Lenovo K14 launch : లెనోవో నుంచి బడ్జెట్ ధరల్లో కే14, కే14 నోట్..!
Lenovo K14 and K14 Note Launch : బడ్జెట్లో మంచి స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలని చూస్తున్నారా? అయితే మీరు ఇంకొంత కాలం వెయిట్ చేయండి. లెనోవో కే సిరీస్‌లో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్స్ లాంచ్‌కు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.
Lenovo K14 and K14 Note Launch : లెనోవో నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్ త్వరలోనే లాంచ్ అవ్వనున్నట్టు తెలుస్తోంది. లెనోవో కే14, కే14 నోట్ స్మార్ట్‌ఫోన్స్.. సంస్థ నుంచి వచ్చే అత్యంత బడ్జెట్ ఫ్రెండ్లీ కే- సిరీస్ మొబైల్స్‌గా నిలుస్తాయని సమాచారం. ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్ కూడా.. గూగుల్ ప్లే కన్సోల్‌లో దర్శనమిచ్చాయి. ఫలితంగా లెనోవో కే14, కే14 నోట్‌పై స్మార్ట్‌ఫోన్ ప్రియుల్లో అంచనాలు పెరిగిపోయాయి.
లిస్టింగ్ వల్ల కొన్ని కీలక స్పెసిఫికేషన్స్ బయటపడ్డాయి. అయితే.. కే14, కే14 నోట్ లాంచ్‌పై లెనోవో సంస్థ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఇతర కే- సిరీస్ స్మార్ట్ఫోన్స్లాగానే.. ఈ లెనోవో కే14, లెనోవో కే14 నోట్ కూడా మోటోరోలా ఫోన్స్‌తో రీబ్యాడ్జ్ చేసినట్టే ఉంటాయని ఊహాగానాలు ఉన్నాయి.
కే14.. కే 14 నోట్..
Lenovo K14 specification : జీఎస్ఎంరేనా నివేదిక ప్రకారం.. లెనోవో కే14 నోట్లో ఫుల్ హెచ్డీ+ 24000X1080 పిక్సెల్ స్క్రీన్ ఉంటుంది. ఇక లెనోవో కే14లో హెచ్డీ+ 1200X720 పిక్సెల్ స్క్రీన్ ఉంటుంది. ఇక కే14 నోట్లో పంచ్ హోల్ సెల్ఫీ కెమెరా ఉంటుందని, స్క్రీన్కు చుట్టు ఎడ్జ్‌లు థిక్‌గా ఉంటాయని తెలుస్తోంది. ఇందులో 4జీబీ ర్యామ్ ఉండే అవకాశం ఉంది. ఎంటీ6769 చిప్సెట్ ఇందులో ఉండొచ్చు. గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఆండ్రాయిడ్ 11 ఉండనుంది. మోటో జీ31, మోటో జీ41తో ఈ స్మార్ట్‌ఫోన్‌కు చాలా పోలికలు ఉండే అవకాశం ఉంది.
Honor 80 GT : హానర్ నుంచి వస్తున్న 80జీటీ స్మార్ట్‌ఫోన్ వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
మరోవైపు.. లెనోవో కే14 స్క్రీన్కు వీ షేప్ నాచ్‌తో పాటు థిక్ స్క్రీన్ ఉండొచ్చు. ఇందులో 2జీ ర్యామ్ ఉండే అవకాశం ఉంది. ఆక్టా కోర్ యూనిఎస్ఓసీ టీ606 ఎస్ఓసీ ఇందులో ఉండనుందని సమాచారం. 2021 సెప్టెంబర్‌లో లాంచ్ అయిన మోటో ఈ20తో ఇది పోలి ఉంటుందని ఊహాగానాలు ఉన్నాయి.
Lenovo K14 launch date : ఈ కే14, కే14 నోట్ లాంచ్, ధరతో పాటు పూర్తి వివరాలను లెనోవా ప్రకటించాల్సి ఉంది.
సంబంధిత కథనం