Honor 90 price : రూ. 50వేల ధరతో హానర్ 90!.. లాంచ్ ఎప్పుడు?
Honor 90 price in India : హానర్ 90 స్మార్ట్‌ఫోన్ లాంచ్, ధరకు సంబంధించిన వివరాలు లీక్ అయ్యాయి. వాటి వివరాలు ఇక్కడ తెలుసుకుందాము..
Honor 90 price in India : ఇండియా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో దాదాపు రోజుకు ఒక గ్యాడ్జెట్ లాంచ్ అవుతోంది. ఈ మార్కెట్‌కు ఉన్న డిమాండ్ అలాంటిది! కానీ హానర్ సంస్థ మాత్రం ఇండియాపై పెద్దగా ఫోకస్ చేయడం లేదని అనిపిస్తోంది. దీనికి చెక్ పెట్టేందుకు.. ఈ దిగ్గజ సంస్థ.. హానర్ 90ని మార్కెట్లోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మోడల్ లాంచ్, ధర వంటి వివరాలు ఇక్కడ తెలుసుకుందాము..
హానర్ 90 లాంచ్ ఎప్పుడంటే..!
ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్‌పై సంస్థ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాగా.. ఈ మోడల్ సెప్టెంబర్ మధ్యలో మార్కెట్‌ను హిట్ చేస్తుందని వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో దీని ధర రూ. 50వేలలోపు ఉంటుందని సమాచారం. ఇదే నిజమైతే.. ఈ సెగ్మెంట్లో ఉన్న వన్‌ప్లస్ 11ఆర్, ఒప్పో రెనో 10 ప్రో, నథింగ్ ఫోన్ 2 వంటి మొబైల్స్‌కు ఇది గట్టిపోటీనివ్వడం ఖాయం అని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
Honor 90 release date in India : యూరోప్‌లో హానర్ 90 ఇప్పటికే అందుబాటులో ఉంది. దీని ధర 550 పౌండ్లు. ఇందులో 6.7 ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే ఉంటుంది. 1200పీ రిసొల్యూషన్, 66వాట్ ఛార్జింగ్ సపోర్ట్, 5000ఎంఏహెచ్ బ్యాటరీ వంటివి లభిస్తున్నాయి. స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 ఎస్ఓసీ చిప్సెట్ ఉంటుంది. 200ఎంపీతో కూడిన కెమెరా సెటప్ రేర్‌లో ఉండనుంది. ఇక సెల్ఫీల కోసం 50ఎంపీ సెన్సార్ ఇస్తోంది సంస్థ.
ఇండియాలో ఈ మొబైల్‌కు మంచి డిమాండ్ ఉండే అవకాశం ఉంది. మంచి కెమెరా క్వాలిటీ కలిగిన స్మార్ట్‌ఫోన్స్‌ను భారతీయులు ఎప్పుడూ ఇష్టపడుతుంటారు. ఒప్పో రెనో సిరీస్, వివో వీ సిరీస్‌లు క్లిక్ అవ్వడానికి ముఖ్య కారణం ఇదే. అయితే ఇతర అంశాలను కూడా పరిగణించి తీసుకోవాలి.
Honor 90 price : ఈ హానర్ 90కి ఫీచర్స్, స్పెసిఫికేషన్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవు. యూరోప్‌లోని మోడల్‌కు ఏవైనా మార్పులు చేసి ఇండియాలో లాంచ్ చేస్తుందా? అన్న ప్రశ్నకు క్లారిటీ లేదు. సంస్థ ప్రకటనతో వీటిపై స్పష్టత లభిస్తుంది.
హానర్ ఎక్స్9ఏ ఫీచర్స్ చూశారా?
Honor X50 price in India : ఎక్స్9ఏ మోడల్‌ను ఈ ఏడాది తొలినాళ్లల్లో లాంచ్ చేసింది హానర్ సంస్థ. ఈ మోడల్‌కు మంచి డిమాండ్ కనిపిస్తోంది. ఈ హానర్ ఎక్స్9ఏ 5జీలో.. ఫుల్ హెచ్డీ+ రిసొల్యూషన్తో కూడిన 1080 X 2400 పిక్సెల్స్‌తో కూడిన 6.67 ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే ఉంటుంది. 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 20:9 ఆస్పెక్ట్ రేషియో కూడా ఉన్నాయి. సెక్యూరిటీ కోసం.. ఇందులో అండర్ డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం