Lenovo Tab P11 Pro 2nd Gen । వావ్ అనిపించే ఫీచర్లతో లెనొవొ నుంచి ప్రీమియం టాబ్లెట్ ఫోన్!-wow lenovo tab p11 pro 2nd gen tablet launched with coolest features ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Lenovo Tab P11 Pro 2nd Gen । వావ్ అనిపించే ఫీచర్లతో లెనొవొ నుంచి ప్రీమియం టాబ్లెట్ ఫోన్!

Lenovo Tab P11 Pro 2nd Gen । వావ్ అనిపించే ఫీచర్లతో లెనొవొ నుంచి ప్రీమియం టాబ్లెట్ ఫోన్!

HT Telugu Desk HT Telugu
Oct 13, 2022 10:47 PM IST

లెనొవొ నుంచి రెండవ తరం Lenovo Tab P11 Pro టాబ్లెట్ విడుదలైంది. దీనిలో ఆకట్టుకునే ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. వాటి వివరాలు, ధరల వివరాలు చూడండి.

<p>Lenovo Tab P11 Pro 2nd Gen</p>
Lenovo Tab P11 Pro 2nd Gen

చైనీస్ ఎలక్ట్రానిక్స్ తయారీదారు లెనొవొ భారత మార్కెట్లో తన టాబ్లెట్ లైనప్‌ను విస్తరించింది. తాజాగా తమ బ్రాండ్ నుంచి ప్రీమియం టాబ్లెట్ అయిన Lenovo Tab P11 Pro రెండవ తరం మోడల్‌ను విడుదల చేసింది. ఈ సరికొత్త టాబ్లెట్ పీసీలో ఎన్నో ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి. ఇది 2.5K రిజల్యూషన్ కలిగిన OLED స్క్రీన్‌ను కలిగి ఉంది. ఈ స్క్రీన్ డాల్బీ విజన్, HDR10+ ఫార్మాట్‌లకు సపోర్ట్ చేస్తుంది. కళ్లకు హాని కలగకుండా బ్లూ లైట్‌ని కూడా ఫిల్టర్ చేయగలదు.

సరికొత్త టాబ్లెట్ ప్రత్యేకమైన లెనొవొ ప్రెసిషన్ పెన్ 3తో వస్తుంది. ఇది పరికరానికి అయస్కాంతంగా అతుక్కుంటుది. ఈ Precision Pen 3లో బ్లూటూత్ ఉంటుంది, అందువలన టాబ్లెట్‌తో ఆటో-పెయిర్ కూడా అవుతుంది. సైడ్ బటన్‌ను ఉపయోగించి ఆన్-స్క్రీన్ నోట్స్, మ్యూజిక్, ఫోటోలు, రికార్డింగ్‌లను రిమోట్‌గా నియంత్రించవచ్చు. ఇంకా వైర్‌లెస్ ఛార్జింగ్, స్టోరేజ్ కోసం కూడా ఇది ఉపయోగపడుతుంది.

Lenovo Tab P11 Pro (2nd Gen) డ్యూయల్-టోన్ గ్లాస్ ఫినిషింగ్‌ డిజైన్‌ను కలిగి ఉంది. స్టార్మ్ గ్రే రంగులో లభిస్తుంది. 8GB RAM+256GB ఇంటర్నల్ స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లో అందుబాటులో ఉంటుంది, మైక్రో SD ద్వారా 1TB వరకు స్టోరేజ్ విస్తరించుకోవచ్చు. దీనిలోని బ్యాటరీ 14 గంటల లైఫ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఫీచర్ల జాబితాలో ఇంకా ఎలాంటి అంశాలు ఉన్నాయి? దీని ధర, లభ్యత మొదలైన వివరాలు ఈ కింద చూడండి.

Lenovo Tab P11 Pro - 2nd Gen టాబ్లెట్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

  • 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 11.2-అంగుళాల సినిమాటిక్ OLED డిస్‌ప్లే
  • 8GB RAM, 256 GB స్టోరేజ్ సామర్థ్యం, మైక్రో SD కార్డ్ స్లాట్
  • మీడియాటెక్ Kompanio 1300T ప్రాసెసర్
  • ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
  • వెనకవైపు 13MP కెమెరా, ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరా
  • JBL నుండి నాలుగు-స్పీకర్‌లు, Dolby Atmos సపోర్ట్
  • 8200 mAh బ్యాటరీ సామర్థ్యం, 10V/2.0A ఛార్జింగ్
  • ధర, రూ. 39,999/-

కనెక్టివిటీ కోసం బ్లూటూత్ 5.1, Wi-Fi 6 ఉన్నాయి. Lenovo Tab P11 Pro - 2nd Gen టాబ్లెట్ అక్టోబర్ 17 నుండి Lenovo అధికారిక వెబ్‌సైట్, Amazon India అలాగే Lenovo ఎక్స్‌క్లూజివ్ స్టోర్‌లలో కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటుంది.

Whats_app_banner

సంబంధిత కథనం