Mercedes electric SUV: ఇండియన్ మార్కెట్లో మరో మెర్సెడెజ్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ; ధర ఎంతంటే?
03 June 2023, 15:12 IST
మెర్సెడెజ్ బెంజ్ ఇండియా సంస్థ భారతీయ ఆటో మార్కెట్లోకి మరో ఎలక్ట్రిక్ ఎస్యూవీని లాంచ్ చేసింది. ఈక్యూబీ 350 4 మ్యాటిక్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ (EQB 350 4Matic electric SUV) ఎక్స్ షోరూమ్ ధర ను రూ. 77.50 లక్షలుగా మెర్సెడెజ్ బెంజ్ ఇండియా సంస్థ నిర్ణయించింది.
మెర్సెడెజ్ ఈక్యూబీ 350 ఎలక్ట్రిక్ ఎస్ యూ వీ
మెర్సెడెజ్ బెంజ్ ఇండియా సంస్థ భారతీయ ఆటో మార్కెట్లోకి మరో ఎలక్ట్రిక్ ఎస్యూవీని లాంచ్ చేసింది. ఈక్యూబీ 350 4 మ్యాటిక్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ (EQB 350 4Matic electric SUV) ఎక్స్ షోరూమ్ ధర ను రూ. 77.50 లక్షలుగా మెర్సెడెజ్ బెంజ్ ఇండియా సంస్థ నిర్ణయించింది.
ఈక్యూబీ 300 స్థానంలో..
ఈక్యూబీ 350 ఎలక్ట్రిక్ కారును ఈక్యూబీ 300 ఫోర్ మ్యాటిక్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ (EQB 300 4Matic SUV) స్థానంలో భారతీయ మార్కెట్లో ప్రవేశ పెట్టారు. ఈక్యూబీ 300 ఫోర్ మ్యాటిక్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ (EQB 300 4Matic SUV) ఎక్స్ షోరూమ్ ధర ను రూ. 74.50 లక్షలుగా ఉంది. ఈ మోడల్ ను 2022 డిసెంబర్ లో లాంచ్ చేశారు. ఈ మోడల్ కు స్వల్పమైన మార్పులు చేసి EQB 350 ని రూపొందించారు. EQB 350 లో కూడా 66.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ నే అమర్చారు. ఈ ఎస్ యూవీ 288 బీహెచ్పీ పవర్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. EQB 300 పవర్ ఔట్ పుట్ 225 బీహెచ్ పీగా ఉంది.
పెద్దగా మార్పులు లేవు..
EQB 300 ఎలక్ట్రిక్ ఎస్ యూవీతో పోలిస్తే లేటెస్ట్ EQB 350 ఎలక్ట్రిక్ కారులో పెద్దగా మార్పులేవీ చేయలేదు. లుక్స్ అండ్ డిజైన్ EQB 300 తరహాలోనే ఉన్నాయి. కాకపోతే, ఇందులో 18 అంగుళాల తేలికైన అలాయ్ వీల్స్ ను అమర్చారు. తద్వారా ఎయిరోడైనమిక్స్ పర్ఫార్మెన్స్ మరింత మెరుగవుతుంది. EQB 350 లో బ్లాక్ ప్యానెల్ గ్రిల్, అడాప్టివ్ హై బీమ్ అసిస్ట్ తో ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, రియర్ ఎల్ఈడీ స్ట్రిప్స్, రూఫ్ టెయిల్స్, బ్యాక్ లిట్ టర్న్ ఇండికేటర్స్ ను అమర్చారు.
ఇంటీరియర్స్ లో కూడా..
EQB 350 ఇంటీరియర్స్ లో కూడా పెద్ద మార్పులేవీ చేయలేదు. 10.25 అంగుళాల డాష్ బోర్డ్, ఇన్ఫోటైన్ మెంట్ డిస్ ప్లేను అమర్చారు. ఇది మెర్సెడెజ్ బెంజ్ స్పెషల్ ఎంబీయూఎక్స్ (MBUX) సిస్టమ్ తో పని చేస్తుంది. ఈ కారులో రియర్ వ్యూ కెమెరా, మోటరైజ్డ్ టెయిల్ గేట్, కస్టమైజబుల్ లైటింగ్ ఆప్షన్స్, పవర అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్స్, వైర్ లెస్ చార్జింగ్ ప్యాడ్, క్రూయిజ్ కంట్రోల్,మల్టీ జోన్ క్లైమేట్ కంట్రోల్, తదితర ఫీచర్లున్నాయి. ఈ EQB 350 జీరో నుంచి 100 కిమీల వేగాన్ని 6.2 సెకన్లలో అందుకుంటుంది. ఈ కార్ టాప్ స్పీడ్ గంటకు 160 కిమీలు. 100 కేడబ్ల్యూ డీసీ చార్జర్ తో ఈ కార్ బ్యాటరీని జీరో నుంచి 80 శాతానికి 32 నిమిషాల్లో చార్జ్ చేయవచ్చు. సింగిల్ ఫుల్ చార్జితో ఈ కారు గరిష్టంగా 423 కిమీలు ప్రయాణిస్తుంది.