Discounts on Tata cars : ఏప్రిల్​లో ఈ టాటా మోటార్స్​ వాహనాలపై డిస్కౌంట్లు..-tata motors announces discounts on select models in india in april ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Discounts On Tata Cars : ఏప్రిల్​లో ఈ టాటా మోటార్స్​ వాహనాలపై డిస్కౌంట్లు..

Discounts on Tata cars : ఏప్రిల్​లో ఈ టాటా మోటార్స్​ వాహనాలపై డిస్కౌంట్లు..

Sharath Chitturi HT Telugu
Apr 07, 2024 12:41 PM IST

Discounts on Tata cars in April : ఏప్రిల్​లో టాటా మోటార్స్​ వాహనాలపై పలు డిస్కౌంట్స్​ లభిస్తున్నాయి. వాటిని ఇక్కడ చెక్​ చేయండి..

ఈ టాటా మోటార్స్​ కార్లపై డిస్కౌంట్లు..
ఈ టాటా మోటార్స్​ కార్లపై డిస్కౌంట్లు.. (REUTERS)

Tata motors April discounts : మండుతున్న ఎండల్లో కస్టమర్లకు చల్లటి కబురు ఇచ్చింది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ టాటా మోటార్స్​. పలు ఎంపిక చేసిన మోడల్స్​పై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ఎంవై23, ఎంవై24 మోడల్స్​కి ఈ డిస్కౌంట్లు వర్తిస్తున్నాయి. పూర్తి వివరాలను ఇక్కడ చూసేయండి..

ఈ టాటా వాహనాలపై భారీ డిస్కౌంట్లు..

టాటా నెక్సాన్​, టాటా టిగోర్​, టాటా ఆల్ట్రోజ్​, టాటా టియాగోలకు చెందిన ఎంవై24 వెహికిల్స్​పై డిస్కౌంట్లు ఇస్తోంది సంస్థ. టాటా టియాగో ఎక్స్​టీ(ఓ), ఎక్స్​టీ, ఎక్స్​జెట్​+ పై అత్యధిక డిస్కౌంట్లు ఉన్నాయి. ఆల్ట్రోజ్​ పెట్రోల్​ (మేన్యువల్​), డీజిల్​ వేరియంట్లపై రూ. 35వేల వరకు తగ్గింపు పొందొచ్చు.

ఇక సంస్థకు బెస్ట్​ సెల్లింగ్​ మోడల్​గా ఉన్న నెక్సాన్​ ఎస్​యూవీపై స్క్రాపేజ్​ బోనస్​/ ఎక్స్​ఛేంజ్​ కింద రూ. 15వేలు తగ్గిస్తోంది టాటా మోటార్స్​.

Tata Nexon SUV discounts April : ఆల్ట్రోజ్​ సీఎన్​జీ, డీసీఏ వర్షెన్​లపై రూ. 20వేల వరకు డిస్కౌంట్​ పొందొచ్చు. ఇందులో.. కన్జ్యూమర్​ బోనస్​ రూ. 10వేలు, స్క్రాపేజ్​ డిస్కౌంట్​ రూ. 10వేలు ఉన్నాయి. ఆల్ట్రోజ్​ డీసీఏ, సీఎన్​జీ వేరియంట్లకు చెందిన ఎంవై23 వెహికిల్స్​పై అత్యధికంగా రూ. 25వేల వరకు తగ్గింపు లభిస్తుండటం విశేషం.

ఇక టాటా మోటార్స్​ ఫ్లాగ్​షిప్​ ఎస్​యూవీ అయిన టాటా హారియర్​, టాటా సఫారీ (ప్రీ-ఫేస్​లిఫ్ట్​ కార్లు)పైనా డిస్కౌంట్లు ఉన్నాయి. ఈ రెండు మోడల్స్​పై గరిష్ఠంగా రూ. 75వేల వరకు కస్టమర్లు తగ్గింపు పొందొచ్చు.

Tata Altroz price in Hyderabad : ఈ మోడల్స్​కి చెందిన నాన్​-అడాస్​ వర్షెన్​లపై స్క్రాపేజ్​/ ఎక్స్​ఛేంజ్​ డిస్కౌంట్​ కింద రూ. 25వేల తగ్గింపు లభిస్తోంది. అడాస్​ వర్షెన్​లపై స్క్రాపేజ్​/ ఎక్స్​ఛేంజ్​ డిస్కౌంట్స్​ కింద రూ.20వేలు ఆదా చేసుకోవచ్చు.

అయితే.. కార్లపై డిస్కౌంట్లు అనేవి ఒక్క లొకేషన్​లో ఒక్కో విధంగా ఉంటాయి. అందుకే ఈ డిస్కౌంట్లు, ఆఫర్స్​కి సంబంధించిన పూర్తి వివరాల కోసం మీరు మీ సమీప డీలర్​షిప్​ షోరూమ్​ను సందర్శించాల్సి ఉంటుంది. అప్పుడే మీకు క్లారిటీ వస్తుంది. కొత్త వెహికిల్​ని కొనేందుకు కచ్చితమైన బడ్జెట్​ వేసుకునేందుకు ఉపయోగపడుతుంది.

హోండా కార్లపైనా భారీ డిస్కౌంట్లు..

Discounts on Honda cars in April 2024 : హోండా కార్స్ ఇండియా.. ఏప్రిల్ 2024 కోసం తమ వాహనాలపై పలు డిస్కౌంట్స్​ని ప్రకటించింది. వీటిలో అత్యధిక డిస్కౌంట్​.. హోండా అమేజ్​పై లభిస్తుంది. తరువాత.. హోండా సిటీ, హోండా ఎలివేట వంటి వెహికిల్స్​ ఉన్నాయి. అమేజ్ రూ.83,000 వరకు, సిటీ రూ.71,500 వరకు బెనిఫిట్స్ పొందుతుండగా, ఎలివేట్ రూ.19,000 వరకు బెనిఫిట్స్ అందిస్తోంది.

హోండా కార్స్ హోండా ఎలివేట్​పై 'సెలబ్రేషన్ ఆఫర్' అందిస్తోంది. రూ .19,000 వరకు ప్రయోజనాలు పొందొచ్చు. హోండా పోర్ట్​ఫోలియోలో ఉన్న ఏకైక ఎస్​యూవీ ఎలివేట్. దీని ధర రూ.11.69 లక్షల నుంచి రూ.16.51 లక్షల మధ్యలో ఉంది. రెండు ధరలు కూడా ఎక్స్-షోరూమ్ ధరలు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

సంబంధిత కథనం