ెలిసిPetrol Diesel prices news : 2024 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో చాలా కాలం పాటు ఓపిక పట్టిన రాష్ట్రాలు.. ఇప్పుడు ఒక్కొక్కటిగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతున్నాయి. కర్ణాటక ప్రభుత్వం ఇటీవలే ఇంధన ధరలు పెంచిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు.. ఈ జాబితాలోకి గోవా కూడా చేరింది. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్ (వాల్యూ యాడెడ్ ట్యాక్స్)ని పెంచింది గోవా ప్రభుత్వం. ఈ పెంచిన ధరలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి.
పెట్రోల్‌పై 21.5శాతం, డీజిల్‌పై 17.5శాతం మేర వ్యాట్ని పెంచింది గోవా ప్రభుత్వం. అంటే.. లీటరు పెట్రోల్‌పై రూ.1, లీటరు డీజిల్‌పై 30 పైసలు పెరిగినట్టు. ఫలితంగా.. గోవాలో లీటరు పెట్రోల్ ధర రూ. 96.61, లీటరు డీజిల్ ధర రూ. 88.42కి చేరింది. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే.. తాజా ధరల పెంపు తర్వాత కూడా.. గోవాలో పెట్రోల్, డీజిల్ ధరలు తక్కువగానే ఉన్నట్టు!
జూన్ 15న కర్ణాటక ప్రభుత్వం.. పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్ని పెంచిన విషయం తెలిసిందే. ఫలితంగా.. ఆ రాష్ట్రంలో లీటరు పెట్రోల్, లీటరు డీజిల్ ధరలు రూ. 3 పెరిగాయి. ఫలితంగా.. బెంగళూరులో లీటరు పెట్రోల్ ధర రూ. 102.84గాను, లీటరు డీజిల్ ధర రూ. 88.95గాను ఉంది.
Petrol price in Hyderabad : లోక్‌సభ ఎన్నికలకు ముందు.. పెట్రోల్, డీజిల్ ధరలను రూ. 2 తగ్గిస్తున్నట్టు ప్రకటించింది కేంద్రం. అప్పటి నుంచి దేశంలోని ఇతర ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇప్పుడు ఒకొక్క రాష్ట్రం.. ధరలను పెంచుకుంటూ వస్తోంది. మరి ఈ జాబితాలోకి త్వరలో ఇంకెన్ని రాష్ట్రాలు చేరుతాయో, ప్రజలకు జేబులకు ఎంత మేర చిల్లు పడుతుందో చూడాలి.
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు గరిష్ఠ స్థాయిల్లోనే ఉన్నాయి. దేశంలో లీటరు పెట్రోల్ సగటు ధర రూ. 100గా ఉంది. వివిధ రాష్ట్రాల్లో ట్యాక్స్‌లు వేరువేరుగా ఉండటంతో పెట్రోల్, డీజిల్ ధరలు మారుతూ ఉంటాయి.
హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ. 107.41గా ఉంది. లీటరు డీజిల్ ధర రూ. 95.65గా ఉంది.
Diesel price in Hyderabad today : విజయవాడలో లీటరు పెట్రోల్ ధర రూ. 109.52గా ఉంది. లీటరు డీజిల ధర రూ. 97.37గా ఉంది.
ఇందాక చెప్పినట్టు.. దేశంలోని ఒక్కో రాష్ట్రంలో వ్యాట్ అనేది ఒక్కో విధంగా ఉంటుంది. ఎక్సైజ్ డ్యూటీ సహా ఇతర పరిణామాలను లెక్కించి, ట్యాక్స్‌లు విధిస్తారు. ఫలితంగా.. పెట్రోల్, డీజిల్ ధరల్లో వ్యత్యాసం కనిపిస్తుంది.
అటు అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతుండటం ఆందోళనకు గురిచేస్తున్న విషయం. వారం రోజుల్లో చమురు ధరలు దాదాపు 5శాతం పెరిగినట్టు తెలుస్తోంది.
సంబంధిత కథనం