తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Lenovo Tab P11 5g Launched : లెనోవో ట్యాబ్​ పీ11 5జీ లాంచ్​.. ధర ఎంతంటే!

Lenovo Tab P11 5G launched : లెనోవో ట్యాబ్​ పీ11 5జీ లాంచ్​.. ధర ఎంతంటే!

14 January 2023, 9:23 IST

    • Lenovo Tab P11 5G launched in India : లెనోవో ట్యాబ్​ పీ11 5జీ ఇండియాలో లాంచ్​ అయ్యింది. ఫీచర్స్​, ధర వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
లెనోవో ట్యాబ్​ పీ11 5జీ లాంచ్​.. ధర ఎంతంటే!
లెనోవో ట్యాబ్​ పీ11 5జీ లాంచ్​.. ధర ఎంతంటే! (Representative image)

లెనోవో ట్యాబ్​ పీ11 5జీ లాంచ్​.. ధర ఎంతంటే!

Lenovo Tab P11 5G launched in India : మరో 'ట్యాబ్​'తో ఇండియా మార్కెట్​లోకి వచ్చేసింది దిగ్గజ స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థ లెనోవో. కంపెనీ నుంచి వచ్చిన తొలి ప్రీమియం 5జీ ట్యాబ్లెట్​గా ఈ 'లెనోవో ట్యాబ్​ పీ11 5జీ' నిలవడం విశేషం. ఈ ట్యాబ్​కు సంబంధించిన ఫీచర్స్​, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

ట్రెండింగ్ వార్తలు

Stock Market News: శనివారమైనా రేపు స్టాక్ మార్కెట్ పని చేస్తుంది.. కారణం ఏంటంటే..?

Personal loan for business : వ్యాపారం కోసం పర్సనల్​ లోన్​ తీసుకుంటున్నాారా? తప్పు చేసినట్టే!

Stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్​.. ఈ రూ. 390 స్టాక్​ని ట్రాక్​ చేయండి- భారీ లాభాలు!

Mahindra XUV 3XO : గంటలో 50వేల బుకింగ్స్​.. ఇదీ మహీంగ్స్​ ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ క్రేజ్​!

లెనోవో ట్యాబ్​ పీ11 5జీ ఫీచర్స్​..

ఈ లెనోవో ట్యాబ్​ పీ11 5జీలో క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్​ 750జీ ఎస్​ఓసీ ఉంటుంది. ఇందులో ఆడ్రేనో 619 జీపీయూ ఉంది. 11- ఇంచ్​ 2కే ఐపీఎస్​ టచ్​స్క్రీన్​ దీని సొంతం. బ్రైట్​నెస్​ 400 నిట్స్​గా ఉంది. లెనోవో ప్రకారం.. ఈ ట్యాబ్​లో 7,700ఎంఏహెచ్​ బ్యాటరీ ఉంది. ఫలితంగా ఒక్కసారి ఛార్జ్​ చేస్తే.. 12 గంటల నాన్​స్టాప్​ వీడియో స్ట్రీమింగ్​ చేసుకోవచ్చు! ట్యాబ్​ను మూడు గంటల్లో పూర్తిగా ఛార్జ్​ చేయవచ్చు.

Lenovo Tab P11 5G features :ఈ ట్యాబ్లెట్​లో 8ఎంపీ ఫ్రెంట్​ ఫేసింగ్​ కెమెరాతో పాటు 12ఎంపీ రేర్​ కెమెరా కూడా ఉంది. 4 జేబీఎల్​ స్పీకర్లు ఇందులో వస్తున్నాయి.

ఇండియాలో తొలి ట్యాబ్​ను లాంచ్​ చేసేందుకు సిద్ధమవుతోంది వన్​ప్లస్​. ఫీచర్స్​తో పాటు పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఈ లెనోవో ట్యాబ్​ పీ11 5జీలో డాల్బీ విజన్​ సపోర్ట్​ ఉండటం మరో ప్రత్యేక విషయం. ఇందులో 8జీబీ ఎల్​పీడీడీఆర్​4ఎక్స్​ ర్యామ్​, 256జీబీ యూఎఫ్​ఎస్​ 2.1 స్టోరేజ్​ ఉంటుంది. 1టీబీ వరకు మైక్రోఎస్​డీ కార్డ్​ను ఉపయోగించుకునే ఆప్షన్​ కూడా ఇచ్చింది లెనోవో.

Lenovo Tab P11 5G specifications list : ఈ లెనోవో ట్యాబ్​ పీ11 5జీకు డస్ట్​- వాటర్​ రెసిస్టెన్స్​ ఉంది. దీని మెజర్​మెంట్స్​ 258.4 X 7.9 X 163ఎంఎం. ఈ ట్యాబ్​ బరువు 520 గ్రాములు. వైఫై, బ్లూటూత్​ 5.1 వయర్​లెస్​ కనెక్టివిటీ ఉన్నాయి. సబ్​ 6జీహెచ్​జెడ్​ 5జీ నెట్​వర్క్​, వాయిస్​ కాలింగ్​ సపోర్ట్​ కూడా ఉంటుంది.

ఈ ట్యాబ్లెట్​.. సింగిల్​ స్టార్మ్​ గ్రే కలర్​ ఆప్షన్​లో అందుబాటులో ఉంది.

లెనోవో ట్యాబ్​ పీ11 5జీ ధర..

Lenovo Tab P11 5G price in India : ఇండియా మార్కెట్​లో లెనోవో ట్యాబ్​ పీ11 5జీ 128జీబీ స్టోరేజ్​ వేరియంట్​ ధర రూ. 29,999గా ఉంది. ఇక 256జీబీ వేరియంట్​ ధర రూ. 34,999గా ఉంది. ఈ ట్యాబ్​ అమెజాన్​లో అందుబాటులో ఉంది.

టాపిక్

తదుపరి వ్యాసం