Hero MotoCorp price hike : కస్టమర్లకు భారీ షాక్- హీరో బైక్స్, స్కూటర్స్ ధరల పెంపు.. !
24 June 2024, 12:45 IST
- Hero MotoCorp price hike : కస్టమర్ల జేబులకు చిల్లు! హీరో మోటోకార్ప్ సంస్థ.. తన పోర్ట్‌ఫోలియోలోని అన్ని బైక్స్, స్కూటర్స్ ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది. పూర్తి వివరాలు..
File photo of 2024 Hero హీరో బైక్స్, స్కూటర్స్ ధరల పెంపు.. !Plus Xtec 2.0.
Hero bikes price hike : కస్టమర్లకు షాక్ ఇస్తూ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ హీరో మోటోకార్ప్.. తమ వాహనాల ధరలను పెంచుతున్నట్టు సోమవారం ప్రకటించింది. పెంచిన ధరలు జులై 1, 2024 నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. ఫలితంగా.. బెస్ట్ సెల్లింగ్ హీరో స్ప్లెండర్, హీరో ప్యాషన్, హీరో గ్లామర్ ధరలు పెరగనున్నాయి.
హీరో మోటోకార్ప్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. మోడల్స్‌పై గరిష్ఠంగా రూ. 1,500 వరకు ధరల పెంపు ఉంటుంది. అయితే.. ఏ బైక్‌పై, ఏ స్కూటర్‌పై కచ్చితంగా ఎంత పెంచుతున్నామో సంస్థ ఇంకా చెప్పలేదు. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
అయితే.. వాహనాల ధరల పెంపు నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందనే దానిపై ప్రతి ఆటోమొబైల్ సంస్థ చెప్పే మాటలే హీరో మోటోకార్ప్ పునరుద్ఘటించింది. ముడిసరకు ధరలు పెరిగిన నేపథ్యంలో వాహనాల ధరలను పెంచుతున్నట్టు స్పష్టం చేసింది.
Hero splendor on road price in Hyderabad : 2 వీలర్ వాహనాల తయారీలో ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థగా కొనసాగుతోంది హీరో మోటోకార్ప్. ఇండియన్ మార్కెట్‌పైనా మంచి పట్టు ఉంది. కానీ.. గత మే నెలలో (ఇయర్ ఆన్ ఇయర్) సంస్థ సేల్స్ 7శాతం తగ్గాయి. 2023 మేలో 5,08,309 యూనిట్లను విక్రయించిన హీరో మోటోకార్ప్.. ఈసారి మాత్రం 4,79,450 యూనిట్లను అమ్మగలిగింది. అయితే.. గతేడాదితో పోల్చితే ఈసారి ఎగుమతులు పెరిగాయి. 2023 మేతో (11,165) పోల్చితే.. ఈసారి 18,673 యూనిట్లను విక్రయించింది.
ఇదీ చూడండి:- BMW CE 04 : ఇండియాలో బీఎండబ్ల్యూ సీఈ 04 ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ డేట్ ఫిక్స్..
ధరల పెంపుతో సంస్థ సేల్స్‌పై ప్రభావం ఎంత?
హీరో మోటోకార్ప్ పోర్ట్‌ఫోలియోలో హీరో స్ప్లెండర్, హీరో ప్యాషన్, హీరో గ్లామర్, ఎక్స్‌పల్స్, ఎక్స్ట్రీమ్, డెస్టినీ, ప్లెజర్+ లు ఉన్నాయి. వీటిల్లో చాలా వరకు బెస్ట్ సెల్లింగ్ మోడల్స్గానే ఉన్నాయి.
అయితే.. ప్రైజ్ పాయింట్ విషయంలో దేశీయ 2- వీలర్ ఆటోమొబైల్ మార్కెట్ చాలా సెన్సిటివ్. కాగా.. ధరల పెంపుతో డిమాండ్ తగ్గకపోవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. పైగా.. ఈసారి రుతుపవనాలు సాధారణం కన్నా మెరుగ్గా ఉంటాయన్న వార్తల నేపథ్యంలో.. రూరల్ మార్కెట్లో మంచి డిమాండ్ కనిపిస్తుందని ఆశిస్తున్నాయి.
Hero price hike : అయితే.. డిమాండ్ ఉన్నా, సప్లై చెయిన్ సరఫరాలో జాప్యం, మార్కెటింగ్ కార్యకలాపాలు సరిగ్గా లేకపోవడం.. మార్కెట్‌కు నష్టం చేస్తాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
హీరో మోటోకార్ప్ తర్వాత ఇతర సంస్థలు కూడా తమ వాహనాల ధరలను పెంచుతాయో లేదో చూడాలి.
గత కొన్నేళ్లుగా వాహనాల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రజల జేబుకు చిల్లులు పడుతూనే ఉన్నాయి. పైగా.. లోక్‌సభ ఎన్నికల కోసం ఓపికపట్టిన రాష్ట్రాలు.. ఇప్పుడిప్పుడే పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం మొదలుపెట్టాయి. ఈ జాబితాలో కర్ణాటక, గోవా చేరాయి. త్వరలో మరిన్ని రాష్ట్రాలు ఈ లిస్ట్‌లో చేరే అవకాశం ఉంది. ఇది.. కస్టమర్లపై భారాన్ని మరింత పెంచుతుంది.