తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Lenovo K14 Launch : లెనోవో నుంచి బడ్జెట్​ ధరల్లో కే14, కే14 నోట్​..!

Lenovo K14 launch : లెనోవో నుంచి బడ్జెట్​ ధరల్లో కే14, కే14 నోట్​..!

03 December 2022, 10:31 IST

google News
    • Lenovo K14 and K14 Note Launch : బడ్జెట్​లో మంచి స్మార్ట్​ఫోన్​ను కొనుగోలు చేయాలని చూస్తున్నారా? అయితే మీరు ఇంకొంత కాలం వెయిట్​ చేయండి. లెనోవో కే సిరీస్​లో రెండు కొత్త స్మార్ట్​ఫోన్స్​ లాంచ్​కు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.
లెనోవో కే14 లాంచ్​.. త్వరలోనే!
లెనోవో కే14 లాంచ్​.. త్వరలోనే! (Representative image)

లెనోవో కే14 లాంచ్​.. త్వరలోనే!

Lenovo K14 and K14 Note Launch : లెనోవో నుంచి సరికొత్త స్మార్ట్​ఫోన్​ సిరీస్​ త్వరలోనే లాంచ్​ అవ్వనున్నట్టు తెలుస్తోంది. లెనోవో కే14, కే14 నోట్​ స్మార్ట్​ఫోన్స్​.. సంస్థ నుంచి వచ్చే అత్యంత బడ్జెట్​ ఫ్రెండ్లీ కే- సిరీస్​ మొబైల్స్​గా నిలుస్తాయని సమాచారం. ఈ రెండు స్మార్ట్​ఫోన్స్​ కూడా.. గూగుల్​ ప్లే కన్సోల్​లో దర్శనమిచ్చాయి. ఫలితంగా లెనోవో కే14, కే14 నోట్​పై స్మార్ట్​ఫోన్​ ప్రియుల్లో అంచనాలు పెరిగిపోయాయి.

లిస్టింగ్​ వల్ల కొన్ని కీలక స్పెసిఫికేషన్స్​ బయటపడ్డాయి. అయితే.. కే14, కే14 నోట్​ లాంచ్​పై లెనోవో సంస్థ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఇతర కే- సిరీస్​ స్మార్ట్​ఫోన్స్​లాగానే.. ఈ లెనోవో కే14, లెనోవో కే14 నోట్​ కూడా మోటోరోలా ఫోన్స్​తో రీబ్యాడ్జ్​ చేసినట్టే ఉంటాయని ఊహాగానాలు ఉన్నాయి.

కే14.. కే 14 నోట్​..

Lenovo K14 specification : జీఎస్​ఎంరేనా నివేదిక ప్రకారం.. లెనోవో కే14 నోట్​లో ఫుల్​ హెచ్​డీ+ 24000X1080 పిక్సెల్​ స్క్రీన్​ ఉంటుంది. ఇక లెనోవో కే14లో హెచ్​డీ+ 1200X720 పిక్సెల్​ స్క్రీన్​ ఉంటుంది. ఇక కే14 నోట్​లో పంచ్​ హోల్​ సెల్ఫీ కెమెరా ఉంటుందని, స్క్రీన్​కు చుట్టు ఎడ్జ్​లు థిక్​గా ఉంటాయని తెలుస్తోంది. ఇందులో 4జీబీ ర్యామ్​ ఉండే అవకాశం ఉంది. ఎంటీ6769 చిప్​సెట్​ ఇందులో ఉండొచ్చు. గూగుల్​ ప్లే కన్సోల్​ లిస్టింగ్​ ప్రకారం.. ఈ స్మార్ట్​ఫోన్​లో ఆండ్రాయిడ్​ 11 ఉండనుంది. మోటో జీ31, మోటో జీ41తో ఈ స్మార్ట్​ఫోన్​కు చాలా పోలికలు ఉండే అవకాశం ఉంది.

Honor 80 GT : హానర్​ నుంచి వస్తున్న 80జీటీ స్మార్ట్​ఫోన్​ వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

మరోవైపు.. లెనోవో కే14 స్క్రీన్​కు వీ షేప్​ నాచ్​తో పాటు థిక్​ స్క్రీన్​ ఉండొచ్చు. ఇందులో 2జీ ర్యామ్​ ఉండే అవకాశం ఉంది. ఆక్టా కోర్​ యూనిఎస్​ఓసీ టీ606 ఎస్​ఓసీ ఇందులో ఉండనుందని సమాచారం. 2021 సెప్టెంబర్​లో లాంచ్​ అయిన మోటో ఈ20తో ఇది పోలి ఉంటుందని ఊహాగానాలు ఉన్నాయి.

Lenovo K14 launch date : ఈ కే14, కే14 నోట్​ లాంచ్​, ధరతో పాటు పూర్తి వివరాలను లెనోవా ప్రకటించాల్సి ఉంది.

తదుపరి వ్యాసం