Tata Altroz EV : టాటా మోటార్స్ నుంచి మరో ఎలక్ట్రిక్ వెహికిల్.. ఆల్ట్రోజ్ ఈవీ వచ్చేస్తోంది!
Tata Altroz EV : టాటా మోటార్స్ సంస్థ.. మరో ఎలక్ట్రిక్ వెహికిల్‌ని సిద్ధం చేస్తోంది. అదే.. టాటా ఆల్ట్రోజ్ ఈవీ. 2025లో ఇది లాంచ్ అవుతుందట!
Tata Altroz EV : దేశీయ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ మంచి జోరు మీద ఉంది. ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్లో రారాజుగా కొనసాగుతున్న టాటా మోటార్స్.. ఇటీవలే టాటా పంచ్ ఈవీని లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు.. మరో ఎలక్ట్రిక్ వెహికిల్‌ని సిద్ధం చేస్తోంది! అదే.. టాటా ఆల్ట్రోజ్ ఈవీ. 2025లో, అంటే వచ్చే ఏడాదే.. ఈ మోడల్ ఇండియాలో లాంచ్ అవుతుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఈవీపై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఓసారి చూసేద్దాము..
టాటా ఆల్ట్రోజ్ ఈవీ వచ్చేస్తోంది..
2020లో జరిగిన ఆటో ఎక్స్‌పోలోనే ఈ టాటా ఆల్ట్రోజ్ ఈవీని తొలిసారిగా ప్రదర్శించింది టాటా మోటార్స్ సంస్థ. త్వరలోనే ఇది అందుబాటులోకి వస్తుందని అందరు భావించారు. కానీ కొవిడ్ సంక్షోభంతో పాటు టాటా నెక్సాన్ ఈవీ, టాటా టియాగో ఈవీ, టాటా టిగోర్ ఈవీలకు మంచి డిమాండ్ కనిపిస్తుండటంతో.. ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌ని కాస్త పక్కకు పెట్టింది సంస్థ. ఇక టాటా పంచ్ ఈవీ కూడా వచ్చేయడంతో, ఆల్ట్రోజ్ ఈవీపై మళ్లీ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే.. 2025లో జరగనున్న ఆటో ఎక్స్‌పోలో దీనిని సంస్థ లాంచ్ చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
Tata Altroz EV on road price Hyderabad : టాటా ఆల్ట్రోజ్ ఈవీ డిజైన్.. ఐసీఈ ఇంజిన్ని పోలి ఉంటుంది. టాటా పంచ్ ఈవీలోని మోటార్‌నే ఇందులో కూడా వాడే సూచనలు కనిపిస్తున్నాయి. టాటా పంచ్ ఈవీకి, టాటా ఆల్ట్రోజ్ ఎలక్ట్రిక్ వెహికిల్‌కి మధ్య చాలా పోలికలు ఉండొచ్చు.
ఇంకా చెప్పాలంటే.. ఈ టాటా ఆల్ట్రోజ్ ఈవీకి, మార్కెట్లో అసలు పోటీనే లేదు! ఈ రకం హ్యాచ్‌బ్యాక్‌తో మార్కెట్లో ఇప్పటివరకు అసలు ఒక్క మోడల్ కూడా అందుబాటులో లేదు. అందుకే, ఆల్ట్రోజ్ ఈవీకి మంచి డిమాండ్ ఉంటుందని సంస్థ భావిస్తోంది. అయితే.. మారుతీ సుజుకీ, టయోటా, హ్యుందాయ్ వంటి దిగ్గజ ఆటోమొబైల్ సంస్థలు ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌లను ప్లాన్ చేస్తున్నాయి. అవి ఎప్పుడు లాంచ్ అవుతాయో చూడాలి.
Tata Altroz EV price Hyderabad : ఇక టాటా ఆల్ట్రోజ్ ఎలక్ట్రిక్ వెహికిల్ ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ. 11లక్షలు- రూ. 12లక్షల మధ్యలో ఉండొచ్చని టాక్ నడుస్తోంది.
ఇక ఈ టాటా ఆల్ట్రోజ్ ఈవీ ఫీచర్స్, రేంజ్, ఎలక్ట్రిక్ మోటార్ వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేదు. లాంచ్ టైమ్ దగ్గరపడే కొద్ది.. వీటిపై ఓ క్లారిటీ వస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
Tata Altroz EV launch in India : ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్‌కు క్రేజీ డిమాండ్ కనిపిస్తున్న నేపథ్యంలో.. ఈవీలపై ఆటోమొబైల్ సంస్థలు ఫోకస్ చేస్తున్నాయి. ఈవీ సెగ్మెంట్లో రారాజుగా కొనసాగుతున్న టాటా మోటార్స్.. ఆల్ట్రోజ్‌కి ఎలక్ట్రిక్ టచ్ ఇచ్చి, తన ఆధిపత్యాన్ని కొనసాగించాలని ప్లాన్ చేస్తోంది.
సంబంధిత కథనం