Vertu Metavertu । ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ. 34 లక్షలు.. ప్రత్యేకతలు చూస్తే కళ్లు బయర్లు!-vertu metavertu the most expensive smartphone that made with rare himalayan alligator skin ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Vertu Metavertu The Most Expensive Smartphone That Made With Rare Himalayan Alligator Skin

Vertu Metavertu । ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ. 34 లక్షలు.. ప్రత్యేకతలు చూస్తే కళ్లు బయర్లు!

Manda Vikas HT Telugu
Oct 26, 2022 01:09 PM IST

లగ్జరీ మొబైల్ ఫోన్ బ్రాండ్ Vertu నుంచి Vertu Metavertu అనే స్మార్ట్‌ఫోన్‌ విడుదలైంది. దీని ధర, రూ. 34 లక్షల వరకు ఉంది. ప్రపంచంలోనే ఎంతో ఖరీదైన ఫోన్లో కొన్ని అరుదైన అంశాలు, ప్రత్యేకతలు ఉన్నాయి. అవేంటో చూడండి.

Vertu Metavertu
Vertu Metavertu

UKకు చెందిన లగ్జరీ మొబైల్ ఫోన్ బ్రాండ్ Vertu చాలా కాలం తర్వాత Vertu Metavertu అనే కొత్త స్మార్ట్‌ఫోన్‌తో తిరిగి వచ్చింది. లండన్‌లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర 41,000 డాలర్లుగా ఉంది. అంటే భారతీయ కరెన్సీలో సుమారు రూ. 34 లక్షలు.

ఈ వెర్టు మెటావెర్ట్ స్మార్ట్‌ఫోన్‌ ఫ్లాగ్‌షిప్-గ్రేడ్ ఫీచర్‌లను కలిగి ఉంది. ఇందులో భాగంగా ఫుల్ HD AMOLED డిస్‌ప్లే, శక్తివంతమైన Qualcomm స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్, 18GB RAM, 1TB ఇంటర్నల్ స్టోరేజ్ అలాగే 10T IPFS స్టోరేజ్ ఉన్నాయి.

అంతేకాదు ఈ స్మార్ట్‌ఫోన్‌ A5 ప్రైవసీ చిప్‌ను కలిగి ఉంది. హై-ఎండ్ ఆన్-చైన్ లైఫ్‌స్టైల్‌ను ప్రతిబింబించాలని కోరుకునే కొంతమంది క్రిప్టో మిలియనీర్ల కోసం పటిష్టమైన బ్యాంకింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఒక క్లిక్‌తో web2 నుండి web3కి మారవచ్చు.

ఈ స్మార్ట్‌ఫోన్ నుండి ఏ ఫోటో తీసినా, అవి భద్రంగా దాగి ఉంటాయి. Metavertu దాని స్వంత 'Value' వాలెట్ అలాగే Vtalk యాప్ లను ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ IM సర్వీస్‌తో కూడా సమీకృతం చేసింది. దీనితో యూజర్ కు సంబంధించిన ఎలాంటి రహస్యాలకైన సురక్షితంగా ఉంచుతుంది.

Vertu Metavertu స్మార్ట్‌ఫోన్‌కు రూ. 34 లక్షల ధర అవసరమా?

మరి ఇంతదానికే ఈ స్మార్ట్‌ఫోన్‌కు రూ. 34 లక్షల ధరను చెల్లించాలా అంటే? అసలు విషయం మరొకటి కూడా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను హిమాలయ ఎలిగేటర్ చర్మం, జంతు చర్మం, బంగారం, వజ్రాలు సహా ఇతర అరుదైన రాళ్లను పొదిగించి డిజైన్ చేశారు. ఉన్నాయి. ఈ ఫోన్‌కు ఉపయోగించిన మెటీరియల్ ఆధారంగా ధరలు మారుతాయి. సఫైర్ గ్లాస్, సిరామిక్ బ్యాక్ కవర్, ఎలిగేటర్ లెదర్, కాఫ్ లెదర్‌తో వంటి నాలుగు మెటీరియల్‌లలో బ్యాక్ కవర్ ఎంచుకోవచ్చు. అలాగే కార్బన్ ఫైబర్ బ్లాక్, ఐరన్ బ్లాక్, క్రీమీ వైట్, ఫ్లేమ్ రెడ్, హిమాలయా 18కె గోల్డ్ కలర్ ఆప్షన్లు ఉన్నాయి.

ఇక, Vertu Metavertu లో అన్ని ఫ్లాగ్‌షిప్-స్మార్ట్‌ఫోన్‌లలో ఉన్నట్లుగానే ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉంటాయి. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

Vertu Metavertu స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

  • 6.6-అంగుళాల AMOLED వాటర్‌ఫాల్ డిస్‌ప్లే
  • క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 చిప్‌సెట్‌
  • 18GB RAM, 1TB ఇంటర్నల్ స్టోరేజ్
  • వెనకవైపు 64MP హ్యుమానిటీ కెమెరా (సోనీ IMX787 సెన్సార్, OIS) 50MP వైడ్-యాంగిల్ కెమెరా + 8MP పెరిస్కోప్ కెమెరా (OIS)
  • ముందువైపు 16 MP సెల్ఫీ షూటర్
  • 4600mAh బ్యాటరీ, 55W ఛార్జర్‌

అదనంగా Vshot బ్లాక్‌చెయిన్ కెమెరా, Vbox 10T స్టోరేజ్ స్పేస్, Vtalk ఎన్‌క్రిప్టెడ్ IM, వాల్యూ Web3 వాలెట్, వోస్ లైట్‌నోడ్, DAPP స్టోర్, వెంచర్ బ్రౌజర్, NFT PASS, DID డిజిటల్ ఐడెంటిటీ, Metaspace ఎన్‌క్రిప్టెడ్ స్పేస్, A5 ఇండిపెండెంట్ సెక్యూర్ మొదలైన భద్రతా ఫీచర్లు ఉన్నాయి.

WhatsApp channel

సంబంధిత కథనం