Honor pad X9 : హానర్ ప్యాడ్ ఎక్స్9 బుకింగ్స్ షురూ.. ఈ ట్యాబ్లెట్‌ను కొనొచ్చా?
30 July 2023, 11:42 IST
- Honor pad X9 : హానర్ ప్యాడ్ ఎక్స్9ను అమెజాన్‌లో ప్రీ బుక్ చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ డివైజ్ ఫీచర్స్, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
హానర్ ప్యాడ్ ఎక్స్9 బుకింగ్స్ షురూ..
Honor pad X9 : ప్యాడ్ ఎక్స్9 పేరుతో సరికొత్త ట్యాబ్లెట్‌ను ఇండియాలో లాంచ్ చేస్తున్నట్టు ఇటీవలే ప్రకటించింది హానర్ సంస్థ. ఇక ఇప్పుడు.. ఈ మోడల్‌కు సంబంధించిన ప్రీ ఆర్డర్స్ మొదల్యాయి. ఈ నేపథ్యంలో ఈ గ్యాడ్జెట్ ఫీచర్స్ వివరాలు ఇక్కడ తెలుసుకుందాము..
ఈ ట్యాబ్‌లో ఏముంది..?
హానర్ ప్యాడ్ ఎక్స్9కు స్లీక్ ప్రొఫైల్ లభిస్తోంది. దీని థిక్నెస్ 6.9ఎంఎం, బరువు 495గ్రాములు. ఇందులో మెటల్ యూనిబాడీ డిజైన్ ఉంది. స్క్రీన్ టు బాడీ రేషియో 86శాతంగా ఉంది. ఇక ఈ ట్యాబ్‌లో 11.5 ఇంచ్ 2కే ఐపీఎస్- ఎల్సీడీ స్క్రీన్ లభిస్తోంది. 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 400 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వస్తోంది.
Honor pad X9 price : ఈ డివైజ్‌లో 6 స్పీకర్లు, హై- రిస్ ఆడియో, హానర్‌కు చెందిన లిసెన్ ఆడియో అల్గారిథం వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇక ఇందులో 5ఎంపీ రేర్ కెమెరా, 5ఎంపీ ఫ్రెంట్ కెమెరా లభిస్తోంది.
మరోవైపు ఈ హానర్ ప్యాడ్ ఎక్స్9లో స్నాప్‌డ్రాగన్ 685 ప్రాసెసర్ వస్తోంది. 4జీబీ ర్యామ్- 128జీబీ స్టోరేజ్‌తో మార్కెట్లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. 3జీబీ వర్చ్యువల్ ర్యామ్ కూడా లభిస్తుందని సమాచారం. ఆండ్రాయిడ్ 13 ఆధారిత మ్యాజిక్ యూఐ 7.1 సాఫ్ట్వేర్ ఇందులో ఉండనుంది. 7,250 ఎంఏహెచ్ బ్యాటరీ దీని సొంతం. 22.5వాట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తోంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఈ ట్యాబ్‌ను 13 గంటల వరకు వాడుకోవచ్చని సంస్థ చెబుతోంది
హానర్ ప్యాడ్ ఎక్స్9 ధర ఎంత..?
Honor pad X9 Amazon : ఈ గ్యాడ్జెట్ ధర రూ. 14,499. అమెజాన్‌లో ప్రీ బుక్ చేసుకోవచ్చు. ఆగస్టు 2న ఈ మోడల్ లైవ్ అవుతుంది. బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్గా దీనిని మంచి డిమాండ్ లభిస్తుందని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
హానర్ 90 లాంచ్ ఎప్పుడు..?
Honor 90 price : హానర్ 90ని ఇండియాలో లాంచ్ చేసేందుకు సంస్థ ఏర్పాట్లు చేసుకుంటోందని తెలుస్తోంది. ఈ మోడల్ సెప్టెంబర్ మధ్యలో మార్కెట్‌ను హిట్ చేస్తుందని వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో దీని ధర రూ. 50వేలలోపు ఉంటుందని సమాచారం. ఇదే నిజమైతే.. ఈ సెగ్మెంట్లో ఉన్న వన్‌ప్లస్ 11ఆర్, ఒప్పో రెనో 10 ప్రో, నథింగ్ ఫోన్ 2 వంటి మొబైల్స్‌కు ఇది గట్టిపోటీనివ్వడం ఖాయం అని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.