Xiaomi Pad 6 vs OnePlus Pad : ఈ రెండు ప్యాడ్స్​లో ఏది వాల్యూ ఫర్​ మనీ..?-in pics xiaomi pad 6 vs oneplus pad which gadget is value for money check here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Xiaomi Pad 6 Vs Oneplus Pad : ఈ రెండు ప్యాడ్స్​లో ఏది వాల్యూ ఫర్​ మనీ..?

Xiaomi Pad 6 vs OnePlus Pad : ఈ రెండు ప్యాడ్స్​లో ఏది వాల్యూ ఫర్​ మనీ..?

Jun 05, 2023, 04:46 PM IST Sharath Chitturi
Jun 05, 2023, 04:46 PM , IST

  • Xiaomi Pad 6 vs OnePlus Pad : షావోమీ నుంచి ప్యాడ్​ 6 త్వరలోనే ఇండియాలో లాంచ్​కానుంది. ఈ డివైజ్​.. ఇటీవలే లాంచ్​ అయిన వన్​ప్లస్​ ప్యాడ్​కు గట్టి పోటీనిస్తుందని అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండింటినీ పోల్చి, ఏది వాల్యూ ఫర్​ మనీ? అన్నది తెలుసుకుందాము..

షావోమీ ప్యాడ్​ 6 చైనాలో ఇప్పటికే అందుబాటులో ఉంది. జూన్​ 13న ఇండియా మార్కెట్​లోకి అడుగుపెట్టబోతోంది. మరోవైపు వన్​ప్లస్​ ప్యాడ్​కు ఇండియాలో మంచి డిమాండ్​ కనిపిస్తోంది.

(1 / 5)

షావోమీ ప్యాడ్​ 6 చైనాలో ఇప్పటికే అందుబాటులో ఉంది. జూన్​ 13న ఇండియా మార్కెట్​లోకి అడుగుపెట్టబోతోంది. మరోవైపు వన్​ప్లస్​ ప్యాడ్​కు ఇండియాలో మంచి డిమాండ్​ కనిపిస్తోంది.(HT TECH)

షావోమీ ప్యాడ్​ 6లో మెటల్​ బాడీ, స్టైలస్​ పెన్​- కీబోర్డ్​ సపోర్ట్​ లభిస్తుంది. ఇందులో 144హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​తో కూడిన​ 11.0 ఇంచ్​ 2.8కే (1080x2880 పిక్సెల్స్​) 10 బిట్​ ఎల్​సీటీ స్క్రీన్​ ఉంటుంది. ఇది హెచ్​డీఆర్​10+ సర్టిఫికేషన్​, డాల్బీ విజన్​తో వస్తుంది.

(2 / 5)

షావోమీ ప్యాడ్​ 6లో మెటల్​ బాడీ, స్టైలస్​ పెన్​- కీబోర్డ్​ సపోర్ట్​ లభిస్తుంది. ఇందులో 144హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​తో కూడిన​ 11.0 ఇంచ్​ 2.8కే (1080x2880 పిక్సెల్స్​) 10 బిట్​ ఎల్​సీటీ స్క్రీన్​ ఉంటుంది. ఇది హెచ్​డీఆర్​10+ సర్టిఫికేషన్​, డాల్బీ విజన్​తో వస్తుంది.(HT TECH)

ఇక షావోమీ ప్యాడ్​ 6లో 13ఎంపీ రేర్​ కెమెరా, ఎల్​ఈడీ ఫ్లాష్​ లభిస్తున్నాయి. సెల్ఫీల కోసం 8ఎంపీ కెమెరా ఉంటుంది. స్నాప్​డ్రాగన్​ 870 చిప్​సెట్​, ఎల్​పీడీడీఆర్​5 ర్యామ్​, యూఎఫ్​ఎస్​ 3.1 స్టోరేజ్​ టెక్నాలజీ ఇందులో ఉంటుంది. 

(3 / 5)

ఇక షావోమీ ప్యాడ్​ 6లో 13ఎంపీ రేర్​ కెమెరా, ఎల్​ఈడీ ఫ్లాష్​ లభిస్తున్నాయి. సెల్ఫీల కోసం 8ఎంపీ కెమెరా ఉంటుంది. స్నాప్​డ్రాగన్​ 870 చిప్​సెట్​, ఎల్​పీడీడీఆర్​5 ర్యామ్​, యూఎఫ్​ఎస్​ 3.1 స్టోరేజ్​ టెక్నాలజీ ఇందులో ఉంటుంది. (HT TECH)

ఇక వన్​ప్లస్​ ప్యాడ్​ విషయానికొస్తే.. ఇందులో 144హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​తో కూడిన 11.61 ఇంచ్​ ఎల్​సీడీ ప్యానెల్​ (2000x2800 పిక్సెల్స్​ రిసొల్యూషన్​) లభిస్తుంది. గొరిల్లా గ్లాస్​ 3 ప్రొటెక్షన్​ దీని సొంతం.

(4 / 5)

ఇక వన్​ప్లస్​ ప్యాడ్​ విషయానికొస్తే.. ఇందులో 144హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​తో కూడిన 11.61 ఇంచ్​ ఎల్​సీడీ ప్యానెల్​ (2000x2800 పిక్సెల్స్​ రిసొల్యూషన్​) లభిస్తుంది. గొరిల్లా గ్లాస్​ 3 ప్రొటెక్షన్​ దీని సొంతం.(HT TECH)

వన్​ప్లస్​ ప్యాడ్​లో 13ఎంపీ రేర్​ కెమెరా, ఫ్లాష్​ లైట్​లు వస్తున్నాయి. 8ఎంపీ సెల్ఫీ కెమెరా లభిస్తోంది. డైమెన్సిటీ 9000 ప్రాసెసర్​, ఎల్​పీడీడీఆర్​5 ర్యామ్​, యూఎఫ్​ఎస్​ 3.1 స్టోరేజ్​ టెక్నాలజీ ఇందులో ఉంటుంది. ఆక్సీజెన్​ఓఎస్​ 13.1పై ఇది పనిచేస్తుంది. 9,510ఎంఏహెచ్​ బ్యాటరీ దీని సొంతం. మార్కెట్​లో 8జీబీ ర్యామ్​- 128జీబీ స్టోరేజ్​ ధర రూ. 37,999గా ఉంది. 12జీబీ ర్యామ్​- 256జీబీ స్టోరేజ్​ వేరియంట్​ ధర రూ. 39,999గా ఉంది.

(5 / 5)

వన్​ప్లస్​ ప్యాడ్​లో 13ఎంపీ రేర్​ కెమెరా, ఫ్లాష్​ లైట్​లు వస్తున్నాయి. 8ఎంపీ సెల్ఫీ కెమెరా లభిస్తోంది. డైమెన్సిటీ 9000 ప్రాసెసర్​, ఎల్​పీడీడీఆర్​5 ర్యామ్​, యూఎఫ్​ఎస్​ 3.1 స్టోరేజ్​ టెక్నాలజీ ఇందులో ఉంటుంది. ఆక్సీజెన్​ఓఎస్​ 13.1పై ఇది పనిచేస్తుంది. 9,510ఎంఏహెచ్​ బ్యాటరీ దీని సొంతం. మార్కెట్​లో 8జీబీ ర్యామ్​- 128జీబీ స్టోరేజ్​ ధర రూ. 37,999గా ఉంది. 12జీబీ ర్యామ్​- 256జీబీ స్టోరేజ్​ వేరియంట్​ ధర రూ. 39,999గా ఉంది.(HT TECH)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు