Tata Punch EV : టాటా పంచ్- ‘ఈవీ వర్సెస్ పెట్రోల్’.. రెండింటికి తేడా ఏంటి?
Tata Punch EV : టాటా పంచ్ ఈవీ వర్సెస్ ఐసీఈ ఇంజిన్.. ఈ రెండింటికి మధ్య ఉన్న తేడాను ఇక్కడ తెలుసుకోండి..
Tata Punch EV : ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో టాటా పంచ్ ఎస్‌యూవీకి సూపర్ డిమాండ్ కనిపిస్తోంది. ఇక ఇప్పుడు.. మచ్ అవైటెడ్ టాటా పంచ్ ఈవీని రివీల్ చేసింది టాటా మోటార్స్ సంస్థ. బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. త్వరలోనే ఈ మోడల్ లాంచ్కానుంది. ఈ టాటా పంచ్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ డిజైన్ సూపర్ అట్రాక్టివ్‌గా ఉంది. ఈ నేపథ్యంలో.. ఐసీఈ ఇంజిన్ని ఎలక్ట్రిక్ వెహికిల్‌ని పోల్చి, రెండింట్లో ఉన్న తేడాలను ఇక్కడ తెలుసుకుందాము..
టాటా పంచ్ ఈవీ వర్సెస్ ఐసీఈ- డిజైన్..
టాటా నెక్సాన్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ వర్షెన్ డిజైన్ నుంచి స్ఫూర్తి పొంది.. కొత్త టాటా పంచ్ ఈవీని డిజైన్ చేసినట్టు కనిపిస్తోంది. ఇందులో స్లీక్ కనెక్టెడ్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్, స్ప్లిట్ హెడ్‌లైట్స్, ఫాగ్ ల్యాంప్స్, మాడిఫైడ్ బంపర్ డిజైన్ వంటివి వస్తున్నాయి.
Tata Punch on road price in Hyderabad : ఇక టాటా పంచ్ ఎస్యూవీ ఐసీఈ ఇంజిన్‌కి కన్వెన్షనల్ లుక్ ఉంటుంది. కనెక్టెడ్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్ ఉండవు. రగ్గ్డ్ లుక్స్ ఉంటాయి.
ఈ రెండు వెహికిల్స్ సైడ్, రేర్ వ్యూ ఒకే విధంగా ఉంటాయి. కాకాపోతే.. ఐసీఈ ఇంజిన్‌లో ఉన్న ఫ్యూయెల్ పోర్ట్, ఎలక్ట్రిక్ వెహికిల్‌కి ఉండదు.
టాటా పంచ్ ఈవీ వర్సెస్ ఐసీఈ- ఫీచర్స్..
టాటా పంచ్ ఈవీ కేబిన్‌కి సంబంధించిన వివరాలపై ప్రస్తుతం స్పష్టత లేదు. కాగా.. ఇందులో లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన డాష్‌బోర్డ్ ఉంటుందని అంచనాలు ఉన్నాయి. డిజైన్ మాత్రం ఐసీఈ ఇంజిన్‌తో పోలి ఉంటుంది.
Tata Punch EV launch date : టాటా మోటార్స్ కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో 10.25 ఇంచ్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, 10.25 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్, వయర్లెస్ ఫోన్ ఛార్జింగ్, 360 డిగ్రీ వ్యూ కెమెరా, ఆర్కేడ్.ఈవీ యాప్ సూట్ వంటివి వస్తాయట.
ఇక ఈ రెండు టాటా పంచ్ మోడల్స్‌లో సన్‌రూఫ్, ఆటో ఫోల్డింగ్ ఓఆర్వీఎంలు, ఆడ్రాయిడ్ ఆటో- యాపిల్ కార్ప్లే వంటివి ఒకే విధంగా ఉంటాయి.
టాటా పంచ్ ఈవీ వర్సెస్ ఐసీఈ- ఇంజిన్..
Tata Punch EV price in Hyderabad : టాటా పంచ్ ఈవీలో రెండు ఎలక్ట్రిక్ ఇంజిన్లు ఉంటాయి. లాంగ్ రేంజ్, స్టాండర్డ్ రేంజ్. బ్యాటరీ ప్యాక్ వివరాలు అందుబాటులోకి రాలేదు. కానీ రేంజ్ మాత్రం కనిష్ఠంగా 300 కి.మీలు, గరిష్ఠంగా 600 కి.మీల వరకు ఉండొచ్చు!
ఇక టాటా పంచ్ ఎస్యూవీ ఐసీఈ ఇంజిన్‌లో 1199 సీసీ పెట్రోల్, 3 సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 86 హెచ్‌పీ పవర్‌ని, 115 ఎన్ఎం టార్క్‌ని జనరేట్ చేస్తుంది.
టాటా పంచ్ ఎస్యూవీ ఎక్స్‌షోరూం ధర రూ. 6లక్షలు- రూ. 10.10లక్షల మధ్యలో ఉంటుంది. ఇక ఎలక్ట్రిక్ వర్షెన్ ధర వివరాలు అందుబాటులోకి రాలేదు. కాగా.. ఈ మోడల్ ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ. 12లక్షలుగా ఉండొచ్చని మర్కెట్లో అంచనాలు ఉన్నాయి.
సంబంధిత కథనం