తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Upcoming Royal Enfield Bikes: రాయల్ ఎన్ ఫీల్డ్ నుంచి కొత్త మోడల్ బైక్స్

Upcoming Royal Enfield bikes: రాయల్ ఎన్ ఫీల్డ్ నుంచి కొత్త మోడల్ బైక్స్

HT Telugu Desk HT Telugu

08 January 2024, 19:43 IST

google News
  • Royal Enfield bikes: రాయల్ ఎన్ ఫీల్డ్ త్వరలో మరికొన్ని కొత్త మోడల్స్ ను లాంచ్ చేయనుంది. వాటిలో రెండు 350 సీసీ బైక్ లు కాగా, కొత్తగా ఐదు 450 సీసీ బైక్ లను ఇంట్రడ్యూస్ చేస్తోంది. వాటితో పాటు మరో ఆరు 650 సీసీ మోటార్ సైకిళ్లను కూడా మార్కెట్లోకి తీసుకురానుంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (91wheels)

ప్రతీకాత్మక చిత్రం

Upcoming Royal Enfield bikes: ఫిబ్రవరి 2023లో రాయల్ ఎన్ ఫీల్డ్ మొత్తం 71,544 బైక్ లను విక్రయించింది. గత సంవత్సరం ఫిబ్రవరితో పోలిస్తే, ఇది 20.9% అధికం. 2022 ఫిబ్రవరి లో రాయల్ ఎన్ ఫీల్డ్ (Royal Enfield) విక్రయించిన బైక్స్ సంఖ్య 59,160. ప్రస్తుతం రాయల్ ఎన్ ఫీల్డ్ (Royal Enfield) బైక్స్ లో హంటర్ 350 (hunter 350), బుల్లెట్ 350 (bullet 350), క్లాసిక్ 350 (classic 350), మీటియోర్ 350 (meteor 350), హిమాలయన్ (Himalayan), స్క్రామ్ 411 (Scram), ఇంటర్ సెప్టార్ 650 (Interceptor 650), కాంటినెంటల్ జీటీ 650 (Continental GT 650), సూపర్ మీటియోర్ 650 (Super Meteor 650) మోడల్స్ మార్కెట్లో ఉన్నాయి. త్వరలో 10 కి పైగా కొత్త మోడల్స్ ను రాయల్ ఎన్ ఫీల్డ్ (Royal Enfield) ఇంట్రడ్యూస్ చేయనుంది.

Upcoming Royal Enfield bikes: కొత్త మోడల్స్..

రాయల్ ఎన్ ఫీల్డ్ ((Royal Enfield)) త్వరలో రెండు 350 సీసీ బైక్ లను, కొత్తగా ఐదు 450 సీసీ బైక్ లను ఇంట్రడ్యూస్ చేయనుంది. వాటితో పాటు మరో ఆరు 650 సీసీ మోటార్ సైకిళ్లను కూడా మార్కెట్లోకి తీసుకురానుంది. 350 సీసీ బైక్ లకు నెక్స్ట్ జనరేషన్ బుల్లెట్ 350 అని, షాట్ గన్ 350 బాబర్ అని పేరు పెట్టింది.

New-gen Royal Enfield Bullet 350: న్యూ జనరేషన్ బుల్లెట్

డిజైన్, పవర్ ట్రెయిన్ లలో కీలక మార్పులతో ఈ న్యూ జనరేషన్ బుల్లెట్ 350 (New-gen Royal Enfield Bullet 350) ని రూపొందించింది. మీటియోర్ 350 ప్లాట్ ఫామ్ పైననే దీన్ని రూపొందించారు. ఇందులో 346 సీసీ ఎయిర్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ను అమర్చారు. ఇందులో కూడా 5 స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది. రెట్రో స్టైల్ (retro style) హెడ్ ల్యాంప్, వైర్ స్పోక్ వీల్స్, ఫ్లాట్ హ్యాండిల్ బార్, ఒకేవైపు ఉండే ఎగ్జాస్ట్ క్యానిస్టర్.. గత మోడల్స్ తరహాలోనే ఉంటాయి.

Royal Enfield Shotgun 350 Bobber: షాట్ గన్ 350 బాబర్

ఈ Shotgun 350 Bobber మోడల్ లో కూడా 346 సీసీ ఎయిర్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ను అమర్చారు. ఇందులో కూడా 5 స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది. టెలీస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ రెట్రో స్టైల్ హెడ్ ల్యాంప్, వైర్ స్పోక్ వీల్స్, ఫ్లాట్ హ్యాండిల్ బార్, ట్విన్ షాక్ అబ్జర్వర్స్.. గత మోడల్స్ తరహాలోనే ఉంటాయి. డిస్క్, డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి. ఈ Shotgun 350 Bobber 350 సీసీ మోడల్ బైక్ ఎక్స్ షో రూమ్ ధర సుమారు రూ. 2 లక్షలు ఉండవచ్చు.

టాపిక్

తదుపరి వ్యాసం