Hero Xtreme vs TVS Apache: హీరో మోటొకార్ప్ లేటెస్ట్ గా 2023 మోడల్ హీరో ఎక్స్ ట్రీమ్ 160ఆర్ 4వీ (Hero Xtreme 160R 4V) ని మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ బైక్ ఇప్పటికే మార్కెట్లో ఉన్న టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వీ (TVS Apache RTR 160 4V) తో పోటీ పడుతోంది. ఈ రెండు బైక్స్ లో ఏది కొనడం బెటర్ అన్న సందేహం తలెత్తుతోంది.
హీరో ఎక్స్ ట్రీమ్ 160ఆర్ 4వీ బైక్ ఎక్స్ షో రూమ్ ధరను వేరియంట్ ను బట్టి, రూ. 1.27 లక్షల నుంచి రూ. 1.37 లక్షల మధ్య హీరో మోటొకార్ప్ నిర్ణయించింది. 160 సీసీ కేటగిరీ ఇప్పుడు ప్రీమియం లైఫ్ స్టైల్ కేటగిరీలో నుంచి ప్రీమియం కమ్యూటర్ కేటగిరీలోకి మారింది. దాంతో, ప్రముఖ ఆటోమేకర్ సంస్థలన్నీ 160 సీసీ కేటగిరీలో కొత్త ప్రొడక్ట్స్ ను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. కొత్తగా వచ్చిన హీరో ఎక్స్ ట్రీమ్ 160ఆర్ 4వీ.. మార్కెట్లో ఇప్పటికే బలంగా ఉన్న టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వీ కి గట్టి పోటీ ఇస్తోంది. ఈ రెండు బైక్స్ కూడా అడ్వాన్స్ డ్ ఫీచర్లు, డైనమక్ డిజైన్ తో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి.
టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వీ ఎక్స్ షో రూమ్ ధర, వేరియంట్ ను బట్టి రూ. 1.24 లక్షల నుంచి రూ. 1.32 లక్షల మధ్య ఉంది. ఇందులో 159.7 సీసీ ఇంజిన్ ఉంది. హీరో ఎక్స్ ట్రీమ్ 160ఆర్ 4వీ బ్లేజింగ్ స్పోర్ట్స్ రెడ్, మాట్ స్లేట్ బ్లాక్, నియాన్ షూటింగ్ స్టార్ కలర్స్ లో లభిస్తుంది. టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వీ మాటీ బ్లాక్, మెటాలిక బ్లూ, నైట్ బ్లాక్, రేసింగ్ రెడ్ కలర్స్ లో లభ్యమవుతుంది. హీరో ఎక్స్ ట్రీమ్ 160ఆర్ 4వీ లో 163.2 సీసీ సింగిల్ సిలిండర్, ఎయిర్, ఆయిల్ కూలింగ్ ఇంజిన్ ను అమర్చారు. 14.6 ఎన్ఎం మాగ్జిమం టార్క్ ను, 16.6 బీహెచ్పీ పవర్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. మరోవైపు, టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వీ లో 159.7 సీసీ, సింగిల్ సిలిండర్, ఆయిల్ కూల్డ్ ఇంజిన్ ను అమర్చారు. ఇందులో కూడా 5 స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది. ఇది 14.7 ఎన్ఎం మాగ్జిమం టార్క్ ను, 17.3 బీహెచ్పీ పవర్ ను ప్రొడ్యూస్ చేస్తుంది.