HTC Desire 22 Pro । మెటావర్స్ ప్రపంచంలో విహరించండి.. అందుకోండి హెచ్‌టిసి ఫోన్‌!-experience metaverse with htc desire 22 pro know price details ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Htc Desire 22 Pro । మెటావర్స్ ప్రపంచంలో విహరించండి.. అందుకోండి హెచ్‌టిసి ఫోన్‌!

HTC Desire 22 Pro । మెటావర్స్ ప్రపంచంలో విహరించండి.. అందుకోండి హెచ్‌టిసి ఫోన్‌!

HT Telugu Desk HT Telugu
Jun 28, 2022 06:36 PM IST

టెక్ దిగ్గజం HTC మెటావర్స్ ఆధారిత మొబైల్ విడుదల చేసింది. ఈ ఫోన్ డస్ట్ రెసిస్టెన్స్, వాటర్ రెసిస్టెన్స్ అంతేకాదు క్రిప్టోకరెన్సీ లావాదేవీలు కూడా నిర్వహించవచ్చు. ధర కూడా తక్కువే.

HTC Desire 22 Pro
HTC Desire 22 Pro

ఇటీవల కాలంలో మెటావర్స్-ఫోకస్డ్ స్మార్ట్‌ఫోన్‌లు మంచి ప్రజాదరణ పొందుతున్నాయి. వినియోగదారులకు మెటావర్స్ అనుభూతిని అందించడానికి తైవాన్ టెక్ దిగ్గజం హెచ్‌టిసి ఒక సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. హెచ్‌టిసి డిజైర్ 22 ప్రో పేరుతో గ్లోబల్ మార్కెట్లోకి వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో అనేక మెటావర్స్-ఫోకస్డ్ ఫీచర్‌లను కలిగి ఉంది. అలాగే హెచ్‌టిసి వైవ్ ఫ్లో హెడ్‌సెట్‌తో జతగా ఈ ఫోన్ లభ్యమవుతుంది.

యూజర్లు మెటావర్స్‌ను సులభంగా యాక్సెస్ చేయడానికి HTC Desire 22 Pro ఫోన్‌లో ప్రత్యేకమైన VIVERSE యాప్‌ను రూపొందించింది. ఈ యాప్‌ను ఉపయోగించి మీరు 300-అంగుళాల పెద్ద స్క్రీన్‌ను మీ వైవ్ ఫ్లో హెడ్‌సెట్ నుంచి డిజైర్ 22 ప్రోకి ప్రసారం చేయవచ్చు. అలాగే వర్చువల్ VIVE అవతార్‌లను సృష్టించవచ్చు.

అంతేకాదు ఈ ఫోన్‌లో VIVE వాలెట్‌ని ఉపయోగించి NFT లావాదేవీలను సులభంగా నిర్వహించవచ్చు, ఇంకా క్రిప్టోకరెన్సీ సహా ఇతర డిజిటల్ ఆస్తులను భద్రంగా దాచుకోవచ్చని కంపెనీ పేర్కొంది.

హెచ్‌టిసి డిజైర్ 22 ప్రోలో మిగతా ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయి, ధర ఎంత? తదితర వివరాలను ఇక్కడ పరిశీలించండి.

HTC Desire 22 Pro స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

  • 120Hz రిఫ్రెష్ రేట్‌ కలిగిన 6.6 అంగుళాల ఫుల్ HD+ LCD డిస్‌ప్లే
  • 8 GB RAM, 128 GB స్టోరేజ్ సామర్థ్యం
  • స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్
  • వెనకవైపు 64MP + 13MP+ 5MP ట్రిపుల్ కెమెరా సెటప్; ముందు భాగంలో 32 MP సెల్ఫీ షూటర్‌
  • ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
  • 4520 mAh బ్యాటరీ సామర్థ్యం, 15W ఫాస్ట్ ఛార్జర్

ఇంకా ఈ ఫోన్ డస్ట్ రెసిస్టెన్స్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP67 రేటింగ్స్ కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా HTC Desire 22 Proలో 55G, డ్యూయల్-సిమ్‌ స్లాట్, Wi-Fi 5, బ్లూటూత్ 5.1, GPS, NFC, టైప్-సి పోర్ట్ ఉన్నాయి.

గ్లోబల్ మార్కెట్‌లో HTC Desire 22 Pro స్మార్ట్‌ఫోన్ ధర $404గా ఉంది. భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 32 వేలు. బుకింగ్స్ ప్రారంభమైనాయి. సెప్టెంబర్ నెలలో ఇండియన్ మార్కెట్లోనూ ఈ ఫోన్ విడుదలయ్యే అవకాశం ఉందని ప్రచారంలో ఉంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్