Honor X9a 5G Launch : హానర్​ ఎక్స్​9ఏ 5జీ లాంచ్​.. స్పెసిఫికేషన్స్​ ఇవే!-honor x9a 5g launched with snapdragon 695 64mp triple cameras see full details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Honor X9a 5g Launch : హానర్​ ఎక్స్​9ఏ 5జీ లాంచ్​.. స్పెసిఫికేషన్స్​ ఇవే!

Honor X9a 5G Launch : హానర్​ ఎక్స్​9ఏ 5జీ లాంచ్​.. స్పెసిఫికేషన్స్​ ఇవే!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Dec 27, 2022 11:54 AM IST

Honor X9a 5G Launch : హనర్​ ఎక్స్​9ఏ 5జీ లాంచ్​ అయ్యింది. ఈ స్మార్ట్​ఫోన్​ ఫీచర్స్​, స్పెసిఫికేషన్స్​ వంటి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

హానర్​ ఎక్స్​9ఏ 5జీ లాంచ్​.. స్పెసిఫికేషన్స్​ ఇవే!
హానర్​ ఎక్స్​9ఏ 5జీ లాంచ్​.. స్పెసిఫికేషన్స్​ ఇవే! (representative image)

Honor X9a 5G Launch : 2023 జనవరి 4న హానర్​ ఎక్స్​9ఏ 5జీని ఆవిష్కరించినున్నట్టు ఆ సంస్థ ఇప్పటికే ప్రకటించింది. మాలేషియా వేదికగా ఈ స్మార్ట్​ఫోన్​ లాంచ్​ కానుంది. అయితే.. సంస్థకు చెందిన మిడిల్​ ఈస్ట్​ మార్కెట్​లోని అధికారిక వెబ్​సైట్​లో.. ఈ హానర్​ ఎక్స్​9ఏ 5జీకి సంబంధించిన స్పెసిఫికేషన్స్​ లిస్ట్​ అయ్యాయి. కొన్ని రోజుల క్రితం వరకు ఈ హానర్​ ఎక్స్​9ఏ 5జీపై మార్కెట్​లో ఊహాగానాలు జోరుగా సాగాయి. ఇది చైనాలో అందుబాటులో ఉన్న హానర్​ ఎక్స్​40కి రీబ్రాండెడ్​ వర్షెన్​ అని మార్కెట్​ భావించింది. కానీ తాజాగా వెలువడిన స్పెసిఫికేషన్స్​ని చూస్తే.. ఎక్స్​40తో పోల్చుకుంటే.. ఈ హానర్​ ఎక్స్​9ఏ 5జీ కాస్త భిన్నంగా ఉంది.

హానర్​ ఎక్స్​9ఏ 5జీ స్పెసిఫికేషన్స్​- ఫీచర్స్​..

Honor X9a 5G specifications : హానర్​ ఎక్స్​9ఏ 5జీలో.. ఫుల్​ హెచ్​డీ+ రిసొల్యూషన్​తో కూడిన 1080 X 2400 పిక్సెల్స్​తో కూడిన 6.67 ఇంచ్​ అమోలెడ్​ డిస్​ప్లే ఉంటుంది. 120హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​, 20:9 ఆస్పెక్ట్​ రేషియో కూడా ఉన్నాయి. సెక్యూరిటీ కోసం.. ఇందులో అండర్​ డిస్​ప్లే ఫింగర్​ప్రింట్​ స్కానర్​ ఉంటుంది.

హానర్​ ఎక్స్​9ఏ 5జీ ఫ్రెంట్​లో 16ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. రేర్​లో 64ఎంపీ ప్రైమరీ, 5ఎంపీ అల్ట్రా వైడ్​, 2ఎంపీ కెమెరాలు ఉన్నాయి. మేజిక్​ యూఐ 6.1 బేస్డ్​ ఆండ్రాయిడ్​ 12 ఓఎస్​తో ఈ స్మార్ట్​ఫోన్​ పనిచేస్తుంది.

Honor X9a 5G Malaysia : స్నాప్​డ్రాగన్​ 695 చిప్​సెట్​ ఈ హానర్​ ఎక్స్​9ఏ 5జీ సొంతం. 6జీబీ ర్యామ్​- 128జీబీ స్టోరేజ్​, 8 జీబీ ర్యామ్​- 256 జీబీ స్టోరేజ్​ వేరియంట్స్​ ఉన్నాయి. డ్యూయెల్​ సిమ్​, 5జీ, వైఫై 802.11ఏసీ బ్లూటూత్​ 5.1, జీపీఎస్​, ఎన్​ఎఫ్​సీ, యూఎస్​బీ- సీ పోర్ట్​ వంటి కెనక్టివిటీ ఫీచర్స్​ ఉన్నాయి. ఈ స్మార్ట్​ఫోన్​లో 5,100ఎంఏహెచ్​ బ్యాటరీ ఉంటుంది. 40డబ్ల్యూ ఛార్జింగ్​కు సపోర్ట్​ చేస్తుంది.

ఈ హానర్​ ఎక్స్​9ఏ 5జీ.. 161.6 X 73.9 X 7.9ఎంఎం డైమెన్షన్స్​తో ఉంటుంది. దీని బరువు 175 గ్రాములు!

హానర్​ ఎక్స్​9ఏ 5జీ ధర..

Honor X9a 5G price in India : హానర్​ ఎక్స్​9ఏ 5జీ స్మార్ట్​ఫోన్​.. టిటానియం సిల్వర్​, ఎమరాల్డ్​ గ్రీన్​, మిడ్​నైట్​ బ్లాక్​ వంటి రంగుల్లో అందుబాటులో ఉండనుంది.

అయితే.. ఈ స్మార్ట్​ఫోన్​ ధరకు సంబంధించిన వివరాలు ఇంకా అప్డేట్​ కాలేదు. 2023 జనవరి 4న మలేషియాలో లాంచ్​తో పూర్తి వివరాలు తెలుస్తాయి.

ఇండియాలో ఈ స్మార్ట్​ఫోన్​ ఎప్పుడు లాంచ్​ అవుతుంది? ధర ఎంత ఉంటుంది? అన్న వివరాలు తెలియాల్సి ఉంది.

Whats_app_banner

సంబంధిత కథనం