Samsung Wallet । కేవలం పేమెంట్స్ కొరకు మాత్రమే కాదు.. అంతకు మించి!-samsung wallet a one stop solution for all your digital needs ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Samsung Wallet । కేవలం పేమెంట్స్ కొరకు మాత్రమే కాదు.. అంతకు మించి!

Samsung Wallet । కేవలం పేమెంట్స్ కొరకు మాత్రమే కాదు.. అంతకు మించి!

HT Telugu Desk HT Telugu
Jun 16, 2022 09:15 PM IST

శాంసంగ్ కంపెనీ సరికొత్తగా Samsung Wallet ను ఆవిష్కరించింది. ఈ ఒక్క ప్లాట్ ఫారమ్ ద్వారా యూజర్లకు బహు విధాల ప్రయోజనాలు లభిస్తాయి. దీని గురించి మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి..

Samsung Wallet
Samsung Wallet

దక్షిణ కొరియాకు చెందిన టెక్ దిగ్గజం శాంసంగ్ ఇప్పుడు సరికొత్త ప్లాట్‌ఫారమ్ Samsung Walletని ఆవిష్కరించింది. శాంసంగ్ నుంచి ఇదివరకే ఉన్న నగదు చెల్లింపుల యాప్ Samsung Payని అలాగే కీలకమైన డిజిటల్ పాస్‌వర్డుల మేనేజ్మెంట్, క్రిప్టోకరెన్సీ వంటి డిజిటల్ ఆస్తులకు మెరుగైన భద్రత కల్పించే Samsung Pass యాప్‌లను ఏకీకృతం చేస్తూ Samsung Walletని కంపెనీ తీసుకువచ్చింది.

ఈ శాంసగ్ వాలెట్‌ను ఉపయోగించి వినియోగదారులు తమ డిజిటల్ ఆస్తులకు సంబంధించిన కీలక సమాచారాన్ని, బ్యాంకింగ్ పాస్‌వర్డులను, ఇతర సెన్సిటివ్ డేటాను పొందుపరుచుకోవచ్చు. అలాగే నగదు చెల్లింపులు చేయవచ్చు. వినియోగదారులు తమ డేటాను అత్యంత భద్రంగా ఉంచుకోవటానికి డిఫెన్స్-గ్రేడ్ సెక్యూరిటీతో, పటిష్టమైన ఎన్‌క్రిప్షన్‌తో శాంసంగ్ కంపెనీ ఈ ప్లాట్‌ఫారమ్‌ను రూపొందించింది. 

Samsung Wallet ద్వారా లభించే మరిన్ని ఉపయోగాలు

వినియోగదారుల వేలిముద్రలు తస్కరించకుండా, డిజిటల్ హ్యాకింగ్ బారినపడకుండా కేవలం నిజమైన వినియోగదారులు మాత్రమే యాక్సెస్ చేయగలిగేలా ఇందులో కాంబినేషన్ సెక్యూరిటీ ఫీచర్లు ఉంటాయి.

ఈ Samsung Wallet వినియోగదారులకు తమ దగ్గర ఉండే అన్ని రకాల పేమెంట్ కార్డులు, లాయల్టీ రీడీమ్ కార్డులు, మెంబర్‌షిప్ కార్డ్‌లు అన్నింటికీ సింగిల్-స్వైప్ యాక్సెస్‌ను అందిస్తుంది.

BMW 1-8 సిరీస్, X5-X7, అలాగే iX మోడల్‌లతో పాటు హ్యుందాయ్ పాలిసేడ్, జెనెసిస్ GV60, G90తో సహా ఎంపిక చేసిన కొన్ని కార్ల మోడళ్లలను ఆపరేట్ చేయడానికి కూడా ఈ Samsung Wallet సపోర్ట్ చేస్తుంది.

యూజర్లు తమ డిజిటల్ పోర్ట్‌ఫోలియోను ట్రాక్ చేయడానికి, క్రిప్టోకరెన్సీ పెట్టుబడులను ట్రాక్ చేయడానికి Samsung Wallet. అలాగే డ్రైవర్ లైసెన్స్‌లు, ఇతర IDలను కూడా సెక్యూర్ గా స్టోర్ చేసే ఫీచర్లను కూడా శాంసంగ్ తీసుకొస్తుంది.

Samsung Wallet ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, యునైటెడ్ కింగ్‌డమ్‌లోని గెలాక్సీ వినియోగదారులకు అందుబాటులో ఉంది. త్వరలోని మిగతా ప్రాంతాల యూజర్లకు అందుబాటులోకి వస్తుంది. ఈ వాలెట్ కోసం యూజర్లు Google Play Store ద్వారా యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

WhatsApp channel

సంబంధిత కథనం