Hero Splendor EV : హీరో స్ల్పెండర్కి 'ఈవీ' టచ్.. ఎలా ఉండబోతోంది?
Hero Splendor EV : హీరో స్ల్పెండర్కి ఈవీ వర్షెన్ రాబోతోంది. ఇటీవలే.. ఈ బైక్‌కి టెస్ట్ డ్రైవ్ జరిగింది.
Hero Splendor EV : ఇండియా 2 వీలర్ ఎలక్ట్రిక్ సెగ్మెంట్లో పోటీ మామూలుగా లేదన్న విషయం తెలిసిందే. ఆటోమొబైల్ సంస్థలు.. పోటీ పడి మరీ.. కొత్త కొత్త ఈవీలను లాంచ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ఈ సెగ్మెంట్‌పై ఆధిపత్యం కోసం హీరో మోటోకార్ప్ సంస్థ గట్టిగానే ప్లాన్ చేసింది! భారతీయులకు సుపరిచితమైన, సంస్థకు బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా ఉన్న హీరో స్ల్పెండర్కు ఈవీ టచ్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈ హీరో స్ల్పెండర్ ఈవీ.. త్వరలోనే మార్కెట్లోకి అడుగుపెడుతుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో.. ఈ మోడల్‌పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
హీరో స్ల్పెండర్ ఈవీ వచ్చేస్తోంది..
ఈ స్ల్పెండర్ ఈవీకి సంబంధించిన ప్రోటోటైప్ బైక్‌కు చెందిన టెస్ట్ డ్రైవ్‌ని ఇటీవలే నిర్వహించింది హీరో మోటోకార్ప్ సంస్థ. పూణెలో ఈ టెస్ట్ డ్రైవ్ జరిగింది. గోగోఏ1కు చెందిన ఎలక్ట్రిక్ కన్వర్జేషన్ కిట్.. ఈ స్ల్పెండర్ ఈవీకి ఉంటుందని టాక్ నడుస్తోంది. ఐసీఈ- ఇంజిన్ వెహికిల్స్‌కి ఎలక్ట్రిఫికేషన్ టచ్ ఇచ్చే విషయంలో ఈ గోగోఏ1 ప్రసిద్ధి.
Hero Splendor EV price : హీరో మోటోకార్ప్‌తో పాటు హోండా 2 వీలర్స్‌కి కూడా.. ఎలక్ట్రిక్ కన్వర్షన్ కిట్లు ఇస్తోంది గోగోఏ1. వీటిల్లో హీరో స్ల్పెండర్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది.
ఇదీ చూడండి:- Tata Punch EV on road price in Hyderabad : హైదరాబాద్‌లో టాటా పంచ్ ఈవీ ఆన్‌రోడ్ ప్రైజ్ ఎంతంటే..
ఈ నేపథ్యంలో.. హీరో స్ల్పెండర్ ఎలక్ట్రిక్ బైక్‌లో రేర్ హబ్ మోటర్ ఉంటుందని సమాచారం. ఇందులో 3.94 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉండొచ్చు. ఈ ఇంజిన్.. 5.28 హెచ్‌పీ పవర్‌ని జనరేట్ చేస్తుంది.
Hero Splendor EV conversion kit : హీరో స్ల్పెండర్ ఈవీకి ఇస్తున్న ఎలక్ట్రిక్ కన్వర్షన్ కిట్‌పై గోగోఏ1 ఇంకా స్పందించలేదు. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ఇక ఈ హీరో స్ల్పెండర్ ఈవీ ఫీచర్స్, ధర వంటి వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవు. వీటిపైనా త్వరలోనే అప్డేట్ లభించవచ్చు.
సంబంధిత కథనం