తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Honda Elevate Suv : ఇదిగో.. హోండా ఎలివేట్​ ఎస్​యూవీ- అదిరిన ఫీచర్స్​!

Honda Elevate SUV : ఇదిగో.. హోండా ఎలివేట్​ ఎస్​యూవీ- అదిరిన ఫీచర్స్​!

Sharath Chitturi HT Telugu

06 June 2023, 13:14 IST

google News
    • Honda Elevate SUV : హోండా ఎలివేట్​ ఎస్​యూవీని సంస్థ మంగళవారం ఆవిష్కరించింది. ఈ మోడల్​ స్పెసిఫికేషన్స్​, ఫీచర్స్​, ధర వంటి వివరాలు ఇక్కడ తెలుసుకుందాము..
ఇదిగో హోండా ఎలివేట్​ ఎస్​యూవీ..
ఇదిగో హోండా ఎలివేట్​ ఎస్​యూవీ..

ఇదిగో హోండా ఎలివేట్​ ఎస్​యూవీ..

Honda Elevate SUV : ఈ ఏడాది మచ్​ అవైటెడ్​ వాహనాల్లో ఒకటైన ఎలివేట్​ ఎస్​యూవీని మంగళవారం అధికారికంగా ఆవిష్కరించింది హోండా కార్స్​ ఇండియా. జులై నుంచి బుకింగ్స్​ ఓపెన్​ అవుతాయని, పండుగ సీజన్​లో ఎలివేట్​ లాంచ్​ అవుతుందని స్పష్టం చేసింది. తొలుత దేశీయ మార్కెట్​లోకి ఈ మోడల్​ అందుబాటులోకి వస్తుందని, అనంతరం అంతర్జాతీయ విపణీలోకి అడుగుపెడుతుందని పేర్కొంది.

హోండా ఎలివేట్​ ఎస్​యూవీ.. ఇదిగో!

ఇండియా ఆటోమొబైల్​ మార్కెట్​లో ఎస్​యూవీలకు విపరీతమైన డిమాండ్​ కనిపిస్తోంది. హోండాకు మాత్రం ఈ సెగ్మెంట్​లో వాహనాలు లేవు. గతంలో కొన్ని మోడల్స్​ను లాంచ్​ చేసినప్పటికీ, అవి క్లిక్​ అవ్వకపోవడంతో డిస్కంటిన్యూ చేసింది ఆటోమొబైల్​ సంస్థ. ఈ నేపథ్యంలో పక్కా ప్రణాళికతో ఈసారి ఎలివేట్​ ఎస్​యూవీని తీసుకొచ్చింది. పైగా.. తొలుత ఇండియాలో లాంచ్​ చేస్తుండటంతో, దేశంలో ఈ వాహనంపై సంస్థ పెట్టుకున్న అంచనాలు స్పష్టమవుతున్నాయి.

ఇక ఎలివేట్​ విషయానికొస్తే.. దీని లుక్స్​ డాషింగ్​గా ఉన్నాయి. హెడ్​ల్యాంప్స్​ షార్ప్​గా ఉన్నాయి. ఫ్రెంట్​లో పెద్ద రేడియేటర్​ గ్రిల్​ వస్తోంది. ఫ్లాట్​ ఫేస్​, ఎల్​ఈడీ హెడ్​ల్యాంప్స్​, ఇంటిగ్రేచటెడ్​ డేటైమ్​ రన్నింగ్​ లైట్స్​, ఎల్​ఈడీ టెయిల్​లైట్స్​, బ్లాక్​ ఫాగ్​ ల్యాంప్​ హోజింగ్​, అలాయ్​ వల్స్​ వంటివి వస్తున్నాయి. సైడ్​ ప్రొఫైల్​ కూడా అట్రాక్టివ్​గా ఉంది. గ్లోబల్​ అర్బన్​ ఎస్​యూవీగా గుర్తింపు తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ ఎస్​యూవీ డిజైన్​పై అధికంగా దృష్టిపెట్టినట్టు సంస్థ చెబుతోంది.

హోండా ఎలివేట్​ ఎస్​యూవీ పొడవు 4,312ఎంఎం. వెడల్పు 1,790ఎంఎం. ఎత్తు 1,650ఎంఎం. ఈ డైమెన్షన్స్​తో ఎస్​యూవీ కంఫ్టర్​ చాలా మెరుగ్గా ఉంటుందని సంస్థ చెబుతోంది. రోడ్​ ప్రెజెన్స్​ కూడా బలంగా ఉంటుందని అంచనా వేస్తోంది.

హోండా ఎలివేట్​- ఫీచర్స్​.. ఇంజిన్​..

ఇక ఫీచర్స్​ విషయానికొస్తే.. ఈ వెహికిల్​లో 10.25 ఇంచ్​ టచ్​స్క్రీన్​ ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​, 7 ఇంచ్​ హెచ్​డీ కలర్​ టీఎఫ్​టీ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​, వయర్​లెస్​ స్మార్ట్​ఫోన్​ ఇంటిగ్రేషన్​ టెక్నాలజీ, హోండా కనెక్ట్​ వంటివి లభిస్తున్నాయి. జియో ఫెన్సింగ్​, ఎమర్జెన్సీ అసిస్టెన్స్​ వంటివి కూడా వస్తున్నాయి.

Honda Elevate launch date India : ఎస్​యూవీ సేఫ్టీపైనా హోండా అధిక దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. కొలిజన్​ మైగ్రేషన్​ బ్రేకింగ్​, లేన్​ కీపింగ్​ అసిస్టెన్స్​, పెడిస్ట్రిషన్​ ఇంజ్యూరీ మిటిగేషన్​ సిస్టెమ్​, రివర్స్​ పార్కింగ్​ సెన్సార్​- కెమెరా, హోండా సెన్స్​ అండ్​ ఎమర్జెన్సీ స్టాప్​ సిగ్నల్​ వంటివి సేఫ్టీ ఫీచర్స్​గా వస్తున్నాయి. వీటిని దాటుకుని ఏమైనా ప్రమాదం జరిగితే.. తక్కువ ఇంపాక్ట్​ పడే విధంగా ఈ వెహికిల్​ బాడీని టెన్సైల్​ స్టీల్​ మెటీరియల్​తో రూపొందించింది ఈ దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ.

హోండా ఎలివేట్​లో 1.5 లీటర్​ డీఓహెచ్​సీ ఐ- వీటెక్​ పెట్రోల్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది 121 పీఎస్​ పవర్​ను, 145.1 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. 6 స్పీడ్​ మేనయువల్​ గేర్​బాక్స్​తో పాటు అడ్వాన్స్​డ్​ సీవీటీ ట్రాన్స్​మిషన్​ లభిస్తోంది. సెల్ఫ్​ ఛార్జింగ్​, డ్యూయెల్​ మోటార్​ ఈ-సీవీటీ టెక్నాలజీతో కూడిన స్ట్రాంగ్​ హైబ్రీడ్​ వేరియంట్​ కూడా ఈ ఎస్​యూవీకి లభిస్తుందని తెలుస్తోంది. ఇది 126 పీఎస్​ పవర్​ను, 253ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది.

ధర ఎంత..?

Honda Elevate features : ఇండియాలో ఈ ఎలివేట్​ ఎస్​యూవీ ధరకు సంబంధించిన వివరాలు లాంచ్​ సమయంలో తెలుస్తాయి. అయితే దీని ఎక్స్​షోరూం ధర రూ. 10.50లక్షలు- రూ. 20లక్షల మధ్యలో ఉంటుందని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి. కాగా లాంచ్​ తర్వాత.. ఈ వెహికల్​ ఇప్పటికే మార్కెట్​లో హై డిమాండ్​ ఉన్న హ్యుందాయ్​ క్రేటా, కియా సెల్టోస్​, మారుతీ సుజుకీ గ్రాండ్​ విటారా, స్కోడా కుషాక్​, వోక్స్​వ్యాగన్​ టైగున్​, ఎంజీ ఆస్టర్​కు గట్టిపోటీనిస్తుందని అంచనాలు ఉన్నాయి.

ఇండియాలో మరో మూడేళ్లల్లో ఒక ఫుల్లీ ఎలక్ట్రిక్​ కారును సైతం లాంచ్​ చేయనున్నట్టు హోండా ప్రకటించింది. ఎలివేట్​ ఎస్​యూవీ ఈవెంట్​లో ఈ విషయాన్ని వెల్లడించింది.

తదుపరి వ్యాసం