Amazon Great Freedom Festival sale 2023: ఆమెజాన్ ఇండియా ప్రతీ ఆగస్ట్ నెలలో గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్ సేల్ ను నిర్వహిస్తుంది. 2023 సంవత్సరంలో నిర్వహించే ఈ గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్ సేల్ తేదీలను ఆమెజాన్ శుక్రవారం ప్రకటించింది.
ఈ ఆమెజాన్ గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్ సేల్ ఆగస్ట్ 5వ తేదీన ప్రారంభం కానుంది. ఈ సేల్ ఆగస్ట్ 9వ తేదీ వరకు కొనసాగుతుంది. ప్రైమ్ మెంబర్స్ కు ఒక రోజు ముందే ఈ సేల్ ప్రారంభమవుతుంది. ఈ సేల్ లో స్మార్ట్ ఫోన్స్, ల్యాప్ టాప్స్, హోం అప్లయన్సెస్, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్.. తదితర సెగ్మెంట్లలోని ప్రొడక్ట్స్ పై ఆకర్షణీయమైన డిస్కౌంట్లు లభించనున్నాయి. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ పై కొనుగోలు చేస్తే అదనంగా 10 % డిస్కౌంట్ లభిస్తుంది.
ఈ ఆమెజాన్ గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్ సేల్ లో సామ్సంగ్, వన్ ప్లస్, రియల్ మి, ఎంఐ తదితర కంపెనీల స్మార్ట్ ఫోన్స్ పై 40 శాతానికి మించి డిస్కౌంట్ లభించనుంది. ఈయర్ బడ్స్, ఈ యర్ ఫోన్స్, స్మార్ట్ వాచెస్, ల్యాప్ టాప్స్ తదితర ఎలక్ట్రానిక్ గూడ్స్ పై 75% వరకు డిస్కౌంట్ లభిస్తుందని ఆమెజాన్ చెబుతోంది. ఈ సేల్ లో యాపిల్ ప్రొడక్ట్స్ కూడా 50% వరకు తగ్గింపు లో లభిస్తాయి. వివిధ కంపెనీల స్మార్ట్ టీవీలు కూడా దాదాపు 40% నుంచి 60% డిస్కౌంట్ తో లభిస్తాయి.
ఈ ఆమెజాన్ గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్ సేల్ లో దాదాపు అన్ని ప్రొడక్ట్స్ పై క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఉన్నాయి. ప్రొడక్ట్ డిస్కౌంట్ తో పాటు ఆమెజాన్ స్పెషల్ ఫ్లాట్ డిస్కౌంట్, అలాగే, బ్యాంక్ ఆఫర్స్, ఎక్స్చేంజ్ బోనస్, వీటన్నింటికి తోడు క్యాష్ బ్యాక్ ఆఫర్స్.. వీటన్నింటితో వినియోగదారులకు అత్యంత తక్కువ ధరకే కోరుకున్న ప్రొడక్ట్ లభిస్తుంది. ఫ్రిజ్ లు, వాషింగ్ మెషీన్స్ పై కూడా ఆకర్షణీయమైన ఆఫర్స్ ఉన్నాయి. సోనీ పీఎస్ వంటి గేమింగ్ ప్రొడక్ట్స్ పై 50 శాతం నుంచి 80 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది.