తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Petrol Diesel Price Hike : పెట్రోల్, డీజిల్​ ధరలు పెంపు- నేటి నుంచే అమలు..

Petrol diesel price hike : పెట్రోల్, డీజిల్​ ధరలు పెంపు- నేటి నుంచే అమలు..

Sharath Chitturi HT Telugu

22 June 2024, 7:21 IST

google News
    • Petrol diesel price news : పెట్రోల్​, డీజిల్​ ధరలను పెంచి.. కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే ప్రజలకు షాక్​ ఇచ్చింది. ఇక ఈ లిస్ట్​లోకి తాజాగా మరో రాష్ట్రం కూడా చేరింది.
ట్రోల్, డీజిల్​ ధరలు పెంపు
ట్రోల్, డీజిల్​ ధరలు పెంపు (HT_PRINT)

ట్రోల్, డీజిల్​ ధరలు పెంపు

ెలిసిPetrol Diesel prices news : 2024 లోక్​సభ ఎన్నికల నేపథ్యంలో చాలా కాలం పాటు ఓపిక పట్టిన రాష్ట్రాలు.. ఇప్పుడు ఒక్కొక్కటిగా పెట్రోల్​, డీజిల్​ ధరలను పెంచుతున్నాయి. కర్ణాటక ప్రభుత్వం ఇటీవలే ఇంధన ధరలు పెంచిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు.. ఈ జాబితాలోకి గోవా కూడా చేరింది. రాష్ట్రంలో పెట్రోల్​, డీజిల్​ ధరలపై వ్యాట్​ (వాల్యూ యాడెడ్​ ట్యాక్స్​)ని పెంచింది గోవా ప్రభుత్వం. ఈ పెంచిన ధరలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి.

ధరల పెంపు.. ప్రజల జేబుకు చిల్లు..!

పెట్రోల్​పై 21.5శాతం, డీజిల్​పై 17.5శాతం మేర వ్యాట్​ని పెంచింది గోవా ప్రభుత్వం. అంటే.. లీటరు పెట్రోల్​పై రూ.1, లీటరు డీజిల్​పై 30 పైసలు పెరిగినట్టు. ఫలితంగా.. గోవాలో లీటరు పెట్రోల్​ ధర రూ. 96.61, లీటరు డీజిల్​ ధర రూ. 88.42కి చేరింది. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే.. తాజా ధరల పెంపు తర్వాత కూడా.. గోవాలో పెట్రోల్​, డీజిల్​ ధరలు తక్కువగానే ఉన్నట్టు!

జూన్​ 15న కర్ణాటక ప్రభుత్వం.. పెట్రోల్​, డీజిల్​ ధరలపై వ్యాట్​ని పెంచిన విషయం తెలిసిందే. ఫలితంగా.. ఆ రాష్ట్రంలో లీటరు పెట్రోల్, లీటరు డీజిల్​ ధరలు రూ. 3 పెరిగాయి. ఫలితంగా.. బెంగళూరులో లీటరు పెట్రోల్​ ధర రూ. 102.84గాను, లీటరు డీజిల్​ ధర రూ. 88.95గాను ఉంది.

ఇదీ చూడండి:- Maruti Suzuki Fronx Velocity Edition : ఫ్రాంక్స్​ కొత్త ఎడిషన్​ లాంచ్​.. ఫీచర్స్​, ధర వివరాలివే

Petrol price in Hyderabad : లోక్​సభ ఎన్నికలకు ముందు.. పెట్రోల్​, డీజిల్​ ధరలను రూ. 2 తగ్గిస్తున్నట్టు ప్రకటించింది కేంద్రం. అప్పటి నుంచి దేశంలోని ఇతర ప్రాంతాల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇప్పుడు ఒకొక్క రాష్ట్రం.. ధరలను పెంచుకుంటూ వస్తోంది. మరి ఈ జాబితాలోకి త్వరలో ఇంకెన్ని రాష్ట్రాలు చేరుతాయో, ప్రజలకు జేబులకు ఎంత మేర చిల్లు పడుతుందో చూడాలి.

దేశవ్యాప్తంగా పెట్రోల్​, డీజిల్​ ధరలు గరిష్ఠ స్థాయిల్లోనే ఉన్నాయి. దేశంలో లీటరు పెట్రోల్​ సగటు ధర రూ. 100గా ఉంది. వివిధ రాష్ట్రాల్లో ట్యాక్స్​లు వేరువేరుగా ఉండటంతో పెట్రోల్​, డీజిల్​ ధరలు మారుతూ ఉంటాయి.

హైదరాబాద్​లో లీటరు పెట్రోల్​ ధర రూ. 107.41గా ఉంది. లీటరు డీజిల్​ ధర రూ. 95.65గా ఉంది.

Diesel price in Hyderabad today : విజయవాడలో లీటరు పెట్రోల్​ ధర రూ. 109.52గా ఉంది. లీటరు డీజిల ధర రూ. 97.37గా ఉంది.

ఇంధన ధరల్లో ఎందుకు వ్యత్యాసం ఉంటుంది?

ఇందాక చెప్పినట్టు.. దేశంలోని ఒక్కో రాష్ట్రంలో వ్యాట్​ అనేది ఒక్కో విధంగా ఉంటుంది. ఎక్సైజ్​ డ్యూటీ సహా ఇతర పరిణామాలను లెక్కించి, ట్యాక్స్​లు విధిస్తారు. ఫలితంగా.. పెట్రోల్​, డీజిల్​ ధరల్లో వ్యత్యాసం కనిపిస్తుంది.

అటు అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతుండటం ఆందోళనకు గురిచేస్తున్న విషయం. వారం రోజుల్లో చమురు ధరలు దాదాపు 5శాతం పెరిగినట్టు తెలుస్తోంది.

తదుపరి వ్యాసం