Umidigi Bison 2 | రగ్గ్‌డ్ డిజైన్‌తో యూమిడిజీ బ్రాండ్ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌-umidigi bison 2 rugged smartphone series launched know price details ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Umidigi Bison 2 | రగ్గ్‌డ్ డిజైన్‌తో యూమిడిజీ బ్రాండ్ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌

Umidigi Bison 2 | రగ్గ్‌డ్ డిజైన్‌తో యూమిడిజీ బ్రాండ్ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌

HT Telugu Desk HT Telugu
Jun 19, 2022 02:45 PM IST

కఠినమైన స్మార్ట్‌ఫోన్‌ మోడళ్ల కోసం చూస్తున్నారా? అయితే ఇవిగో యూమిడిజీ నుంచి రెండు స్మార్ట్‌ఫోన్‌లు విడుదలయ్యాయి. ఇవి దృఢంగా ఉంటాయి. వీటి ధర, ఇతర వివరాల కోసం ఈ స్టోరీ చదవండి..

Umidigi Bison 2
Umidigi Bison 2

చైనాకు చెందిన మరో మొబైల్ తయారీదారు 'యూమిడిజీ' ఇప్పుడు తమ బ్రాండ్ నుంచి 'బైసన్' సిరీస్‌ను ఆవిష్కరించింది. ఇందులో భాగంగా కొత్తగా రెండు స్మార్ట్‌ఫోన్‌లను గ్లోబల్ మార్కెట్లో విడుదల చేసింది. 

Umidigi Bison 2, Umidigi Bison 2 Pro అనే పేర్లతో విడుదలైన స్మార్ట్‌ఫోన్‌లు ఇప్పుడు AliExpress అనే వెబ్‌సైట్‌ ద్వారా వినియోగదారులు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. యూమిడిజీ స్మార్ట్‌ఫోన్‌లు కఠినమైన కవచంతో వస్తాయి. ఇలాంటి ఫోన్‌లను తయారు చేయటం ఈ కంపెనీ ప్రత్యేకత. తాజాగా విడుదలైన బైసన్ సిరీస్ కూడా పేరుకు తగినట్లుగా బలంగా కనిపిస్తున్నాయి. అలాగే .Umidigi స్మార్ట్‌ఫోన్‌లు కేవలం బ్లాక్ కలర్ షేడ్లలో మాత్రమే అందుబాటులో ఉంటాయి.

ఇంకా ఈ ఫోన్లలోని ఇతర ఫీచర్లు, స్పెసిఫికేషలు ఎలా ఉన్నాయో చూడండి.

Umidigi Bison 2 స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

  • 6.5 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే
  • 6 GB ర్యామ్,  128 GB ఇంటర్నల్ స్టోరేజ్
  • ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో P90 ప్రాసెసర్
  • వెనుకవైపు 48 MP+ 16 MP + 5MP  ట్రిపుల్ కామ్ సెటప్‌, ముందువైపు 24 MP సెల్ఫీ షూటర్
  • ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
  • 6150 mAh బ్యాటరీ సామర్థ్యం
  • ధర, సుమారు రూ. 25,000/-

Umidigi Bison 2 Pro స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

  • 6.5 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే
  • 8 GB ర్యామ్, 256 GB ఇంటర్నల్ స్టోరేజ్
  • ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో P90 ప్రాసెసర్
  • వెనుకవైపు 48 MP+ 16 MP + 5MP ట్రిపుల్ కామ్ సెటప్‌, ముందువైపు 24 MP సెల్ఫీ షూటర్
  • ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
  • 6150 mAh బ్యాటరీ సామర్థ్యం
  • ధర, సుమారు రూ. 30,000/-

ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌ల మధ్య తేడాను గమనిస్తే రెండింటిలో స్పెసిఫికేషన్లు ఒకేవిధంగా ఉన్నాయి. అయితే ప్రో మోడల్‌లో మాత్రం ర్యామ్, స్టోరేజ్ ఎక్కువ ఉంటుంది. రెండు స్మార్ట్‌ఫోన్‌ల వెనుక డిజైన్ కూడా కొద్దిగా భిన్నంగా ఉంటుంది. ప్రో మోడల్ మెటాలిక్ ఫినిషింగ్‌తో బ్యాక్ ప్యానెల్ మధ్యలో బ్రాండింగ్‌ను పొందగా.. బైసన్ 2లో వెనుక ప్యానెల్‌కు దిగువ ఎడమవైపున బ్రాండింగ్‌ ఇచ్చారు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్