Baojun Yep electric SUV : మరో బుడ్డి ఎలక్ట్రిక్ వాహనం వచ్చేస్తోంది!
02 June 2023, 12:27 IST
- Baojun Yep electric SUV : బౌజున్ యెప్ పేరుతో ఓ చిన్న ఈ-ఎస్‌యూవీని చైనాలో ఆవిష్కరించింది ఎస్జీఎండబ్ల్యూ. ఈ మోడల్ విశేషాలు ఇక్కడ తెలుసుకుందాము..
బౌజున్ యెప్
Baojun Yep electric SUV : చైనాకు చెందిన ఎస్ఏఐసీ-జీం- వుల్లింగ్ (ఎస్జీఎండబ్ల్యూ).. ఓ బుడ్డి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని తాజాగా ఆవిష్కరించింది. దీని పేరు బౌజున్ యెప్. చైనాలో దీని ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ. 11,300 యెన్లుగా (సుమారు రూ. 9.3లక్షలు) ఉంది. ఇక ఈ మినీ ఈ- ఎస్‌యూవీని ఎంజీ మోటర్ త్వరలో ఇండియాలోకి తీసుకొస్తోంది. ఎంజీ కామెట్ ఈవీని రూపొందించిన జీఎస్ఈవీ (గ్లోబల్ స్మాల్ ఎలక్ట్రిక్ వెహికిల్) ప్లాట్‌ఫామ్‌పై ఈ బౌజున్ యెప్ సైతం తయారువుతుండటం విశేషం. ఈ నేపథ్యంలో ఈ కొత్త, చిన్న ఎస్యూవీ వివరాలు ఇక్కడ తెలుసుకుందాము..
బౌజున్ యెప్ ఈవీ..
నగరాల్లో ప్రయాణాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఎంజీ కామెట్ ఈవీ ఇటీవలే ఇండియాలో లాంచ్ అయ్యింది. ఈ మోడల్‌కు మంచి డిమాండ్ కనిపిస్తోంది. చైనాలో దీని పేరు వుల్లింగ్ ఎయిర్. ఎంజీ కామెట్ సక్సెస్‌తో బౌజున్ యెప్కు సైతం ఆదరణ లభిస్తుందని సంస్థ అశాభావం వ్యక్తం చేస్తోంది.
ఇదొక 3 డోర్ ఎస్యూవీ. ఫ్రెంట్లో డీఆర్ఎల్స్తో కూడిన ఎల్ఈడీ హెడ్‌లైట్స్, క్లామ్‌షెల్ బానెట్, క్లోజ్డ్ ఆఫ్ గ్రిల్, బ్లాక్డ్ ఔట్ రూఫ్ రెయిల్స్, ఇండికేటర్ మౌంటెడ్ ఓఆర్వీఎంలు, ఫ్లేర్డ్ వీల్ ఆర్చీస్, సైడ్ స్టెప్పర్స్, స్కిడ్ ప్లేట్స్, 15 ఇంచ్ డిజైనర్ అలాట్ వీల్స్ వస్తున్నాయి.
ఇదీ చూడండి:- How to take care of car in rainy season : వర్షాకాలం వచ్చేస్తోంది.. మీ కారు భద్రమేనా?
బౌజున్ యెప్ ఎస్యూవీ- ఫీచర్స్..
ఇక ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ 4 సీటర్ కేబిన్‌లో డ్యూయెల్ టోన్ డాష్‌బోర్డ్, ఇంటిగ్రేడెట్ ఏసీ వెంటస్, మేన్యువల్ ఏసీ, పవర విండోలు, 3 స్పోక్ మల్టీఫంక్షనల్ స్టీరింగ్ వీల్, డ్యూయెల్ 10.25 ఇంచ్ స్క్రీన్, లేటెస్ట్ కనెక్టివిటీ ఆప్షన్స్ వంటివి లభిస్తున్నాయి. ప్యాసింజర్ సేఫ్టీ కోసం ఈవీలో మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్స్, ఏడీఏఎస్ ఫంక్షన్స్ వంటివి వస్తున్నాయి.
Baojun Yep EV : ఇక ఈ ఎలక్ట్రిక్ వాహనంలో 28.1 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో కూడిన ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఇది 67 హెచ్‌పీ పవర్‌ను, 140 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. ఈ ఈ-ఎస్యూవీ.. 303కి.మీల వరకు ప్రయాణిస్తుందని సంస్థ చెబుతోంది.
ఇండియాలో ఈ బౌజున్ యెప్ ఈ- ఎస్యూవీ ఎప్పుడు లాంచ్ అవుతుంది? ధర ఎంత ఉంటుంది? వంటి ప్రశ్నలకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు. దీనిపై సంస్థ త్వరలో ప్రకటన చేసే అవకాశం ఉంది.