తెలుగు న్యూస్  /  బిజినెస్  /  New 4g Tablet: రూ.13వేలలోపు ధరలో 4జీ కనెక్టివిటీతో నయా ట్యాబ్ లాంచ్

New 4G Tablet: రూ.13వేలలోపు ధరలో 4జీ కనెక్టివిటీతో నయా ట్యాబ్ లాంచ్

04 March 2023, 6:26 IST

google News
    • Itel Pad One Tablet: ఐటెల్ ప్యాడ్ వన్ ట్యాబ్లెట్ వచ్చేసింది. తక్కువ ధరలో 4జీ కనెక్టివిటీ ఫీచర్‌, ఎల్‍సీడీ డిస్‍ప్లేతో అడుగుపెట్టింది. పూర్తి వివరాలివే..
New 4G Tablet: రూ.13వేలలోపు ధరలో 4జీ కనెక్టివిటీతో నయా ట్యాబ్ లాంచ్ (Photo: Itel)
New 4G Tablet: రూ.13వేలలోపు ధరలో 4జీ కనెక్టివిటీతో నయా ట్యాబ్ లాంచ్ (Photo: Itel)

New 4G Tablet: రూ.13వేలలోపు ధరలో 4జీ కనెక్టివిటీతో నయా ట్యాబ్ లాంచ్ (Photo: Itel)

Itel Pad One Tablet: ఐటెల్ (Itel) బ్రాండ్ తన తొలి ట్యాబ్‍ను భారత మార్కెట్‍లో లాంచ్ చేసింది. ఐటెల్ ప్యాడ్ వన్ (Itel Pad One ) పేరుతో దీన్ని తీసుకొచ్చింది. ఇప్పటి వరకు బడ్జెట్ రేంజ్‍లో మొబైళ్లను తీసుకొచ్చిన ఐటెల్.. ఇప్పుడు ట్యాబ్‍ను విడుదల చేసింది. 4జీ కనెక్టివిటీ సపోర్టుతో ఐటెల్ ప్యాడ్ వన్ వచ్చింది. పెద్ద సైజ్ ఎస్‍డీసీ డిస్‍ప్లే, మెటల్ బాడీని ఈ ట్యాబ్ కలిగి ఉంది. పూర్తి వివరాలివే..

ఐటెల్ ప్యాడ్ వన్ ధర, సేల్

Itel Pad One Price: ఐటెల్ ప్యాడ్ వన్ ధర రూ.12,999గా ఉంది. దీంట్లో 4జీబీ ర్యామ్ + 128జీబీ ఇంటర్నల్ స్టోరేజీ ఉంటుంది. ఆన్‍లైన్, ఆఫ్‍లైన్ రిటైల్ స్టోర్లలో ఈ ట్యాబ్ అతి త్వరలో అమ్మకానికి అందుబాటులోకి రానుంది. డీప్ గ్రే, లైట్ బ్లూ కలర్ ఆప్షన్‍లలో లభ్యమవుతోంది.

ఐటెల్ ప్యాడ్ వన్ స్పెసిఫికేషన్లు

Itel Pad One Specifications: 10.1 ఇంచుల హెచ్‍డీ+ ఐపీఎస్ ఎల్‍సీడీ డిస్‍ప్లేతో ఐటెల్ ప్యాడ్ వన్ వస్తోంది. డిస్‍ప్లే చుట్టూ అంచులు కాస్త ఎక్కువగా ఉంటాయి. అలాగే మెటల్ బాడీని ట్యాబ్ కలిగి ఉంది. ఈ ట్యాబ్ ఎడ్జ్‌లు ఫ్లాట్‍గా ఉంటాయి.

Itel Pad One: యునీఎస్‍ఓసీ ఎస్‍సీ9863ఏ1 (Unisoc SC9863A1) ప్రాససెర్ ఈ ఐటెల్ ప్యాడ్ వన్ ట్యాబ్‍లో ఉంటుంది. 4జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‍తో వస్తోంది. మొమరీ కార్డు ద్వారా 512 జీబీ వరకు స్టోరేజీ పొడిగించుకోవచ్చు. ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్ ఆపరేటింగ్ సిస్టమ్‍పై రన్ అవుతుంది.

Itel Pad One సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఐటెల్ ప్యాడ్ వన్.. 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో వస్తోంది. దీనికి 80 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూ ఉంటుంది. వెనుక 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఈ ట్యాబ్‍లో 6,000mAh బ్యాటరీ ఉంటుంది. స్టాండర్డ్ 10 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తుంది.

Itel Pad One: సింగిల్ సిమ్, 4జీ ఎల్‍టీఈ, వైపై, బ్లూటూత్, యూఎస్‍బీ టైప్-సీ పోర్ట్, 3.5mm హెడ్‍ఫోన్ జాక్ ఈ ట్యాబ్‍కు కనెక్టివిటీ ఆప్షన్లుగా ఉన్నాయి.

ఈ ఏడాదిలోనే స్మార్ట్ టీవీ విభాగంలోకి కూడా ఐటెల్ అడుగుపెట్టింది. ఎస్ సిరీస్‍లో 32 ఇంచులు, 43 ఇంచుల డిస్‍ప్లేతో మోడళ్లను తీసుకొచ్చింది. ఫ్రేమ్‍లెస్ డిజైన్, డాల్బీ ఆడియోను ఈ టీవీలు కలిగి ఉన్నాయి.

టాపిక్

తదుపరి వ్యాసం