తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Hero Xtreme 125r : హీరో ఎక్స్​ట్రీమ్​ 125ఆర్​ లాంచ్​.. ధర ఎంతంటే!

Hero Xtreme 125R : హీరో ఎక్స్​ట్రీమ్​ 125ఆర్​ లాంచ్​.. ధర ఎంతంటే!

Sharath Chitturi HT Telugu

23 January 2024, 13:31 IST

google News
    • Hero Xtreme 125R : హీరో ఎక్స్​ట్రీమ్​ 125ఆర్ బైక్​ తాజాగా​ లాంచ్ అయ్యింది. ఈ మోడల్​ ఫీచర్స్​, ధర వివరాలివే..
హీరో ఎక్స్​ట్రీమ్​ 125ఆర్​ లాంచ్​.. ధర ఎంతంటే!
హీరో ఎక్స్​ట్రీమ్​ 125ఆర్​ లాంచ్​.. ధర ఎంతంటే!

హీరో ఎక్స్​ట్రీమ్​ 125ఆర్​ లాంచ్​.. ధర ఎంతంటే!

Hero Xtreme 125R : హీరో మోటోకార్ప్​ సంస్థ.. సరికొత్త బైక్​ని లాంచ్​ చేసింది. దాని పేరు హీరో ఎక్స్​ట్రీమ్​ 125ఆర్​. హీరో వరల్డ్​ 2024లో ఈ బైక్​ని ప్రదర్శించింది. ఈ నేపథ్యంలో.. ఈ బైక్​ ఫీచర్స్​, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

హీరో ఎక్స్​ట్రీమ్​ 125ఆర్​ బైక్​ ఫీచర్స్​..

హీరో ఎక్స్​ట్రీమ్​ 125ఆర్​ డిజైన్​ స్టైలిష్​గా ఉంది. లుక్స్​ షార్ప్​గా, బోల్డ్​గా కనిపిస్తున్నాయి. సరికొత్త హెడ్​ల్యాంప్​ డిజైన్​ ఈ బైక్​లో చూడొచ్చు. ఫలితంగా.. దీనికి యునీక్​ అపియెరన్స్​ లభిస్తోంది. ఫ్యుయెల్​ ట్యాంక్​ డిజైన్​ అగ్రెసివ్​గా ఉంది. స్ల్పిట్​ స్టైల్​ సీట్స్​, స్ల్పిట్​ గ్రాబ్​ రెయిల్స్​ వంటివి వస్తున్నాయి. ఫ్రెంట్​లో డిజిటల్​ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​, ఎల్​సీడీ ప్యానెల్​ వంటివి వస్తున్నాయి.

ఈ హీరో ఎక్స్​ట్రీమ్​ 125ఆర్​ బైక్​లో సరికొత్త 125సీసీ సింగిల్​ సిలిండర్​ ఎయిర్​ కూల్డ్​ ఇంజిన్​ వస్తోంది. ఇది.. 11.5 హెచ్​పీ పవర్​ని, 10.5 ఎన్​ఎం టార్క్​ని జనరేట్​ చేస్తుంది. ఇందులో.. 5 స్పీడ్​ గేర్​ బాక్స్​ ఉంటుంది. ఫ్రెంట్​లో 37ఎంఎం టెలిస్కోపిక్​ ఫోర్క్స్​, రేర్​లో మోనో షాక్​ అబ్సార్బర్​ యూనిట్స్​ సస్పెన్షన్స్​గా వస్తున్నాయి. ఇక ఫ్రెంట్​ వీల్​కి డిస్క్​ బ్రేక్​, రేర్​ వీల్​కి డ్రమ్​/ డిస్క్​ బ్రేక్​ ఆప్షన్స్​ వస్తున్నాయి. ఐబీఎస్​, సింగిల్​ ఛానెల్​ ఏబీఎస్​ వంటి ఫీచర్స్​ కూడా ఇందులో ఉన్నాయి.

హీరో ఎక్స్​ట్రీమ్​ 125ఆర్​ ధర ఎంతంటే..

ఇండియాలో.. హీరో ఎక్స్​ట్రీమ్​ 125ఆర్​ ఐబీఎస్​ వర్షెన్​ ఎక్స్​షోరూం ధర రూ. 95వేలుగా ఉంది. ఏబీఎస్​ వేరియంట్​ ఎక్స్​షోరూం ధర రూ. 99,500గా ఉంది.

ఈ కొత్త బైక్​లో మూడు కలర్స్​ ఉన్నాయి. అవి.. కోబాల్ట్​ బ్లూ, ఫయర్​స్టార్మ్​ రెడ్​, స్టాలియన్​ బ్లాక్​.

ఈ హీరో ఎక్స్​ట్రీమ్​ 125ఆర్​ కొత్త బైక్.. ఫిబ్రవరి 20న డీలర్​షిప్​షోరూమ్స్​కు చేరుకుంటుంది. ఆ తర్వాత డెలివరీలు మొదలవుతాయి. ఈ బైక్​.. టీవీఎస్​ రైడర్​ 125కి గట్టిపోటీనిస్తుందని మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి.

తదుపరి వ్యాసం