Tata Punch EV launch: టాటా పంచ్ ఈవీ లాంచ్ డేట్ వచ్చేసింది..-tata punch ev to be launched on january 17 see here the features specifications and other details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tata Punch Ev Launch: టాటా పంచ్ ఈవీ లాంచ్ డేట్ వచ్చేసింది..

Tata Punch EV launch: టాటా పంచ్ ఈవీ లాంచ్ డేట్ వచ్చేసింది..

HT Telugu Desk HT Telugu
Jan 13, 2024 05:23 PM IST

Tata Punch EV launch: టాటా పంచ్ ఎలక్ట్రిక్ కార్ ను లాంచ్ చేసే తేదీని టాటా మోటార్స్ ప్రకటించింది. కొత్త టాటా పంచ్ EV సెకండ్ జనరేషన్ ActiveEV ప్లాట్‌ఫారమ్‌పై రూపొందింది. ఇది సుమారు 300 కి.మీ రేంజ్ ను అందిస్తుంది.

టాటా పంచ్ ఎలక్ట్రిక్ ఎస్ యూ వీ
టాటా పంచ్ ఎలక్ట్రిక్ ఎస్ యూ వీ

Tata Punch EV launch: టాటా పంచ్ EV ని జనవరి 17, 2024న లాంచ్ చేయనున్నామని టాటా మోటార్స్ ప్రకటించింది.ఈ సెగ్మెంట్ లో టాటా పంచ్ EV అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ SUV గా నిలుస్తుంది. కొత్త టాటా పంచ్ ActiveEV అనే ప్యూర్ EV ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది.

బుకింగ్స్ ప్రారంభం

కొత్త టాటా పంచ్ ఈవీ (Tata Punch EV) కోసం ప్రి-బుకింగ్‌ ఇప్పటికే ప్రారంభమైంది. సంబంధిత టాటా డీలర్స్ వద్ద టోకెన్ అమౌంట్ గా రూ. 21,000 చెల్లించి టాటా ఈవీ పంచ్ ను బుక్ చేసుకోవచ్చు. టాటా నుంచి వచ్చిన మరో ఈవీ ఎస్ యూవీ టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ తో (Nexon EV) పోలిస్తే, టాటా పంచ్ EV భిన్నంగా కనిపిస్తుంది. ముందు వైపున కనెక్ట్ చేయబడిన LED DRLలు, క్లోజ్డ్-ఆఫ్ గ్రిల్, స్లిమ్ LED హెడ్‌ల్యాంప్‌లు మిగతా టాటా ఎస్ యూవీలతో పోలిస్తే విభిన్నంగా ఉంటాయి. ఈ ఏడాది చివర్లో విడుదల కానున్న హారియర్ EVలో కూడా డిజైన్ థీమ్ విభిన్నంగా ఉంటుంది. అలాగే, కొత్త ఏరో అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.

Tata Punch EV Features: ఫీచర్స్

కొత్త టాటా ఈవీ పంచ్ లో 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ఉంటుంది. అలాగే, కొత్త ఇల్యూమినేటెడ్ టాటా లోగోతో కూడిన టూ-స్పోక్ స్టీరింగ్ వీల్ ఉంటుంది. ఇందులో 360-డిగ్రీ కెమెరా, వెంటిలేషన్‌తో ఉన్న లెథెరెట్ సీట్లు, ఆటో హోల్డ్‌తో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, వైర్‌లెస్ ఛార్జింగ్, కార్ టెక్, క్రూయిజ్ కంట్రోల్, సన్‌రూఫ్ తదితర ఫీచర్స్ ఉన్నాయి.

Tata Punch EV Range: 300 కిమీలు

రెండవ-తరం ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించిన కొత్త టాటా పంచ్ EV మోడల్స్ లో స్టాండర్డ్‌ వర్షన్ 25 kWh, లాంగ్-రేంజ్ వర్షన్ 35 kWh బ్యాటరీ ప్యాక్‌లు ఉంటాయని తెలుస్తోంది. స్టాండర్డ్‌ వర్షన్ లో 3.3 kW, లాంగ్-రేంజ్ మోడల్‌లో 7.2 kW AC ఛార్జర్ ఉండవచ్చు. లాంగ్-రేంజ్ వెర్షన్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 300 కి.మీల రేంజ్‌ను అందించగలదని కంపెనీ చెబుతోంది. టాటా పంచ్ EVకి సంబంధించిన మరిన్ని వివరాలు జనవరి 17న లాంచింగ్ తరువాత అందుబాటులో ఉంటాయి. లాంచ్ అయిన వెంటనే డెలివరీలు ప్రారంభమవుతాయి. టాటా పంచ్ ఈవీ ధరలు రూ. 11-14 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండవచ్చని భావిస్తున్నారు.

Whats_app_banner