
(1 / 7)
టాటా మోటార్స్ నుంచి వచ్చిన నాల్గవ ఎలక్ట్రిక్ కారు పంచ్ EV. ఈ కారు రూ. 10.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లభిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ SUV టాటా EV లైనప్‌లో Nexon EV, Tiago EV ల మధ్య ఉంటుంది. ICE, CNG, EV మోడల్స్ ఉన్న రెండో టాటా కారు ఈ టాటా పంచ్.

(2 / 7)
టాటా పంచ్ EV ను Acti.VE అనే కొత్త Gen-2 ప్యూర్ EV ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించారు. టాటా నుంచి భవిష్యత్తులో రానున్న ఎలక్ట్రిక్ కార్లు హారియర్ ఈవీ, కర్వ్ లను కూడా ఇదే ప్లాట్ ఫామ్ పై నిర్మించనున్నారు. టాటా పంచ్ ఈవీ Acti.VE పై రూపొందించబడిన మొదటి EV.

(3 / 7)
టాటా పంచ్ EV రెండు బ్యాటరీ ప్యాక్‌లతో లభిస్తుంది. వాటిలో ఒకటి 25 kWh బ్యాటరీ యూనిట్ కాగా, మరకటి 35 kWh బ్యాటరీ యూనిట్. వీటిలో 25 kWh బ్యాటరీ యూనిట్ 315 కిలోమీటర్ల రేంజ్ ను అందిస్తుంది. 35 kWh యూనిట్ తో గరిష్టంగా 421 కిమీలు ప్రయాణించవచ్చు. ఈ ఎలక్ట్రిక్ SUV తో పాటు 7.2 kW ఫాస్ట్ ఛార్జర్‌తో సహా రెండు హోమ్ ఛార్జింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ టాటా పంచ్ ఎస్ యూ వీ ఎలక్ట్రిక్ కారును 50 kW DC ఫాస్ట్ ఛార్జర్‌ని ఉపయోగించి గంటలోపు 80 శాతం వరకు రీఛార్జ్ చేయవచ్చు.

(4 / 7)
పంచ్ EV ప్రత్యేకతలలో ఫ్రంక్ ఒకటి. దీనితో టాటా పంచ్ ఈవీ SUVలో ఎక్కువ స్థలం లభిస్తుంది. కొన్ని హై-ఎండ్ EVల మాదిరిగానే, టాటా ఇంజన్‌ను కలిగి ఉండే హుడ్ కింద కూడా సామాను ఉంచడానికి స్థలాన్ని సృష్టించింది. ఇది దాని సాధారణ బూట్ స్పేస్‌తో పాటు అదనంగా, గరిష్టంగా 14 లీటర్ల స్థలాన్ని అందిస్తుంది.

(5 / 7)
టాటా పంచ్ EV స్మార్ట్, స్మార్ట్+, అడ్వెంచర్, ఎంపవర్డ్, ఎంపవర్డ్+ అనే ఐదు విభిన్న వేరియంట్‌లలో లభిస్తుంది. దీని డిజైన్ Nexon EV ఫేస్‌లిఫ్ట్ తరహాలో ఉంటుంది. కొత్త హెడ్‌లైట్ సెటప్, రీడిజైన్ చేయబడిన అల్లాయ్ వీల్స్‌తో పాటు కనెక్ట్ చేయబడిన LED DRLలు పంచ్ EV ని దాని ICE, CNG మోడల్స్ నుంచి భిన్నంగా కనిపించేలా చేస్తాయి.

(6 / 7)

(7 / 7)
టాటా పంచ్ EV స్టాండర్డ్‌గా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో వస్తుంది. అలాగే, ఇందులో 360 డిగ్రీ కెమెరా, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, ESP, ఆటో-హోల్డ్ ఫంక్షన్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్నాయి. పంచ్ EV కి ఫైవ్-స్టార్ సెక్యూరిటీ రేటింగ్ ఉంది.
ఇతర గ్యాలరీలు