే ఆపరేటింగ్ సిస్టంలో తేలికపాటి వెర్షన్.

HTC Wildfire E Plusలో మిగతా ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయి, ధర ఎంత? తదితర వివరాలను ఇక్కడ పరిశీలించండి.

HTC Wildfire E Plus స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

  • 60Hz రిఫ్రెష్ రేట్‌ కలిగిన 6.52 అంగుళాల HD+ డిస్‌ప్లే
  • 2GB RAM, 32GB స్టోరేజ్ సామర్థ్యం
  • క్వాడ్-కోర్ మీడియాటెక్ MT6739 ప్రాసెసర్
  • వెనకవైపు 13MP+ 5MP డ్యూయల్ కెమెరా సెటప్
  • ముందు భాగంలో 5MP సెల్ఫీ షూటర్‌
  • ఆండ్రాయిడ్ 12 GO ఆపరేటింగ్ సిస్టమ్
  • 5150 mAh బ్యాటరీ సామర్థ్యం, 10W ఫాస్ట్ ఛార్జర్

అదనంగా, డ్యూయల్ సిమ్, 4G VoLTE, Wi-Fi 802.11 b/g/n, బ్లూటూత్ 4.2, GPS, USB-C పోర్ట్, 3.5mm ఆడియో జాక్, సైడ్-ఫేసింగ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ , ఫేస్ అన్‌లాక్‌ వంటి ఇతర ఫీచర్లు ఉన్నాయి.

ప్రస్తుతం రష్యాలో ఈ HTC Wildfire E Plus ఫోన్ అందుబాటులోకి వచ్చింది. అక్కడ దీని ధర RUB 7,990. అంటే భారతీయ కరెన్సీలో సుమారుగా రూ. 10,600/-. ఈ ఫోన్ త్వరలో ఇతర మార్కెట్లలోనూ విడుదల కానుంది. భారతదేశంలో విడుదలైతే, ఈ ఫోన్ రూ. 10 వేల కంటే తక్కువ ధరకే లభించనుంది.

కంపెనీ నుంచి ఇంతకు ముందు మెటావర్స్ సపోర్ట్ చేసే HTC Desire 22 Pro స్మార్ట్‌ఫోన్‌, అలాగే HTC A101 టాబ్లెట్ గ్లోబల్ మార్కెట్లో విడుదలయ్యాయి.

WhatsApp channel

సంబంధిత కథనం