OnePlus: ఇండియాలో తొలి ట్యాబ్‍ను లాంచ్ చేసేందుకు వన్‍ప్లస్ సిద్ధం! బడ్జెట్ రేంజ్‍లోనే..
OnePlus Tablet: ఇండియా త్వరలో ట్యాబ్లెట్‌ను లాంచ్ చేసేందుకు వన్‍ప్లస్ రెడీ అవుతోంది. ఇప్పటికే ప్రైవేట్ టెస్టింగ్‍ను కూడా ప్రారంభించిందని సమాచారం బయటికి వచ్చింది. ఈ ట్యాబ్ ధర ఎలా ఉండొచ్చంటే..
OnePlus Tablet: స్మార్ట్‌ఫోన్‍లకు వన్‍ప్లస్ బ్రాండ్ ఇప్పటికే పాపులర్ అయింది. ఇప్పుడు ట్యాబ్లెట్స్ (Tab) విభాగంలోనూ అడుగుపెట్టేందుకు ఆ కంపెనీ సిద్ధమైంది. ఈ ఏడాది ట్యాబ్‍ను విడుదల చేయనుంది వన్‍ప్లస్. వన్‍ప్లస్ ప్యాడ్ పేరుతో ఇది లాంచ్ అవుతుందని రిపోర్టులు వస్తున్నాయి. ఇదే జరిగితే వన్‍ప్లస్ నుంచి భారత్‍లో అందుబాటులోకి రానున్న తొలి ట్యాబ్ ఇదే కానుంది. కాగా, వన్‍ప్లస్ ట్యాబ్.. ప్రైవేట్ టెస్టింగ్ ఇండియాలో మొదలైనట్టు తాజాగా సమాచారం బయటికి వచ్చింది. ఏరియస్ (Aries) కోడ్‍నేమ్ పేరుతో ఈ ట్యాబ్ టెస్టింగ్ జరుగుతోందని తెలుస్తోంది. మరిన్ని వివరాలు కూడా బయటికి వచ్చాయి. వన్‍ప్లస్ ట్యాబ్ వివరాలివే..
OnePlus Tablet: త్వరలో వన్‍ప్లస్ ట్యాబ్ లాంచ్
ఈ ఏడాది మధ్యలో వన్‍ప్లస్ ట్యాబ్లెట్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. వన్‍ప్లస్ 11 ఆర్ మొబైల్‍తో పాటు వన్‍ప్లస్ ఈ ట్యాబ్ కూడా విడుదవుతుందని సమాచారం. ఈ ట్యాబ్ పేరు వన్‍ప్లస్ ప్యాడ్ లేదా వన్‍ప్లస్ ట్యాబ్‍గా ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికైతే ఏరియస్ కోడ్ నేమ్‍తో టెస్ట్ చేస్తోంది ఆ సంస్థ.
OnePlus Tablet: బడ్జెట్ రేంజ్‍లోనే..
ఇండియాలో తన తొలి ట్యాబ్‍ను బడ్జెట్ రేంజ్‍లో లాంచ్ చేయాలని వన్‍ప్లస్ ప్లాన్ చేసుకుంటోంది. ఈ ట్యాబ్ ధర రూ.20వేల రేంజ్‍లోనే ఉంటుందని ఓ రిపోర్ట్ బయటికి వచ్చింది. ఇదే జరిగితే ఒప్పో ప్యాడ్ ఎయిర్, రియల్‍మీ ప్యాడ్ ఎక్స్, షావోమీ ప్యాడ్ 5లకు ఇది పోటీగా నిలువనుంది. కాగా, పేరెంట్ కంపెనీకు ఒప్పోకు చెందిన ప్యాడ్ ఎక్స్ కు రీబ్రాండెడ్ వెర్షన్‍గా వన్‍ప్లస్ ఈ ట్యాబ్‍ను తీసుకొస్తుందన్న అంచనాలు కూడా ఉన్నాయి.
స్నాప్‍డ్రాగన్ 865 ప్రాసెసర్‌ను వన్‍ప్లస్ ట్యాబ్ కలిగి ఉంటుందని తెలుస్తోంది. 2K రెజల్యూషన్ ఉండే 10.36 ఇంచుల IPS LCD డిస్‍ప్లేతో రానుందని లీకులు వచ్చాయి. ఒప్పో ప్యాడ్ ఎయిర్ లాగా 7,100ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్టుతో వన్‍ప్లస్ ట్యాబ్ వస్తుందని తెలుస్తోంది. అయితే ట్యాబ్ గురించి వన్‍ప్లస్ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మార్చి నాటికి దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
వన్‍ప్లస్ ఇటీవల, వన్‍ప్లస్ 11 5జీ (OnePlus 11 5G) ఫ్లాగ్‍షిప్ ఫోన్‍ను చైనాలో లాంచ్ చేసింది. స్నాప్‍డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్, 2K రెజల్యూషన్ ఎల్‍టీపీవో 3.0 డిస్‍ప్లే, ఫ్లాగ్‍షిప్ కెమెరాతో ఈ మొబైల్ వస్తోంది. 100 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. ఈ ఫోన్ ఇండియాలో ఫిబ్రవరి 7వ తేదీన లాంచ్ అవుతుంది. దీంతో పాటు వన్‍ప్లస్ బడ్స్ ప్రో 2 టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్ కూడా విడుదలవుతాయి.
వన్‍ప్లస్ 11 5జీ ఫోన్ పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.