Solana | బ్లాక్‌చెయిన్ ప్లాట్‌ఫారమ్ సొలానా నుంచి ప్రత్యేకమైన Saga స్మార్ట్‌ఫోన్‌-blockchain platform solana s saga mobile highlights ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Solana | బ్లాక్‌చెయిన్ ప్లాట్‌ఫారమ్ సొలానా నుంచి ప్రత్యేకమైన Saga స్మార్ట్‌ఫోన్‌

Solana | బ్లాక్‌చెయిన్ ప్లాట్‌ఫారమ్ సొలానా నుంచి ప్రత్యేకమైన Saga స్మార్ట్‌ఫోన్‌

Manda Vikas HT Telugu
Jun 28, 2022 04:02 PM IST

క్రిప్టోకరెన్సీ, ఎన్‌ఎఫ్‌టి ట్రేడింగ్ కోసం అలాగే డిజిటల్ ఆస్తులకు పటిష్ట భద్రత కల్పించేందుకు సొలానా ల్యాబ్స్ ప్రత్యేకమైన 'సాగా' అనే మొబైల్ విడుదల చేసింది. ఈ ఫోన్ విశేషాలేమిటో తెలుసుకోండి..

Solana's Saga mobile
Solana's Saga mobile

బ్లాక్‌చెయిన్ ప్లాట్‌ఫారమ్ సొలానా ల్యాబ్స్ అనుబంధ సంస్థ అయిన సోలానా మొబైల్ ఇటీవల ఒక సరికొత్త డివైజ్ ఆవిష్కరణ చేసింది. స్మార్ట్‌ఫోన్‌లలో క్రిప్టోకరెన్సీ అలాగే నాన్-ఫంగబుల్ టోకెన్ (ఎన్‌ఎఫ్‌టి) ట్రేడింగ్‌ను మరింత సులభతరం చేసే విధంగా 'సాగా' (Solana Saga) అనే ఫ్లాగ్‌షిప్ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్‌ను విడుదల చేసింది.

ఈ ఫోన్ ఒక ప్రత్యేకమైన కార్యాచరణ, భద్రతపరంగా పటిష్టమైన ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ సాగా ఫోన్ ద్వారా web3లో లావాదేవీలు జరపడం అలాగే టోకెన్‌లు, NFTల వంటి డిజిటల్ ఆస్తులను మెయింటేన్ సులభం, సురక్షితం అని చెబుతున్నారు.

ఈ Saga ఫోన్ అనేది ప్రముఖ Android డెవలప్‌మెంట్ కంపెనీ OSOM భాగస్వామ్యం ద్వారా తయారు చేశారు. ఈ కంపెనీ Google, Apple, Intel కోసం కంప్యూటింగ్ హార్డ్‌వేర్‌ను రూపొందించడంలో అపారమైన అనుభవాన్ని కలిగి ఉంది.

Saga స్మార్ట్‌ఫోన్‌ 6.67 అంగుళాల OLED డిస్‌ప్లే, 12 GB RAM, 512 GB ఇంటర్నల్ స్టోరేజ్, స్నాప్ డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్ వంటి ఫ్లాగ్‌షిప్ స్పెసిఫికేషన్లను కలిగి ఉంది. అంతేకాకుండా ఈ హ్యాండ్‌సెట్‌లో డిజిటల్ ఆస్తుల పరిరక్షణ కోసం ప్రత్యేకమైన ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉంటాయి. ఈ ఫోన్‌లో ఇన్ బిల్ట్‌గా సీడ్ వాల్ట్, ప్రైవేట్ కీలు, సీడ్ ఫ్రేజెస్, ఇతర సున్నితమైన సమాచారాన్ని రహస్యంగా ఉంచే సెక్యూరిటీ లేయర్ ఉంటుంది. అయినప్పటికీ ఈ ఫోన్‌లో మిగతా అన్ని రకాల యాప్‌లను, మొబైల్ బ్రౌజర్‌ను యధావిధిగా ఉపయోగించవచ్చు.

Solana Saga స్మార్ట్‌ఫోన్‌ ధరను $1,000గా నిర్ణయించారు. భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 79,000/-. ఇప్పటికే కంపెనీ ముందస్తు ఆర్డర్‌లకు బుకింగ్ ప్రారంభించింది. ఇందుకోసం $100 రీఫండబుల్ డిపాజిట్ చేయాలని కోరుతోంది.

"ప్రపంచవ్యాప్తంగా దాదాపు 7 బిలియన్ల మంది ప్రజలు స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగిస్తున్నారు. ఇందులో 100 మిలియన్లకు పైగా ప్రజలు డిజిటల్ ఆస్తులను కలిగి ఉన్నారు. ఈ సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. web3లో లావాదేవీల ప్రమాణాలను తమ Saga పెంచుతుంది." అని సోలానా సహ వ్యవస్థాపకుడు అనాటోలీ యాకోవెంకో అన్నారు.

WhatsApp channel

సంబంధిత కథనం